పనాజీ: గోవాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థల జాబితాను ఆదివారం ప్రకటించింది. రాష్టంలోని 40 స్థానాలకుగాను 36 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను వెల్లడించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పార్టీ ఫిరాయిస్తే మాత్రం మళ్లీ కాంగ్రెస్‌లో చేర్చుకోబోమని తేల్చిచెప్పారు.
గతంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఘటనలు కాంగ్రెస్‌పార్టీకి నష్టం కలిగించాయని గుర్తుచేశారు. 2017లో 17 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని తెలిపారు. దానికి గాల కారణం.. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ ఫిరాయించడమని పేర్కొన్నారు.
గతంలో జరిగిన తప్పిదాలు ఈ ఎన్నికల తర్వాత జరగకూడదని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీలో సమున్నతమైన స్థానం లభించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక పార్టీ ఫిరాయిస్తే మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండదని చిదంబరం పేర్కొన్నారు. 40 స్థానాలు ఉన్న గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment