వారి రిజర్వేషన్లు దోచుకునే పన్నాగం: మోదీ
జార్ఖండ్ వనరులన్నీ జేఎంఎం కూటమి లూటీ
అవినీతిపరులను వదిలే ప్రసక్తే లేదన్న ప్రధాని
బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు.
మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్‌లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు.
మాఫియాల భరతం పడతాం
జార్ఖండ్‌లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్‌మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు.
అంబేడ్కర్‌కు ఘన నివాళి
జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్‌కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు.
రాంచీలో రోడ్ షో
జార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.
#WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " ...I want to promise you (people), once the govt is formed, to give these corrupt people strictest punishment, we will take this fight to the court. Your money will be spent on… pic.twitter.com/I621Z0bDmB
— ANI (@ANI) November 10, 2024
Comments
Please login to add a commentAdd a comment