16న అమరీందర్‌ ప్రమాణం | Captain Amarinder criteria on 16th of this month | Sakshi
Sakshi News home page

16న అమరీందర్‌ ప్రమాణం

Published Mon, Mar 13 2017 2:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పంజాబ్‌ గవర్నర్‌ బద్నోర్‌తో సమావేశమైన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ - Sakshi

పంజాబ్‌ గవర్నర్‌ బద్నోర్‌తో సమావేశమైన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌

చండీగఢ్‌: పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్య క్షుడు కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాటియాలా నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అమరీందర్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు.

అనంతరం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బద్నోర్‌ను కలిశారు. ఈనెల 14న రాహుల్‌గాంధీతో భేటీ అవుతానని చెప్పిన ఆయన కేబినెట్‌ కూర్పుపై మాట్లాడేందుకు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement