పనాజీ: గోవా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రతాప్ సింహ రాణే .. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. గతేడాది డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ ఆయనను పోరియం నియోజకవర్గం నుంచి పోటీకి ఎంపిక చేసింది. అయితే, తాజాగా, ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం గోవా రాజకీయాల్లో తీవ్ర చర్చకు కారణమైంది.
అయితే, భారతీయ జనతా పార్టీ పోరియం నియోజక వర్గం నుంచి ప్రతాప్ రాణే కోడలు.. దేవీయ విశ్వజిత్ రాణేను బరిలో బరిలో దింపింది. అయితే, దీనిపై ప్రతాప్ సింహ రాణే (87ఏళ్లు) స్పందించారు. ప్రస్తుతం వయసురీత్యా శారీరక సమస్యల వలనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు. కాగా, ప్రతాప్ సింహ రాణే పోరియం నియోజక వర్గం నుంచి 11 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అత్యధిక కాలం గోవా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అదే విధంగా, ఆయన కుమారుడు విశ్వజీత్ రాణే గోవా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. విశ్వజిత్ రాణే.. 2017లో బీజేపీలో చేరారు. అయితే, దీనిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి చిదంబరం స్పందించారు. ప్రతాప్ రాణే పోటీ నుంచి తప్పుకోవడం కాంగ్రెస్కు ఎదురుదెబ్బ అన్నారు. పోరియం నియోజక వర్గానికి ఆయనకు.. 50 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆ నియోజక వర్గం కాంగ్రెస్కు కంచు కోటలాంటిదన్నారు. అయితే, మీరే ఆ నియోజక వర్గం నుంచే పోటీ చేయండి లేదా సరైన నాయకత్వ లక్షణాలున్న అభ్యర్థిని సూచించాలని ప్రతాప్ సింహ రాణేను కోరారు.
చదవండి: యువతిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. సాముహిక అత్యాచారం.. ఆపై
Comments
Please login to add a commentAdd a comment