జార్ఖండ్‌ పోలింగ్‌: 65 శాతం ఓటింగ్‌ నమోదు | Jharkhand Assembly Election 2024 Phase 1 Voting Live Updates | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ పోలింగ్‌: 65 శాతం ఓటింగ్‌ నమోదు

Published Wed, Nov 13 2024 6:39 AM | Last Updated on Wed, Nov 13 2024 8:05 PM

Jharkhand Assembly Election 2024 Phase 1 Voting Live Updates

Updates

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది.  సాయంత్రం 5 గంటల వరకు 64.86 శాతం పోలింగ్‌ నమోదు

     మధ్యా హ్నం 3 గంటల వరకు 59.28 శాతం పోలింగ్‌ నమోదు

  • భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రాంచీలోని పోలింగ్‌ బూత్‌లో సతీమణి సాక్షితో కలిసి ఓటు వేశారు.

    మధ్యాహ్నం 1 గంట వరకు 46% పోలింగ్‌ నమోదైంది.

     బీజేపీ నేత జయంత్ సిన్హా హజారీబాగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

     

 

  • జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి సోనాపిలోని ప్రాథమిక విద్యాలయం వద్ద ఓటర్లు నక్సల్స్ బెదిరింపులను ధిక్కరించి భారీ సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చారు. 
  • నక్సలైట్లు.. పోస్టర్లు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
  • భద్రతా బలగాలు పోస్టర్లు, అడ్డంకులను విజయవంతంగా తొలగించాయి. 
  • జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి, జగన్నాథ్‌పూర్ పోలింగ్ బూత్ నంబర్ 25లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.

     

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది
  • ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం ఓటింగ్ నమోదైంది

 

  • జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

 

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది.  
  • ఉదయం 9 గంటల వరకు 13.04 శాతం ఓటింగ్ నమోదు

  • మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు అర్జున్ ముండా, ఆయన భార్య మీరా ముండా ఓటు శారు.
  • సెరైకెలా ఖర్సావాన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
  • పొత్కా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మీరాముండా బరిలో ఉన్నారు.

 

  • జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది.
  • ఒడిశా గవర్నర్ , జార్ఖండ్ మాజీ సిఎం రఘుబర్ దాస్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.​
  • జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటువేశారు.

 

  • కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి ఓటు హకక్కు వినియోగించుకున్నారు.
  • కోడెర్మాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
  • జార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది.

 

  • రాంచీలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.
  • పోలీసులు డ్రోన్‌లను ఉపయోగించి నిఘా పెట్టారు.

 

 

  • హజారీబాగ్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మున్నా సింగ్ ఓటు వేశారు.
  • హజారీబాగ్‌లో అభివృద్ధి, శ్రేయస్సు తీసుకురావడానికి ఓటు వేయాలని హజారీబాగ్ ఓటర్లందరినీ అభ్యర్థించారు.

 

పూర్తి ఉత్సాహంతో ఓటు వేయండి: ప్రధాని మోదీ

  • జార్ఖండ్ తొలి దశ పోలింగ్‌లో పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని ప్రధాని మోదీ ఓరట్లను కోరారు. 
  • తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు క్యూలైన్లలో ఉన్నారు. 

 

  • జార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 
  • జంషెడ్‌పూర్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అజోయ్ కుమార్ ఓటు వేశారు. 
  • జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

     

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ ఓటు వేశారు.

     

  • జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • జంషెడ్‌పూర్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ నేత ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • సరయూ రాయ్ జంషెడ్‌పూర్ వెస్ట్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
  • ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బన్నా గుప్తా పోటీ చేస్తున్నారు.

     

     

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

 

 

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పోలింగ్‌ కొనసాగుతోంది.
  • రాంచీలోని జవహర్ నగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ప్రజలు  పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలైన్‌లో ఉన్నారు.

 

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 
  • రాంచీలోని పోలింగ్ బూత్ నంబర్లు 50,60, 61 పోలింగ్‌ జరుగుతోంది.
  • ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లతో నిల్చున్నారు.
  • ఈ సందర్భంగా ఓ మహిళ సంప్రదాయ డోలు వాయిస్తూ ప్రజలను ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు.

 

 

  • జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది.
  • ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు.

 

  • జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది.
  • ఈ దశలో 81 స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
  • జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటుర్లు  ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

 

 

 

  • జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది.

 

 

 

  • పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు.
  • తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. 
  • సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. 

 

  • తొలిదశ పోలింగ్‌ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్‌ స్థానాలున్నాయి. 
  • మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్‌ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ ఇవాళే పోలింగ్‌ జరునుంది.
  • కాంగ్రెస్‌ నేత అజయ్‌కుమార్‌ జంషెడ్‌పూర్‌ ఈస్ట్‌ నుంచి బరిలో దిగారు
  • ఇక్కడ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. 
  • జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. 
  • ఇక్కడ కాంగ్రెస్‌ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
  •  జంషెడ్‌పూర్‌ వెస్ట్‌ నుంచి కాంగ్రెస్‌ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. 
  • ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్‌ బరిలోకి దిగారు. 
  • సరయూరాయ్‌ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. 
  • రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది.

 

  • తొలి దశలో పోలింగ్‌ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలున్నాయి!
  • బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్‌ కేసులుంటే వాటిని రెడ్‌ అలర్ట్‌ స్థానాలుగా పరిగణిస్తారు. 
  • ఇక 174 (26%) మందిపై క్రిమినల్‌ కేసులున్నట్టు జార్ఖండ్‌ ఎలక్షన్‌ వాచ్, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించాయి.
  • వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. 
  • బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి.
  • 11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. 
  • అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. 
  • బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. 
     

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement