ఒంటారియో: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో దూకుడు కొనసాగిస్తున్నాడు. టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్.. సోమవారం విన్నీపెగ్ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులతో ఆకట్టకున్నాడు. అంతకుముందు ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ధాటిగా ఆడి 35 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అదే జోరును విన్నీ పెగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొనసాగించాడు యువీ.
విన్నీపెగ్ హాక్స్‌తో మ్యాచ్‌లో యువీకి జతగా రోడ్రిగో థామస్(65), కీరోన్ పొలార్డ్(52)లు రాణించడంతో టోరంటో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కాగా, 217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన విన్నీపెగ్ చివరి బంతికి విజయం సాధించింది. క్రిస్ లిన్(89), షమాన్ అన్వర్(43), సన్నీ సొహాల్(58)లు విన్నీ పెగ్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.( ఇక్కడ చదవండి: యువీ.. వాటే సిక్స్)
Comments
Please login to add a commentAdd a comment