రాంచీ: జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నవంబర్ 13న రాష్ట్రంలోని 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బంది వివిధ బూత్‌లకు తరలివెళ్లారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఏ పార్టీలు గరిష్ట సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టాయనే విషయానికొస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జేఎల్‌కెఎం)కి చెందిన 35 మంది అభ్యర్థులు తొలి దశలో పోటీ చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 29 మంది, జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి 23 మంది, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్) నుంచి 19 మంది, భారత్ ఆదివాసీ పార్టీ నుంచి 18 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. ఈ దశలో జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాల్లో 53 పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 334 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో 1211 మంది అభ్యర్థులు పోటీ చేయగా, మొదటి దశలో 43 స్థానాల్లో 683 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి ఉన్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న జాతీయ పార్టీలు 12 మంది మహిళలు సహా 87 మంది అభ్యర్థులను బరిలోకి దించాయి. జార్ఖండ్‌లోని గుర్తింపు పొందిన రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి మహిళలు సహా 32 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఇతర రాష్ట్రాల రిజిస్టర్డ్ పార్టీలు ముగ్గురు మహిళలతో సహా 42 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. నమోదిత (గుర్తింపు లేని) రాజకీయ పార్టీలు 20 మంది మహిళలతో సహా 188 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. స్వతంత్ర అభ్యర్థులలో 299 మంది పురుషులు, 34 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఫోన్‌తో ఎన్నికల ర్యాలీలో ప్రచారం.. ఈసీపై సీఎం సతీమణి ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment