
గోవాలో క్యాసినోలు బంద్: కాంగ్రెస్ మేనిఫెస్టో
పణజీ: అధికారంలోకి వస్తే గోవాలోని అన్ని క్యాసినో(జూద శాలలు)ల్ని మూసి వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. నదుల్లో సాగుతున్న క్యాసినోల్ని కూడా శాశ్వతంగా మూసివేస్తామని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉపాధికి ఎలాంటి నష్టం వాటిల్లదని గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు లుజిన్హో ఫలైరో చెప్పారు.