Goa Assembly Elections
-
గోవా: కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. పార్టీ ఫిరాయిస్తే ఇక అంతే!
పనాజీ: గోవాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థల జాబితాను ఆదివారం ప్రకటించింది. రాష్టంలోని 40 స్థానాలకుగాను 36 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను వెల్లడించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పార్టీ ఫిరాయిస్తే మాత్రం మళ్లీ కాంగ్రెస్‌లో చేర్చుకోబోమని తేల్చిచెప్పారు. గతంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఘటనలు కాంగ్రెస్‌పార్టీకి నష్టం కలిగించాయని గుర్తుచేశారు. 2017లో 17 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని తెలిపారు. దానికి గాల కారణం.. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ ఫిరాయించడమని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు ఈ ఎన్నికల తర్వాత జరగకూడదని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీలో సమున్నతమైన స్థానం లభించిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక పార్టీ ఫిరాయిస్తే మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండదని చిదంబరం పేర్కొన్నారు. 40 స్థానాలు ఉన్న గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. -
ఇక బీజేపీకి గుడ్ బై: మాజీ సీఎం తనయుడు
పనాజీ(గోవా): తాను ఆశించిన పనాజీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక తాను బీజేపీలో కొనసాగలేనంటూ శుక్రవారం తన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. అదే సమయంలో పనాజీ స్థానం నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీగా దిగుతానని ప్రకటించారు. కాగా, గత కొన్ని రోజులుగా పనాజీ స్థానాన్ని ఆశిస్తున్న ఉత్పల్ పారికర్‌కు బీజేపీ గురువారమే షాక్ ఇచ్చింది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వడంతో ఉత్పల్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. అయితే పనాజీ కాకుండా బీజేపీ అధిష్టానం సూచించిన రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉత్పల్ నిరాకరించారు. అదే సమయంలో ఇక ఎంతో ముచ్చటపడుతున్న పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దిగాలనే యోచనలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఉత్పల్ వెల్లడించారు. ఇక్కడ చదవండి: ‘ఆ సీటు వేరే వాళ్లకి ఇచ్చాం.. మరో ప్లేస్ ఎన్నుకోండి’ -
‘ఆ సీటు వేరే వాళ్లకి ఇచ్చాం.. మరో ప్లేస్ ఎన్నుకోండి’
పనాజీ: గోవా మాజీ సీఎం దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌కు నిరాశ తప్పలేదు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి పాత నియోజకవర్గం పనాజీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పదే పదే అభ్యర్థించినప్పటికీ ఉత్పల్ పారికర్‌కు ఆ సీటు దక్కలేదు. ఈరోజు(గురువారం)బీజేపీ విడుదల చేసిన గోవా అసెంబ్లీ తొలి దశ జాబితాలో పనాజీ స్థానం కూడా ఉంది. అయితే ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్‌సెర్రెట్‌కు కట్టబెట్టారు. 34 మందితో విడుదల చేసిన తొలి లిస్టులో పనాజీ స్థానాన్ని అటానాసియోకు ఇవ్వడంతో ఉత్పల్ పారికర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కాగా, ఉత్పల్ పారికర్‌కు పనాజీ స్థానాన్ని ఇవ్వడం కుదరలేదని గోవా ఎలక్షన్ ఇన్చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఆ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సి వచ్చిందని, అలాగనే పారికర్ ఫ్యామిలీని వదులుకోబోమని పేర్కొన్నారు. ‘మనోహర్ పారికర్ కుటుంబం.. తమతో చాలా సాన్నిహిత్యంగా ఉంటుంది. దాంతోనే పనాజీ స్థానం కాకుండా రెండు ఆప్షన్లు ఇచ్చాం. అందులో ఒక స్థానాన్ని ఉత్పల్ నిరాకరించారు. ఇంకో ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ విషయంపై మేము ఆయనతో చర్చిస్తున్నాం. అందుకు ఉత్పల్ ఒప్పుకుంటాడనే అనుకుంటున్నాం’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. చదవండి: బీజేపీ ఇవ్వనంటోంది! పారికర్ కొడుక్కి ఇతర పార్టీల నుంచి ఆఫర్లు.. -
బీజేపీ ఇవ్వనంటోంది! ఇతర పార్టీల నుంచి ఆఫర్లు..
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అయితే పనాజీ అసెంబ్లీ స్థానం ఆయనకు కేటాయించే విషయంపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉత్పల్ పారికర్‌కు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఉత్పల్ పారికర్ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే (కాంగ్రెస్, ఆప్, తృణమూళ్)తో పాటు ప్రాంతీయ పార్టీ గోవా ఫార్వార్డ్ సైతం ఆయనకు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఆయనకు పోటీగా అభ్యర్థిని కూడా నిలబెట్టవని పేర్కొన్నారు. ఇలా చేయడం మాజీ సీఎం మనోహర్ పారికర్‌కు నిజమైన నివాళి ఇవ్వడం అవుతుందని తెలిపారు. మరోవైపు ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఉత్పల్ ఆప్‌లో చేరుతానంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు పానాజీ అసెంబ్లీ స్థానంపై పడింది. అయితే దివంగత సీఎం కుమారుడికి బీజేపీ.. పనాజీ టికెట్ కేటాయిస్తుందా? లేదా? అని ఇప్పటికే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం మాజీ సీఎం తనయుడు లేదా మరో ఇతర నేతకు చెందిన వారైతే బీజేపీ టికెట్ ఇవ్వదని గోవా అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టికెట్ ఇవ్వలేమని సంకేతాలు పంపించింది. If #UtpalParrikar contests Independent frm Panaji seat,I propose all non-BJP parties including @AamAadmiParty @INCIndia @AITCofficial @Goaforwardparty shd support his candidature & not field a candidate against him. This will be a true tribute to ManoharBhai!#Goa pic.twitter.com/q0w96MxZk9 — Sanjay Raut (@rautsanjay61) January 17, 2022 -
గోవా బీజేపీకి షాక్
పణజి: గోవాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో, మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు. కలంగుటే నియోజక వర్గం నుంచి మైఖేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నౌకాశ్రయాలు, వ్యర్థ్యాల నిర్వహణ శాఖకు మంత్రిగా ఉన్నారు. బీజేపీ ప్రజల పక్షాన లేదని అందుకే పార్టీని వీడుతున్నట్లు మైఖేల్ తెలిపారు. మైఖేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మయం నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే చెప్పారు. తన నియోజకవర్గాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని, సమస్యకు బీజేపీ సర్కార్ ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని ప్రవీణ్ ఆరోపించారు. -
చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?
బీజేపీలో మనోహరంగా వెలిగిపోయిన పారికర్ లేకుండా జరగబోయే తొలి ఎన్నికల్ని ఆ పార్టీ ఎంతవరకు ఎదుర్కోగలదు? పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలదళం అధికార వ్యతిరేకతను ఎదుర్కొని నిలబడగలదా? తృణమూల్ కాంగ్రెస్, ఆప్, శివసేన వంటి పార్టీల సత్తా ఎంత? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? అతి చిన్న రాష్ట్రమైన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా అయిదు నెలలు గడువు ఉన్నప్పటికీ ఎందుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి? పర్యాటక ప్రాంతమైన అతి చిన్న రాష్ట్రం గోవా. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో దాదాపుగా పదో వంతు ఉంటుంది. 3,702 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ రాష్ట్ర జనాభా దాదాపుగా 15 లక్షలు. 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. వచ్చే ఏడాది మార్చి 15 వరకు అసెంబ్లీకి గడువుంది. ఎన్నికలకి ఇంకా అయిదు నెలలు సమయం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌లు గోవా బరిలోకి పూర్తి స్థాయిలో దిగుతూ ఉండడం, శివసేన కూడా 25 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, కాంగ్రెస్‌లో ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. గోవా కాథలిక్కులు కూడా గౌరవించే మనోహర్ పారికర్ కేన్సర్‌తో 2019లో మరణించడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే. రాష్ట్రంలో ప్రమోద్ సావంత్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ప్రచారం జోరు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గత జులై నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటించడం ప్రారంభించారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ ఈసారి ఎలాగైనా మెజార్టీ సాధించాలని భావిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే గోవాలో పర్యటించి సమర్థవంతులైన నాయకుల్ని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిదంబరం వంటి జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారం బరిలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల మూడు రోజులు గోవాలో మకాం వేసి బీజేపీకి బెంగాల్లో పట్టించిన గతే ఇక్కడా పట్టిస్తామని ప్రతినబూనారు. ఆప్ గత ఎన్నికల్లో ఒక్క సీటు సాధించకపోయినా 6.3% ఓట్లను సాధించింది . దీంతో ఈసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దూకుడు పెంచారు. ఆప్ అ«ధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన, అందరికీ ఉచితంగా తీర్థయాత్రల హామీతో ముందుకు వెళుతున్నారు. చిన్న నియోజకవర్గాలతో పార్టీలకు చింత గోవాలో ప్రతీ నియోజకవర్గంలో 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఓటర్లు ఉంటారు. దీంతో స్వల్ప ఓట్లతోనే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థిని దింపడం కూడా కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించడానికి చిన్న నియోజకవర్గాలే కారణం. ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వార్డ్ పార్టీ మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ, ఎన్సీపీ, శివసేన , స్థానిక పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లో ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో దొడ్డి దారిలో వచ్చిన బీజేపీ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాలు నెగ్గి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ని గోవా ముఖ్యమంత్రిని చేసి చిన్న పార్టీలతో చేతులు కలిపిన బీజేపీ గద్దెనెక్కింది. కేవలం 13 స్థానాలను గెలుచుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన అప్పటి గోవా గవర్నర్ మృదుల సిన్హాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా బీజేపీ పారికర్ ఇమేజ్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సభ్యుల్ని లాగేసి బలం పెంచుకుంది. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో బీజేపీకి సభ్యుల బలం 28 ఉంటే కాంగ్రెస్ బలం నాలుగుకి పడిపోయింది. అప్పట్నుంచి గోవా కాంగ్రెస్ తమకు దక్కాల్సిన అధికారాన్ని కొల్లగొట్టిందని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ►పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న రాష్ట్రంలో కరోనా ప్రభావంతో వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్లు నష్టం వచ్చినట్టుగా అంచనా. పర్యాటకుల్ని అనుమతిస్తున్నప్పటికీ చాలా హోటల్స్‌లో ఆక్యుపెన్సీ 20 శాతానికి మించడంలేదు. ప్రజల జీవనోపాధిపై దెబ్బపడింది. ►గోవాలో మైనింగ్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామీణ ఆర్థిక రంగానికి గట్టి దెబ్బ తగిలింది. జీడీపీలో 30%వాటా, లక్షకు మందికి పైగా ఉద్యోగాలను కల్పించే మైనింగ్ నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది ►కరోనా సమయంలో పర్యాటక రంగంలో 1.22 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతే, మైనింగ్ నిలిచిపోయి లక్ష మంది వరకు ఉపాధి కోల్పోయారు. దీంతో నిరుద్యోగం అంశం రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా మారింది. -
యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే..
సాక్షి, న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రానున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వ్యూహాలు సిద్ధం చేసింది. పంజాబ్‌తోపాటు గోవాపైన అరవింద్ కేజ్రీవాల్ దృష్టి సారించారు. పార్టీని అధికార, ప్రతిపక్షాల కన్నా బలంగా తయారుచేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నికల సందర్భంగా ఇప్పుడే హామీల వర్షం కురిపిస్తున్నాయి. అందులో భాగంగా 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. చదవండి: సజ్జనార్ సారూ మీరు సూపర్.. ‘గోవా యువతకు నా 7 హామీలు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వాటిలో ఎమ్మెల్యే సంబంధికులకు కాదు గోవావాసులకు ఉద్యోగాలు కుటుంబానికో ఉద్యోగం ఉద్యోగం వచ్చేంత వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ప్రైవేటు ఉద్యోగాల్లో 80 శాతం గోవావాసులకే కరోనాతో నిరుద్యోగులైన పర్యాటక శాఖకు చెందినవారికి రూ.5 వేల ఆర్థిక సహాయం మైనింగ్ తవ్వకాల నిషేధంతో ప్రభావితులైన వారికి రూ.5 వేల ఆర్థిక సహాయం స్కిల్ యూనివర్సిటీ యువతకు ఉద్యోగ, ఉపాధిని అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన హామీగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ త్వరలో పర్యటించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీలో పాలన మాదిరి గోవాలో కూడా సాగిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. ఢిల్లీ పాలనను గోవాలో పునరావృతం చేస్తామని పేర్కొంటోంది. 40 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో కలిసి ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. My 7 Guarantees for Goa's youth ▪️Jobs for Goans, not just for MLA's relatives ▪️1 Job/family for unemployed ▪️3000/month until then ▪️80% pvt jobs reserved for Goans ▪️5000/month for unemployed in tourism due to COVID ▪️5000/month for mining ban affected ▪️Skill University — Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2021 -
గోవాలో అత్యధికంగా నోటా ఓట్లు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో అత్యధికంగా నోటా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 1.2 శాతం మంది నోటా బటన్‌ను నొక్కినట్లు తేలింది. ఆ తర్వాత స్థానంలో ఒక్క శాతంతో ఉత్తరాఖండ్ నిలిచిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ విజయ ఢంకా మోగించిన ఉత్తరప్రదేశ్‌లో 0.9 శాతం, పంజాబ్‌తో 0.7శాతం, మణిపూర్‌లో 0.5 శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చని సందర్భాల్లో ఓటర్లు నోటాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. -
గోవాలో క్యాసినోలు బంద్: కాంగ్రెస్ మేనిఫెస్టో
పణజీ: అధికారంలోకి వస్తే గోవాలోని అన్ని క్యాసినో(జూద శాలలు)ల్ని మూసి వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. నదుల్లో సాగుతున్న క్యాసినోల్ని కూడా శాశ్వతంగా మూసివేస్తామని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉపాధికి ఎలాంటి నష్టం వాటిల్లదని గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు లుజిన్హో ఫలైరో చెప్పారు. -
బీజేపీకి ఎదురుదెబ్బ
పణజి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోవాలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ) కొత్త కూటమి ఏర్పాటు చేసింది. శివసేన, గో సురక్ష మంచ్(జీఎస్ఎం)తో కలిసి కూటమిగా ఏర్పడింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలికట్టుగా పోటీ చేస్తామని మూడు పార్టీలు ప్రకటించాయి. ఈ కూటమి ఏర్పాటుతో అధికార బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటిరోజే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఎంజీపీ బయటకు వచ్చింది. లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు ఈ నెల 5న గవర్నర్ మృదులా సిన్హాకు లేఖ రాశారు. 2012లో బీజేపీ, ఎంజీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 21, ఎంజీపీ మూడు స్థానాల్లో గెలిచాయి. -
'అలా అయితే మా పార్టీలోకి రావొద్దు'
పణజి: కాంగ్రెస్, బీజేపీ భార్యాభర్తల్లా వ్యవహరిస్తూ ప్రజలతో ఆడుకుంటున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మిస్టర్-మిసెస్ గా కాంగ్రెస్-బీజేపీ వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించారు. పణజిలో ఆమ్ ఆద్మీ పార్టీ వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'కాంగ్రెస్-బీజేపీ పార్లమెంట్ లోపల మొగుడు-పెళ్లాం మాదిరిగా కొట్టుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలకు ఒకరి రహస్యాలు మరొకరికి తెలుసు. గోవాలో కాంగ్రెస్ నేతల అక్రమాలకు సంబంధించిన ఫైళ్లు రక్షణ మంత్రి (మనోహర్ పరీకర్) వద్ద ఉన్నాయని కొంతమంది నాకు చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా ఆయన ఎటువంటి చర్యలు తీసుకోరు. వారిని బెదిరించేందుకు ఈ పత్రాలు ఆయన వద్దే ఉంచుకున్నార'ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని, ప్రజలను వెర్రివాళ్లను చేసి ఆడుకుంటున్నాయని అన్నారు. కాంగ్రెస్-బీజేపీ ప్రజలను దోచుకుంటున్నాయని మండిపడ్డారు. దేశాన్ని చెరో ఐదేళ్లు పాలించాలని ఈ రెండు పార్టీలు అలిఖిత అవగాహనకు వచ్చాయని ఆరోపించారు. టిక్కెట్ల కోసం 'ఆప్'లో చేరవద్దని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పార్టీలో పనిచేసే వారికి వివిధ బాధ్యతలు అప్పగిస్తామని, టిక్కెట్ల కేటాయింపు కూడా అలాంటిదేనని చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే స్థానికుడినే ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ ఇంతకుముందే ప్రకటించారు.