not contest
-
కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగిన అనిత
ఒట్టావా: కెనడా ప్రధాని బరినుంచి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ వైదొలిగారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనిత.. పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు శనివారం ప్రకటించారు. అంతేకాదు తాను ఎంపీగా మళ్లీ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ప్రధానిగా, పార్టీ అధినేతగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ఆమె బరిలోకి వచ్చారు. అయితే.. వారంలోపే తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా లిబరల్ బృందానికి, ఓక్విల్లే ప్రజలకూ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ జట్టులోకి నన్ను ఆహ్వానించినందుకు, కీలకమైన కేబినెట్ శాఖలను అప్పగించినందుకు ప్రధాని ట్రూడోకు హృదయపూర్వక ధన్యవాదాలు. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌కు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను ఎన్నుకున్నందుకు, గత ఇరవై సంవత్సరాలుగా నా భర్త, నేను మా నలుగురు పిల్లలను పెంచేందుకు స్వాగతించిన అద్భుతమైన ఓక్విల్లే ప్రజలకు నేను నిజంగా కృతజ్ఞురాలిని’’ అని అనిత తన ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల వరకు తాను ఎంపీగా కొనసాగుతానన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తి ఓక్విల్లేలో గెలవడం సాధ్యం కాదని చాలా మంది రాశారని, అయినప్పటికీ ఒక్కసారి కాదు రెండుసార్లు గెలిపించి ప్రజలు తన వెనుకే నిలిచారని చెప్పారు. ఈ గౌరవం ఎప్పటికీ తన గుండెల్లో నిలిచిపోతుందన్నారు. -
USA Presidential Elections 2024: ట్రంప్ నోట ఓటమి మాట
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ఓడితే ఇంకెప్పుడూ పోటీ చేయబోనని రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చేతిలో ఓడితే మళ్లీ పోటీ చేస్తారా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. అయితే విజయం తనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తన ఓటమి గురించి మాట్లాడటం గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి. తాను ఓడటమంటూ జరిగితే యూదు ఓటర్ల వల్లేనని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలోని యూదుల్లో 60 శాతం శత్రువుకు మద్దతిస్తున్నారు. ఆ కారణంగా నేనోడితే ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండదు’’అంటూ హెచ్చరించారు. 78 ఏళ్ల ట్రంప్ గత మూడు ఎన్నికల నుంచి వరుసగా పోటీ చేస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం అధ్యక్షునిగా రెండుసార్లకు మించి పని చేయడానికి వీల్లేదు. కనుక ఈసారి ట్రంప్ గెలిస్తే 2028లో పోటీ చేయలేరు. -
అప్పటిదాకా పోటీచేయను
శ్రీనగర్: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ తొలగించిన ఆర్టికల్ 370ను పునరుద్ధరించేదాకా తాను శాసనసభ సమరంలో అడుగుపెట్టబోనని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం అయిన మెహబూబా బుధవారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ రద్దయిన ఆర్టికల్‌ను పునరుద్ధరించే వరకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగను. ఇది సరైన నిర్ణయం కాదని నాకూ తెలుసు. కానీ ఇది భావోద్వేగంతో తీసుకున్న కఠిన నిర్ణయం. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే తమ రహస్య ఎజెండా కార్యరూపం దాల్చదనే భయంతోనే బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్టికల్‌ను తొలగించింది. ‘ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని కేంద్రం చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయితీ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి అసలైన గీటురాయి అన్నపుడు ప్రధాని, హోం మంత్రి వంటి వేరే పదవులు ఎందుకు ? వాళ్లు ఏం చేస్తున్నట్లు ?. కశ్మీర్ ప్రజలను బలహీనపరచి తమ ముందు సాగిలపడేలా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది’ అని ఆరోపించారు. -
గోవా రాజకీయాల్లో కీలక మార్పు.. పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి
పనాజీ: గోవా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రతాప్ సింహ రాణే .. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. గతేడాది డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ ఆయనను పోరియం నియోజకవర్గం నుంచి పోటీకి ఎంపిక చేసింది. అయితే, తాజాగా, ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం గోవా రాజకీయాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. అయితే, భారతీయ జనతా పార్టీ పోరియం నియోజక వర్గం నుంచి ప్రతాప్ రాణే కోడలు.. దేవీయ విశ్వజిత్ రాణేను బరిలో బరిలో దింపింది. అయితే, దీనిపై ప్రతాప్ సింహ రాణే (87ఏళ్లు) స్పందించారు. ప్రస్తుతం వయసురీత్యా శారీరక సమస్యల వలనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు. కాగా, ప్రతాప్ సింహ రాణే పోరియం నియోజక వర్గం నుంచి 11 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అత్యధిక కాలం గోవా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అదే విధంగా, ఆయన కుమారుడు విశ్వజీత్ రాణే గోవా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. విశ్వజిత్ రాణే.. 2017లో బీజేపీలో చేరారు. అయితే, దీనిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి చిదంబరం స్పందించారు. ప్రతాప్ రాణే పోటీ నుంచి తప్పుకోవడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ అన్నారు. పోరియం నియోజక వర్గానికి ఆయనకు.. 50 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆ నియోజక వర్గం కాంగ్రెస్‌కు కంచు కోటలాంటిదన్నారు. అయితే, మీరే ఆ నియోజక వర్గం నుంచే పోటీ చేయండి లేదా సరైన నాయకత్వ లక్షణాలున్న అభ్యర్థిని సూచించాలని ప్రతాప్ సింహ రాణేను కోరారు. చదవండి: యువతిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. సాముహిక అత్యాచారం.. ఆపై -
‘నన్ను కూడా పోటీ చేయొద్దన్నారు’
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్లకు ఉద్వాసన పలుకుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తునంది. ఇప్పటకే 75 ఏళ్లు పై బడిన వారు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నియమం తీసుకొచ్చి సీనియర్లను పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలో పార్టీని బలపర్చడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ముఖ్య నాయుకుల విషయంలోను ఇదే వైఖరి అవలంభిస్తూ విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ కురువృద్ధుడు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించిన అద్వాణీని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో సీనియర్ నేత చేరారు. ‘నన్ను పోటీ చేయవద్దని చెప్పారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషి. ఈ మేరకు ఆయన ఓటర్లను ఉద్దేశిస్తూ రాశారంటూ ఓ లేఖ కూడా ప్రచారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తనను కోరిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు.. రానున్న ఎన్నికల్లో కాన్పూర్ నుంచే కాకుండా.. అసలు ఎక్కడి నుంచి కూడా పోటీ చేయోద్దని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ఈరోజు నన్ను కోరారు’ అని లేఖలో ఉంది. అయితే దీనిపై ఆయన సంతకం లేకపోవడం గమనార్హం. అయితే తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు మురళీ మనోహర్ జోషి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఒకవేళ తను పోటీ చేసే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దాన్ని స్వయంగా పార్టీ అధ్యక్షుడు తనకు తెలియజేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ప్రధాని మోదీ కోసం వారణాసి నుంచి తప్పుకున్నారు. కాన్పూర్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అద్వాణీ విషయంలో కూడా పార్టీ ఇలానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏళ్లుగా అద్వాణీ నాయకత్వం వహిస్తోన్న గాంధీ నగర్ సీటును ఈ ఏడాది అమిత్ షాకు కేటాయించారు. అయితే దీని గురించి అద్వాణీకి ముందుగా సమాచారం ఇవ్వలేదని.. ఆయనను సంప్రదించలేదని సమాచారం. ఈ విషయంలో అద్వాణీ తీవ్రంగా కలత చెందారని ఆయన సన్నిహితులు తెలిపారు. -
ఆళ్లగడ్డ ఎన్నికల్లో పోటీ చేయం: టీడీపీ
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని అధికార టీడీపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. పాత సంప్రదాయాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే మృతితో జరిగిన కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో టీడీపీ ఇదే సంప్రదాయాన్ని పాటించనున్నట్టు కేఈ తెలిపారు. అభ్యర్థిని నిలపాలని కర్నూలు జిల్లా నేతలు కొందరు ప్రతిపాదించినా టీడీపీ నాయకత్వం తిరస్కరించింది. గత ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల షెడ్యూలు : నామినేషన్లు - ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు పరిశీలన - ఈనెల 22న ఉపసంహరణ - ఈనెల 24న పోలింగ్ - నవంబర్ 8న ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న