ఓడితే మళ్లీ పోటీ చేయనని వ్యాఖ్యలు
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ఓడితే ఇంకెప్పుడూ పోటీ చేయబోనని రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చేతిలో ఓడితే మళ్లీ పోటీ చేస్తారా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. అయితే విజయం తనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తన ఓటమి గురించి మాట్లాడటం గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి.
తాను ఓడటమంటూ జరిగితే యూదు ఓటర్ల వల్లేనని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలోని యూదుల్లో 60 శాతం శత్రువుకు మద్దతిస్తున్నారు. ఆ కారణంగా నేనోడితే ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండదు’’అంటూ హెచ్చరించారు. 78 ఏళ్ల ట్రంప్ గత మూడు ఎన్నికల నుంచి వరుసగా పోటీ చేస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం అధ్యక్షునిగా రెండుసార్లకు మించి పని చేయడానికి వీల్లేదు. కనుక ఈసారి ట్రంప్ గెలిస్తే 2028లో పోటీ చేయలేరు.
Comments
Please login to add a commentAdd a comment