Captain Amarinder Singh
-
బీజేపీలో చేరిన మాజీ సీఎం భార్య
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం అమరేందర్‌సింగ్ సతీమణి ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. పంజాబ్‌లోని పటియాలా కాంగ్రెస్ ఎంపీ అయిన ప్రణీత్ కౌర్ గతేడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రణీత్ కౌర్.. తాజాగా గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆమె పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్, ఇతర బీజేపీ సీనియర్ నాయకుల సమాక్షంలో కమలం పార్టీలో చేశారు. బీజేపీలో చేరిన తర్వాత ప్రణీత్ కౌర్ మీడియాతో మాట్లాడారు. ‘నరేంద్రమోదీ నాయకత్వంలో నా నియోజకవర్గం, రాష్ట్రం, దేశంలోని ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. గతంలో ఏం జరిగిందో నాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో నా ఇన్నింగ్స్ బాగా ఉండేది. ఇప్పడు బీజేపీలో కూడా నా ఇన్నింగ్స్ బాగుంటుందని ఆశిస్తున్నా’అని పేర్కొన్నారు. తాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానా? లేదా? అనే విషయాన్ని బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. #WATCH | Preneet Kaur, suspended Congress MP and wife of former Punjab CM Amarinder Singh, joins BJP in Delhi, today pic.twitter.com/YziHMsHDez — ANI (@ANI) March 14, 2024 పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రణీత్ కౌర్‌ను సస్పెండ్ చేసింది. ఇక.. ప్రణీత్ కౌర్ భర్త కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పంజాబ్‌కు రెండుసార్లు సీఎంగా పని చేసిన విషయం తెలిసిందే. 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అమరేందర్ సింగ్ సొంతగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) అనే పార్టీ స్థాపించారు. అనంతరం 2022 సెప్టెంబర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇక.. అమరేందర్ సింగ్ కూతురు జై ఇందర్ కౌర్ కూడా బీజేపీలోనే ఉన్నారు. అయితే బీజేపీ తరఫున పటియాలా పార్లమెంట్ స్థానం నుంచి జై ఇందర్ కౌర్ బరిలోకి దిగుతారని ఊహాగానాలు వస్తున్నాయి. -
కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణికి కాంగ్రెస్ షాక్..
న్యూఢిల్లీ: పంజాబ్ పాటియాల నియోజకవర్గం ఎంపీ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణి పర్నీత్ కౌర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్నీత్ కౌర్‌పై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుందని కాంగ్రెస్ తెలిపింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ బీజేపీకీ ప్రయోజనం చేకూర్చుతున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నందునే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. పర్నీత్ కౌర్ భర్త కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. దీంతో ఎన్నికల అనంతరం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం కమలం పార్టీలోనే కొనసాగుతున్నారు. చదవండి: నేను లాయర్.. నా ఇష్టం.. లోకల్ ట్రైన్లో యువతి రుబాబు.. -
బీజేపీ గూటికి పంజాబ్ మాజీ సీఎం.. పార్టీ విలీనం
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు కిరెన్ రిజుజు, నరేంద్ర సింగ్ థోమర్ సమక్షంలో ఆయన కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. గతేడాది అయన స్థాపించిన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను కూడా బీజేపీలో వీలీనం చేశారు. ఢిల్లీలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీలో చేరిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. Delhi | Former Punjab CM Capt Amarinder Singh meets Union Home Minister Amit Shah and BJP national president JP Nadda after joining the BJP pic.twitter.com/1psHECxa9b — ANI (@ANI) September 19, 2022 కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం పదవి నుంచి తప్పించింది కాంగ్రెస్. ఆ తర్వాత ఆయన పార్టీని వీడారు. సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ పోటీ చేసిన స్థానం నుంచి ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయి ఆయన పార్టీ దారుణ పరాభవం మూటగట్టుకుంది. సెప్టెంబర్ 12నే అమిత్‌షాను ఢిల్లీలో కలిశారు అమరీందర్ సింగ్. చర్చలు ఫలవంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. జాతీయ భద్రత, పంజాబ్‌లో నార్కో టెర్రరిజం గురించి చర్చించినట్లు చెప్పారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని ఆయన పార్టీలో చేరిన అనంతరం బీజేపీ కొనియాడింది. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్! సోనియాతో కీలక భేటీ -
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అమరీందర్‌సింగ్?
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా త్వరలోనే బీజేపీలో విలీనమవుతుందని చెబుతున్నాయి. ప్రస్తుతం వైద్య చికిత్స కోసం లండన్‌లో ఉన్న అమరీందర్ రెండు వారాల్లో తిరిగి వచ్చాక ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయంటున్నారు. అమరీందర్ కార్యాలయం కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. వచ్చే వారంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్‌ను ప్రకటించాక.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేసే బాధ్యతను ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ తీసుకుంటారని సమాచారం. పటియాలా ఎంపీ అయిన ప్రణీత్ కౌర్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి పోలింగ్ ఆగస్ట్ 6వ తేదీన, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. 5న నోటిఫికేషన్ రానుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్ట్ 10వ తేదీతో ముగియనుంది. -
కెప్టెన్‌కి ఘోర పరాభవం
ఛండీగఢ్: ఆప్ దెబ్బకు పంజాబ్ రాజకీయమే మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఘన విజయం దిశగా దూసుకుపోతోంది Aam Aadmi Party. ఈ తరుణంలో పంజాబ్ రాజకీయ బాహుబలి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్‌సింగ్ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. సిద్ధూతో గొడవ, కాంగ్రెస్ లుకలుకల కారణంగా ఆయన పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇక పాటియాలా అమరీందర్ సింగ్‌కు 12 ఏళ్లపాటు కంచుకోటగా ఉండింది. ఈ తరుణంలో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, ఫలితం ఊహించని రీతిలో రావడం.. కెప్టెన్‌తో పాటు ఆయన సన్నిహితులకు పెద్ద షాకే ఇచ్చింది. -
పాకిస్తాన్‌పైనే యుద్ధం చేసిన సైనికుడు
కెప్టెన్ అమరీందర్ సింగ్ జీవనయానం ఆయన ఒక సైనికుడు.. దేశ రక్షణ కోసం పాకిస్తాన్‌పైనే యుద్ధం చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్‌కు, సిక్కుల ఊచకోతకు వ్యతిరేకంగా పోరాడారు. కాంగ్రెస్‌లోని అసమ్మతి వాదులతో యుద్ధం చేశారు. జీవితంలో అడుగడుగునా ఎదురైన సవాళ్లకు ఎదురొడ్డి నిలిచారు తప్పితే.. ఏనాడూ వెన్ను చూపలేదు. ఈ పాటియాలా రాజవంశ వారసుడు..పంజాబీల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఎక్కడికి వెళ్లినా కెప్టెన్ అంటూ జన నీరాజనాలు అందుకున్నారు. ఇప్పుడు జీవితచరమాంకంలో తనను అవమానించిన కాంగ్రెస్‌పై కత్తి దూస్తున్నారు. కసితో రగిలిపోతున్నారు. అందుకే బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల సమరంలో సై అంటున్నారు. యాదవేంద్ర సింగ్, మహరాణి మహీందర్ కౌర్ దంపతులకు పంజాబ్‌లోని పాటియాలాలో 1942 మార్చి 11న జన్మించారు. డెహ్రాడూన్‌లో డూన్ స్కూలులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. పుణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి డిగ్రీ చేశారు చిన్నప్పట్నుంచి ఆర్మీ కెప్టెన్ అవాలని ఆశపడ్డారు. 1963లో ఇండియన్ ఆర్మీలో చేరారు 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా ఉన్నారు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ 2009–2014 మధ్య విదేశాంగ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. సిక్కుల చరిత్ర మీద, యుద్ధాల మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ది లాస్ట్ సన్‌సెట్, ది మాన్సూన్ వార్ అన్న పుస్తకాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. 1984లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడానికి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నిరసిస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం కాంగ్రెస్‌కి గుడ్‌బై కొట్టేసి శిరోమణి అకాలీదళ్‌లో (ఎస్ఏడీ) చేరి ఎమ్మెల్యే అయ్యారు. 1992లో అకాలీదళ్‌ను వీడి సొంతంగా శిరోమణి అకాలీదళ్ (పాంథిక్) అనే పార్టీని స్థాపించారు 1998లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలోనే అమరీందర్‌కు 856 ఓట్లు మాత్రమే వచ్చాయి పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా పలుమార్లు బాధ్యతలు నిర్వహించారు 2002లో తొలిసారిగా పంజాబ్ సీఎం అయ్యారు. 2017లో మార్చి 16న మళ్లీ సీఎం పగ్గాలు అందుకున్నారు. నవజోత్ సింగ్ సిద్దూతో విభేదాల కారణంగా అమరీందర్ నాయకత్వ సామర్థ్యంపైనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో 2021, సెప్టెంబర్ 18న పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీకి 2021, నవంబర్ 2న గుడ్‌బై కొట్టారు. ఏడు పేజీల రాజీనామా లేఖని అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరుతో 2021, డిసెంబర్ 17న కొత్త పార్టీ స్థాపించి బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రజాదరణ పుష్కలంగా ఉన్న అమరీందర్‌కు ఈ ఎన్నికలు పూల పాన్పు కాదు. ప్రజలకి ఈ మధ్యకాలంలో బాగా దూరమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెడ్డ పేరు సంపాదించారు. ఇన్నాళ్లూ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆయన అనుచరులకి మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ నుంచి ఆశించినంత సంఖ్యలో ఆయన వెంట ఎమ్మెల్యేలు రాలేదు. అమరీందర్‌కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో చరిత్రను పునరావృతం చేస్తూ ఎన్నికలయ్యాక ఆయన పార్టీని బీజేపీలో కలిపేస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పంజాబ్‌లో రైతులు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో దాని ప్రభావం, బీజేపీ, అమరీందర్ పార్టీ పీఎల్సీ, అకాలీదళ్‌లో చీలికవర్గమైన శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) కూటమిపై పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. రాజీవ్ ప్రేరణతో.. అమరీందర్ సింగ్ డూన్ స్కూలులో చదువుతున్నప్పుడు రాజీవ్‌గాంధీ ఆయనకు మంచి మిత్రుడు. ఆర్మీ నుంచి పదవీ విరమణ చేశాక రాజీవ్ కోరిక మేరకే కాంగ్రెస్‌లో చేరి పాటియాలా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పట్నుంచి పాటియాలా మహరాజుగా ప్రజలందరూ ఆయనను కీర్తించారు. కాంగ్రెస్ పార్టీలో అమరీందర్‌పై సిద్ధూ చేసిన అసమ్మతి యుద్ధంతో అవమానకర రీతిలో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఈసారి ఎంత మేరకు ప్రభావం చూపించగలరన్న అనుమానాలైతే ఉన్నాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వేరు కుంపటి పెట్టి చేతులు కాల్చుకున్న అమరీందర్ అప్పట్లో పార్టీ జెండా పీకేసి కాంగ్రెస్‌లో కలిపేశారు. ఈసారి ఎన్నికలయ్యాక పార్టీని బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారమైతే సాగుతోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
పాటియాలా నుంచి అమరీందర్.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఛండీఘర్: పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ 22 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆదివారం ప్రకటించారు. మరో రెండు రోజుల్లో రెండో జాబితా కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. మొదటి జాబితాలో తొమ్మిది మంది జాట్ సిక్కులు, నలుగురు ఎస్పీ, ముగ్గురు ఓబీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)’గా తమ పార్టీకి నామకరణం చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ కొత్త పార్టీ.. ఏమేరకు ప్రభావం చూపనుందో చూడాలి. -
కెప్టెన్ గేమ్‌ప్లాన్ ఏమిటో..!
పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)’గా తమ పార్టీకి నామకరణం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త), బీజేపీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాయని కమలదళం పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల ప్రకటించారు. కాంగ్రెస్‌లోని తన అనుయాయులను సొంత పార్టీలోకి లాగుతారని, ఎన్నికలు సమీపించేకొద్దీ... వలసలు పెరుగుతాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జంపింగ్‌లు మొదలయ్యాయి కానీ... ఆశ్చర్యకరంగా కెప్టెన్ అనుంగు అనుచరులు బీజేపీలోకి దూకేస్తున్నారు. ఇది పలువురి భృకుటి ముడిపడేటట్లు చేస్తోంది. అమరీందర్ గేమ్‌ప్లాన్ ఏమిటి? సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సింది పోయి ముఖ్య అనుచరులు బీజేపీలోకి వెళ్లడాన్ని ఎలా అనుమతిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరెవరు వెళ్లారంటే.. మాజీ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి (గురుహర్ సహాయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే) డిసెంబరు 21న కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 67 ఏళ్ల గుర్మీత్ నాలుగుసార్లు ఎమ్మెల్యే. సెప్టెంబరు దాకా అమరీందర్ కేబినెట్లో క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. కెప్టెన్‌కు బాగా సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఈ కారణంగానే చన్నీ కేబినెట్లో ఈయనకు చోటివ్వలేదు. ఖాదియాన్ ఎమ్మెల్యే ఫతేజంగ్ బజ్వా, శ్రీహరిగోవింద్పూర్ ఎమ్మెల్యే బల్విందర్ సింగ్ లడీలు 22న కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బజ్వాకు కాంగ్రెస్ టిక్కెట్ రావడానికి అమరీందర్ సహాయపడ్డారు. ఇలా కెప్టెన్‌కు సన్నిహితులు కాషాయ కండువా కప్పుకోవడంతో... సమీప భవిష్యత్తులో అమరీందర్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరూ ఉండరని, ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రధాని నరేంద్ర మోదీ పేరిటే ఎన్నికలకు వెళతామని షెకావత్ ప్రకటించారు. కూటమిలో బీజేపీయే పెద్దన్న పాత్ర పోషిస్తుందని, పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాల్లో సగానికి పైగా తామే పోటీచేస్తామని షెకావత్ ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చినా... అమరీందర్ శిబిరం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కాంగ్రెస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నష్టపర్చడమే ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడి ప్రథమ లక్ష్యమని, అందుకే బీజేపీ అభీష్టం మేరకే నడుచుకుంటున్నారనే వాదన ఉంది. పరస్పర అవగాహనతోనేనా..! కెప్టెన్ పార్టీని బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలను లోక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రిన్స్ ఖుల్లర్ తోసిపుచ్చారు. బీజేపీకి పట్టున్న పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలనుకున్న వారు కాషాయదళంలోకి వెళుతున్నారని.. అమరీందర్‌తో సంప్రదించే చేరికలు జరుగుతున్నాయని ఖుల్లర్ చెప్పారు. రాణా గుర్మీత్ సోధి ఫిరోజ్‌పూర్ నుంచి, ఫతేజంగ్ బజ్వా హిందూ బెల్ట్ నుంచి బరిలోకి దిగాలని కోరుకున్నారని... ఇవి బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకున్న, చాలా ఏళ్లుగా ఆ పార్టీ పోటీచేస్తున్న సీట్లు కావడంతో వారు అటువైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే... పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూనే అంతిమంగా కూటమికి లబ్ధి చేకూరేలా అమరీందర్, బీజేపీలు అవగాహనకు వచ్చినట్లు కనపడుతోంది. సన్నిహితులు ’సేఫ్‌జోన్’ను (విజయావకాశాలు మెండుగా ఉన్న స్థానాల నుంచి) కోరుకోవడం... ఏ పార్టీలో ఉన్నా తన మనుషులే, కూటమి ఎమ్మెల్యేలుగానే ఉంటారనే లెక్కతో కెప్టెన్ వీరికి పచ్చజెండా ఊపి ఉండొచ్చు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కూటమి భాగస్వామ్యపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయని, అదే సమయంలో సంప్రదాయ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పార్టీలకు నియోజకవర్గాల కేటాయింపు జరగాలని కోరుకుంటున్నాయని పీఎల్సీ అధికార ప్రతినిధి ఖుల్లర్ చెప్పారు. ఎవరికెన్ని సీట్లనేది ఇంకా ఖరారు కానున్నా... పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త) పార్టీలు గ్రామీణ నియోజకవర్గాల నుంచి, బీజేపీ పట్టణ ప్రాంతాల్లోని స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం. 2017లో జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తులో భాగంగా 23 చోట్ల పోటీచేసి మూడింటిలో మాత్రమే నెగ్గిన బీజేపీ.. కెప్టెన్ అండతో ఈసారి గట్టికూటమిని ఏర్పాటు చేసింది. పంజాబ్ ఎన్నికలను ఈ కొత్త కూటమి చతుర్ముఖ (శిరోమణి అకాలీదళ్– బీఎస్పీ కూటమి, కాంగ్రెస్, ఆప్‌లు మిగతా మూడు) పోరుగా మార్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Amarinder Singh: కెప్టెన్ ప్రభావమెంత?
పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి నెల రోజుల క్రితం అవమానకర రీతిలో తప్పుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ (79) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికారం నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కడానికి శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ, తదితర పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. అమరీందర్ పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. అమరీందర్ పార్టీ బీజేపీతో, శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలతో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉన్నట్లు సంకేతాలిస్తోంది. పంజాబ్‌లో కొత్త పార్టీతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న చర్చ మొదలయ్యింది. అమరీందర్ ఎత్తుగడలను బీజేపీ స్వాగతిస్తుండగా, అధికార కాంగ్రెస్ ఆయన కొత్తగా పార్టీ పెట్టి, సాధించేది ఏమీ ఉండదంటూ తేలిగ్గా కొట్టిపారేస్తోంది. ప్రధాని మోదీ సూచనల మేరకే అమరీందర్ కొత్త కుంపటి పెడుతున్నారని ఆప్ ఆరోపించింది. కెప్టెన్ వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు! అమరీందర్ గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో విభేదాలు, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మంత్రాంగం వల్ల ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బలమైన అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నారు. వ్యక్తిగతంగా కూడా అమరీందర్‌కు పంజాబ్ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మొత్తం 117 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌కు 77 మంది సభ్యుల బలముంది. ఇందులో 12 మందికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ అమరీందర్ సింగ్ మద్దతుదారులుగానే కొనసాగుతున్నారని, కొత్త పార్టీ స్థాపించగానే వారంతా వచ్చి, ఎన్నికల ముందు అందులో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఎంతమంది ఎమ్మెల్యేలు కెప్టెన్ వెంట నడుస్తారన్నది ఇప్పుడే తేలకపోయినా కాంగ్రెస్‌కు మాత్రం ఎంతోకొంత నష్టం తప్పదని చెప్పొచ్చు. అంటే అమరీందర్ కొత్త పార్టీతో మొదట నష్టపోయేది కాంగ్రెస్సే. మరోవైపు సిద్ధూతో కాంగ్రెస్ అధిష్టానానికి నిత్యం ఏదో ఒక తలనొప్పి ఎదురవుతూనే ఉంది. తన అనుచరుడే అయినప్పటికీ కొత్త దళిత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సైతం సిద్ధూకు పొసగడం లేదు. ఈ అంతర్గత కుమ్ములాటలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలంగా పరిణమించే అవకాశాలున్నాయి. విసిగివేసారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించినా.. ఆఖరి నిమిషంలో అమరీందర్ పార్టీలోకి జంప్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు తెలిసినప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చతుర్ముఖ పోరు... సర్దార్ల రాష్ట్రం పంజాబ్‌లో అధికారం ఎప్పుడూ శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ కూటముల మధ్యే చేతులు మారుతోంది. మరో కూటమికి అవకాశం దక్కడం లేదు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శక్తిమేర పోరాడి 23.7 శాతం ఓట్లు, 20 సీట్లతో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పంజాబ్‌లో తమకు అవకాశాలుంటాయని భావిస్తున్న ఆప్ చాలాకాలంగా ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టి పనిచేస్తోంది. మరోవైపు పంజాబ్ జనాభాలో ఏకంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శిరోమణి అకాలీదళ్... బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. 20 సీట్లను బీఎస్పీకి వదిలి... 97 స్థానాల్లో పోటీచేయనుంది. ఇప్పటికే సింహభాగం స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది కూడా. ఈసారి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతోపాటు శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలైన రంజిత్ సింగ్ బ్రహ్మపురా, సుఖ్‌దేవ్ ధిండ్సాతో చేతులు కలిపితే.. రాష్ట్రంలో మొత్తం నాలుగు రాజకీయ కూటములు తెరపైకి వస్తాయి. అప్పుడు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. గతంలో సొంత కూటమి ఫెయిల్ అమరీందర్ కొత్త రాజకీయ కూటమి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన 1984లో కాంగ్రెస్‌ను వీడి శిరోమణి అకాలీదళ్‌లో చేరారు. 1992లో అకాలీదళ్ నుంచి బయటకు వచ్చారు. శిరోమణి అకాలీదళ్(పాంథిక్) పేరిట సొంతంగా ఒక పొలిటికల్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 1997లో తన కూటమిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగారు. రాష్ట్రంలో రెండు సార్లు (2002–07, 2017–22) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం వెనుక కీలక పాత్ర పోషించారు. తనను అవమానించిన కాంగ్రెస్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకోవాలని అమరీందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన రాజకీయం జీవితం ముగింపునకొచ్చినట్లేనని, ఇదే చివరి అవకాశమని పరిశీలకులు చెబుతున్నారు. కొత్త పొత్తు పొడిచేనా! అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ పట్ల సానుకూల ధోరణి కనబర్చారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను గట్టిగా సమర్థించారు. పాకిస్తాన్ భూభాగంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్‌తోపాటు సరిహద్దుల్లో ఇటీవల బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం మంచి పరిణామం అని కితాబిచ్చారు. అందుకే బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. బీజేపీతో కలిసి కూటమి కట్టడానికి అమరీందర్‌కు ఉన్న ఏకైక అభ్యంతరం మూడు నూతన వ్యవసాయ చట్టాలు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. రైతు సంఘాలతో చర్చలు జరపాలని, సాగు చట్టాల విషయంలో రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్ర సర్కారు కొంత దిగివచ్చినా తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. మితవాది అనే పేరు, సైనిక నేపథ్యం ఉండడం అమరీందర్‌కు బీజేపీతో జట్టు కట్టడానికి కలిసి వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, ఇతర పక్షాలను కలుపుకొని భారీ రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలన్నది అమరీందర్ ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి ఎన్డీయేలోనే భాగస్వామ్య పక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ గత ఏడాది నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Punjab: అమరీందర్ సింగ్ సొంత పార్టీ!
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత కుంపటి పెట్టనున్నారు. సీఎం పదవి నుంచి తనను అవమానకర రీతిలో తప్పించిందని రగిలిపోతున్న అమరీందర్ కాంగ్రెస్ పార్టీని సాధ్యమైనంతగా దెబ్బతీసే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. త్వరలో సొంత పార్టీని ప్రకటిస్తానని, రైతు సమస్యలు సానుకూలంగా పరిష్కారమైతే బీజేపీతో పొత్తు ఉంటుందనే ఆశాభావంతో ఉన్నట్లు మంగళవారం వెల్లడించారు. నవజోత్ సింగ్ సిద్ధూతో తీవ్ర విభేదాల కారణంగా కిందటి నెలలో అమరీందర్ పంజాబ్ సీఎంగా రాజీనామా చేయగా... కాంగ్రెస్ దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని కుర్చీపై కూర్చొబెట్టిన విషయం తెలిసిందే. ‘పంజాబ్ భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుంది. త్వరలోనే సొంత పార్టీని ప్రకటిస్తాను. పంజాబీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాను. ఏడాదికాలంగా మనుగడ కోసం పోరాడుతున్న రైతుల ప్రయోజనాల కోసం కూడా పాటుపడతాను’ అని అమరీందర్ తన మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ‘బీజేపీతో పాటు అకాలీదళ్ చీలికవర్గాలకు చెందిన దిండ్సా, బ్రహ్మపురాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే’ అని కెప్టెన్ తెలిపారు. చదవండి: ‘మోదీ నిరక్ష్యరాస్యుడు’... ‘అయితే రాహుల్ డ్రగ్స్ అమ్ముతాడు’ -
అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్
డెహ్రాడూన్/చండీగఢ్: బీజేపీకి చెందిన అమిత్‌షా తదితర నేతలతో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మంతనాలు జరుపుతుండటంపై పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జి హరీశ్ రావత్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు అమరీందర్ లౌకికతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు. సైద్ధాంతికంగా ఏమాత్రం పొసగని నాయకులతో అంటకాగవద్దనీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ నాయకత్వానికే మద్దతు ఇవ్వాలని కెప్టెన్‌ను రావత్ కోరారు. బీజేపీ వలలో పడవద్దని హితవు పలికారు. పంజాబ్ కాంగ్రెస్‌కు మూడు సార్లు అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి పార్టీ అవమానించిందని భావించడం సరికాదని చెప్పారు. ఆయనకు ఎటువంటి అవమానం జరగలేదని స్పష్టం చేశారు. సీఎంగా విద్యుత్, డ్రగ్స్ వంటి కీలకమైన అంశాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కెప్టెన్ విఫలమయ్యారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సహా తనకు ఎవరి సలహా అక్కర్లేదన్న అహంభావంతో వ్యవహరించారని ఆరోపించారు. స్పందించిన కెప్టెన్ తన నిబద్ధతపై హరీశ్‌రావత్ సందేహాలు వ్యక్తం చేయడంపై కెప్టెన్ అమరీందర్ తీవ్రంగా స్పందించారు. తన బద్ధశత్రువులు, తీవ్రంగా విమర్శించే వారు సైతం లౌకికత విషయంలో తనను అనుమానించలేరన్నారు. ఇన్నేళ్లుగా విశ్వాసంగా పనిచేసిన తనకు ఆ పార్టీలో గౌరవం లేదని ఆయన వ్యాఖ్యలతో పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు. సిద్దూ నేతృత్వంలోని తిరుగుబాటుదారులకు మద్దతు పలకడంతోపాటు తనను విమర్శించే స్వేచ్ఛ ఇచ్చారన్నారు. ‘సీఎల్పీ సమావేశంలో నన్ను దాదాపుగా తొలగించేందుకు రంగం సిద్ధం అయింది. ఆ అవమానం పొందడం ఇష్టంలేక ముందుగానే వైదొలిగాను. ఇది అందరికీ తెలిసిన విషయమే’అని ఆయన తెలిపారు. వాస్తవాలిలా ఉంటే, హరీశ్‌రావత్ మాత్రం ఇందుకు విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
ఓర్నీ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబూ
టెక్నాలజీ వల్ల ఎంత మంచి జరుగుతుందో.. ఒక్కోసారి అంతే ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నడిచే కమ్యూనికేషన్.. చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిస్ కమ్యూనికేషన్ మారుతుంది కూడా. కేవలం టెక్నికల్ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని.. వ్యవహారంతో సంబంధం లేనివాళ్లను ఇబ్బంది పెడుతుండటం తరచూ చూస్తుంటాం. అలాంటిదే ఈ ఘటన. ప్రస్తుతం పంజాబ్ రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా అనంతర పరిణామాలు ఆసక్తిగా మారాయి. అయితే ఈ వ్యవహారంలోకి సంబంధం లేని వ్యక్తి పేరు తెర మీదకు రాగా.. అది సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అమరీందర్ సింగ్.. ఇండియన్ ఫుట్‌బాల్ టీం గోల్ కీపర్. అయితే ఈ అమరీందర్ సింగ్‌ను.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌గా పొరపడి మీడియా ఛానెల్స్, వెబ్సైట్లు, నెటిజన్స్ ఎగబడి ట్విటర్లో ట్యాగ్ చేస్తున్నారట. Dear News Media, Journalists, I am Amrinder Singh, Goalkeeper of Indian Football Team 🇮🇳 and not the Former Chief Minister of the State Punjab 🙏😂 Please stop tagging me. — Amrinder Singh (@Amrinder_1) September 30, 2021 దీంతో ఈ ట్యాగుల గోల భరించలేక ట్విటర్లో రియాక్ట్ అయ్యాడు గోల్ కీపర్ అమరీందర్ సింగ్. దయచేసి ట్యాగ్ చేయడం ఆపండంటూ మీడియా హౌజ్‌లకు రిక్వెస్ట్‌లు చేశాడాయన. మనోడి రిక్వెస్ట్‌కి మీడియా పేజీల సంగతేమోగానీ.. నెటిజన్స్ మాత్రం భలేగా రియాక్ట్ అవుతున్నారు. గోల్‌కీపర్ అమరీందర్.. జట్టుకు కెప్టెన్ అయ్యి ఉంటే సరిగ్గా సరిపోయి ఉండేదని ఒకరు, సీఎం అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టమని మరొకరు.. ఇలా ఒక్కోక్కరు సరదా సంభాషణలతో గోల్‌కీపర్ అమరీందర్ టైం లైన్‌ను నింపేస్తున్నారు. Please dont accept captaincy of the team for some time. Otherwise definitely you will be made CM candidate. — Mudisu Drejine (@magicdheer) September 30, 2021 😂😂 pic.twitter.com/dvzbGUZbg2 — Superpower Football (@SuperpowerFb) September 30, 2021 Indian Media ryt now 👇😂 pic.twitter.com/sk41ow9PFY — 90ndstoppage (@90ndstoppage) September 30, 2021 -
పంజాబ్ నూతన సీఎంగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ
చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీకి అవకాశం దక్కింది. ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్ ట్విటర్లో వెల్లడించారు. చన్నీకి సీఎం బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చదవండి: Amarinder Singh: కెప్టెన్ కథ కంచికి చేరిందిలా! ఇక తాజా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాల కారణంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తలెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు అధిష్టానం కూడా కెప్టెన్ రాజీనామాకే మొగ్గు చూపిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా గవర్నర్‌కు రాజీనామా సమర్పించగా ఆయన ఆమోదించారు. చరణ్ జీత్ సింగ్ చన్నీ దళిత వర్గానికి చెందిన నేత. తొలుత సుఖ్జీందర్ సింగ్ రాంద్వాను పంజాబ్ సీఎంగా నియమించాలని భావించినా కాంగ్రెస్‌కు నవజ్యోత్‌సింగ్ సిద్దూ వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో తిరిగి పునరాలోచనలు చేయాల్సి వచ్చింది. It gives me immense pleasure to announce that Sh. #CharanjitSinghChanni has been unanimously elected as the Leader of the Congress Legislature Party of Punjab.@INCIndia @RahulGandhi @INCPunjab pic.twitter.com/iboTOvavPd — Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021 చదవండి: సిద్దూ వర్సెస్ అమరీందర్, రాజీనామా బాటలో సీఎం? -
Punjab Congress Crisis: కెప్టెన్‌కే అధిష్టానం మద్దతు
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య జరుగుతున్న పోరులో సీఎంకు కాంగ్రెస్ అధిష్టానం అండగా నిలబడింది. సిద్ధూకి గట్టి హెచ్చరికలే పంపింది. జాతి ప్రయోజనాలకు భంగం కలిగించే వ్యాఖ్యలు ఎవరు చేసినా అదుపులో ఉంచాలని హెచ్చరించింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోనే జరుగుతాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ హరీశ్ రావత్ స్పష్టం చేశారు. కేబినెట్ మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు అమరీందర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఆయనను గద్దె దింపేయాలని డిమాండ్ చేసిన మరుసటి రోజే అమరీందర్‌కు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘ అమరీందర్ నేతృత్వంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటాం’ అని ఆయన చెప్పారు. బుధవారం నలుగురు కేబినెట్ మంత్రులు తృప్త్ రాజీందర్æ బజ్వా, సుఖ్బీందర్ సర్కారియా, సుఖీందర్ రాంధ్వా, చరణ్‌జిత్ సిగ్ చాన్నితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు డెహ్రాడూన్‌లో హరీశ్ రావత్‌ను కలుసుకుని చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ఆయన కాంగ్రెస్ అధిష్టానం వైఖరిని చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదన్నారు. పార్టీ భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొని సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేశామని, అంతమాత్రాన పార్టీ అంతటినీ ఆయనకు అప్పగించబోమని చెప్పారు. సలహాదారుల్ని సిద్ధూ అదుపు చేయాలి సిద్ధూ తన సలహాదారుల్ని నియంత్రించాలని ఇప్పటికే ఆయనకి గట్టిగా చెప్పినట్టుగా రావత్ తెలిపారు. కశ్మీర్‌ను పాక్‌తో పాటు భారత్ కూడా దురాక్రమణ చేసిందంటూ సిద్ధూ సలహాదారుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ఎంత వీఐపీ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీని మించిపోలేడు. వ్యక్తిగత సమస్యల్ని పార్టీ కార్యకలాపాలకు అడ్డంగా తీసుకు రాకూడదు’ అని హరీష్ చెప్పారు. ముఖ్యమంత్రిపై అమరీందర్ సింగ్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నాయకులు తనను వచ్చి కలుస్తారన్న విషయం హరీశ్ రావత్ ముందుగానే సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘పంజాబ్ ప్రభుత్వంపై వారికి కొన్ని భయాలు, ఆందోళనలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై వారికి సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకే ఇలా అంతర్గత పోరాటాలకి బదులుగా ప్రజాసమస్యల గురించి ఆలోచించాలని వారికి చెప్పాను’ అని హరీశ్ రావత్ వివరించారు. -
చేతులు కలిపారు
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్‌లో గత కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య నెలకొన్న విభేదాలకు తెరపడ్డాయి. నేతలిద్దరు చేతులు కలిపి రాష్ట్ర సంక్షేమం కోసం కలిసి పనిచెయ్యాలని నిర్ణయించారు. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎం అమరీందర్ హాజరయ్యారు. సిద్ధూకి ఆ పదవి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ గురువారం సిద్ధూ అమరీందర్‌కి ఈ కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. పంజాబ్ కాంగ్రెస్ కుటుంబంలో మీరే పెద్ద వారని పేర్కొన్నారు. దీంతో అమరీందర్ వెనక్కి తగ్గారు. అందరితో కలిసి పనిచేస్తా : సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధూ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇప్పడు ఐక్యంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ నెగ్గేలా పని చేస్తామని అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతన్నలకు అండగా ఉంటామన్నారు. ‘‘నాకు ఇగో లేదు. నేను పార్టీ కార్యకర్తల భుజంతో భుజం కలిపి పని చేస్తాను. నా కంటే వయసులో చిన్నవారిని ప్రేమిస్తాను. పెద్దవారిని గౌరవిస్తాను. పంజాబ్ గెలుస్తుంది, పంజాబీలు గెలుస్తారు’’అంటూ గట్టిగా నినదించారు. తననెవరైతే వ్యతిరేకించారో వారే తాను మెరుగ్గా పని చేయడానికి సహకరిస్తారని పేర్కొన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ తామిద్దరం రాష్ట్ర సంక్షేమం కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. సర్, ఎలా ఉన్నారు ? అంతకు ముందు పంజాబ్ భవన్లో సీఎం అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. ఈ సమయంలో సీఎం దగ్గరగా వచ్చిన సిద్ధూ నమస్కరిస్తూ ఎలా ఉన్నారు సర్ అని పలకరించారు. వారిద్దరూ పక్కపక్కనే సీట్లలో కూర్చున్నారు. ఆ తర్వాత సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా ఇద్దరూ పక్క పక్క సీట్లలోనే కూర్చున్నారు. నాలుగు నెలల తర్వాత సిద్ధూ, సీఎం అమరీందర్ కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ రెండు కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ రావత్ పాల్గొన్నారు. #WATCH: Newly appointed Punjab Congress president Navjot Singh Sidhu mimics a batting style as he proceeds to address the gathering at Punjab Congress Bhawan in Chandigarh. (Source: Punjab Congress Facebook page) pic.twitter.com/ZvfXlOBOqi — ANI (@ANI) July 23, 2021 -
సిద్ధూ బాధ్యతల స్వీకారానికి సీఎం అమరీందర్
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా హాజరుకానున్నారు. సిద్దూతోపాటు రాష్ట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇటీవల నియమితులైన కుల్జీత్ సింగ్ నగ్రా, సంగత్ సింగ్ గిల్జియన్ గురువారం మొహాలీలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లి అమరీందర్‌ను ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేల తరఫున తమ ఆహ్వానానికి సీఎం అంగీకరించారని చెప్పారు. సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవు తారని వెల్లడించారు. ఇలా ఉండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం అమరీందర్ ఆహ్వానించారని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ట్విట్టర్లో పేర్కొన్నా రు. ఉదయం 10 గంటలకు పంజాబ్ భవన్లో టీ పార్టీ ఉంటుందనీ, అనంతరం అందరూ కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్లో జరిగే కొత్త పీసీసీ బృందం బాధ్యతల స్వీకార కార్య క్రమంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. -
సీఎం ఇంటి ముట్టడికి యత్నం.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులతో..
చండీగఢ్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విఫలమయ్యారంటూ.. బీజేవైఎం కార్యకర్తలు సోమవారం పంజాబ్ సీఎం అధికార నివాస ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిరసన కారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాదక ద్రవ్యాలను అరికడతామని సీఎం అమరీందర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే డ్రగ్స్‌ను అరికట్టడంలో పంజాబ్ సీఎం విఫలమయ్యారని పంజాబ్ బీజేవైఎం చీఫ్ భాను ప్రతాప్ రానా ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం వృద్ధి చెందిందని రానా పేర్కొన్నారు. దీనికి నిరసనగా రానా నేతృత్వంలోని ఆందోళనకారులు నిసరస చేపట్టారు. -
ఆ ఉద్యోగం వద్దు.. పంజాబ్ ఎమ్మెల్యే స్పష్టీకరణ
చండీగఢ్: పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫతేజంగ్ సింగ్ బజ్వా తన కుమారుడు అర్జున్ ప్రతాప్‌సింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులుకున్నట్టు స్పష్టం చేశారు. బజ్వా తండ్రి వేర్పాటు ఉద్యమ కాలంలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో బలి కావడంతో కారుణ్య నియామకాల కింద ఆయన కుమారుడికి ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల్లో ఒకరికి పోలీసు ఇన్స్పెక్టర్, ఇంకొకరికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మౌనం వీడిన ఎమ్మెల్యే తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అందుకే ఆ ఉద్యోగం అక్కర్లేదని కుటుంబ సభ్యులందరం నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్‌పై అపోహలు తొలగించండి -
పీసీసీపై కాంగ్రెస్ కసరత్తు.. తెరపైకి వచ్చిన ఇద్దరు నాయకులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర పార్టీలో సంస్థాగతంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలకు కాంగ్రెస్ హైకమాండ్ పదునుపెట్టింది. పంజాబ్ కాంగ్రెస్‌లో గొడవను పరిష్కరించేందుకు హైకమాండ్ ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అనేక అవకాశాలను పరిశీలిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు రాబోయే కొద్దిరోజుల్లో తీసుకుంటారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు సునీల్ జఖర్ స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తోందని తెలుస్తోంది. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ చాన్నాళ్లుగా సీఎం అమరీందర్‌పై బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య సమోధ్య కుదర్చడం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. పంజాబ్ కాంగ్రెస్‌లో గందరగోళం వాస్తవానికి కొన్ని నెలలుగా పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితుల మధ్య ప్రతిరోజూ పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ మిలాఖత్ అయి పనిచేస్తున్నాయనే అభిప్రాయం సాధారణ జనంలో ఉందని అసమ్మతి శిబిరం మాట్లాడటం ప్రారంభమైనప్పటి నుంచి పార్టీలో అంతర్గత గొడవ మొదలైంది. క్రమంగా ఇది సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా మారడంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ముందు 63 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పనితీరుపై ప్రశ్నలు సంధించారు. అసమ్మతిని తగ్గించేందుకు ప్యూహం పీసీసీ అధ్యక్షుడిగా సునీల్ జఖర్ స్థానంలో ఆనంద్‌పూర్ సాహిబ్ ఎంపీ, యూపీఎ హయాంలో కేంద్రమంత్రి మనీష్ తివారీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాల పేర్లు హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మనీష్ తివారీ గతేడాది పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని సోనియాగాంధీకి లేఖ రాసిన జీ–23లో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఈమధ్య కాలంలో మనీష్ తివారీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ కారణంగా జీ–23లో అసమ్మతిని తగ్గించేందుకు మనీష్ తివారీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. మరోవైపు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో సన్నిహితంగా ఉండటమే కాకుండా, అధిష్టాన పెద్దల్లో... ముఖ్యంగా రాహుల్ గాంధీ శిబిరంలో మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికల ముందు పీసీసీ మార్పు కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది. చదవండి: ఇంజనీరింగ్ చదివారు.. గంజాయి అమ్ముతూ బుక్కయ్యారు! -
నేను ఆయనలా దేశ ద్రోహిని కాదు: సీఎం
చంఢీఘడ్ : శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బిర్ సింగ్ బాదల్ తనపై చేసిన వ్యాఖ్యలను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రైతుల ఉద్యమం విషయంలో తనను ఓ ఉత్త బఫూన్ అనటమే కాకుండా తన కుటుంబంపై ఉన్న ఈడీ కేసులను ప్రస్తావించటంపై మండిపడ్డారు. శనివారం బాదల్‌పై తిరుగు దాడి చేశారు. ‘‘ నేను బాదల్ లాగా వెన్నెముక లేని వాడిని, దేశ ద్రోహిని కాను. రైతులకు వారు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. (బీజేపీతో స్నేహం.. మరోసారి సీఎం అవుతా) మీరు, మీ శిరోమణి అకాలీ దళ్ అధికార దాహంతో కళ్లు మూసుకుపోయి పాకిస్తాన్‌నుంచి మన రాష్ట్ర భద్రతకు పొంచి ఉన్న ముప్పును పట్టించుకోవటం లేదు. పంజాబ్ సరిహద్దుల వెంట భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, డ్రోన్లతో ఎలాంటి ప్రమాదం లేదని అంటారా?. నేను అకస్మాత్తుగా వణికిపోవటానికి నాపై ఎలాంటి ఈడీ కేసులు లేవు’’ అని అన్నారు. -
రైనా బంధువులపై దాడి.. సిట్ దర్యాప్తుకు ఆదేశం
చండీఘడ్ : పంజాబ్‌లో తమ బంధువులపై భయంకరమైన దాడి జరిగిందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. తమ కుటుంబంపై దాడి చేసిందో ఎవరో గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశాడు. దీనిలో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సురేశ్ రైనా ట్విటర్ ద్వారా విన్నవించాడు. దీనిపై స్పందించిన సీఎం అమరీందర్ సింగ్.. రైనా బంధువులపై జరిగిన దాడిపై దర్యాప్తు చేయాలని పంజాబ్ పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కేసును త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. (మా అంకుల్‌ను చంపేశారు: రైనా) కాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో గల రైనా బంధువుల ఇంటిపై ఆగస్టు 29న నలుగురు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అర్థరాత్రి నిద్రిస్తున్నసమయంలో అకస్మాత్తుగా దాడి చేసి రైనా మేనమామ అశోక్‌ను హత్య చేయగా.. ఆయన భార్య ఆశా రాణితో సహా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రైనా కజిన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆశా రాణి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరోవైపు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటనకు పాల్పడింది ‘కాలే కచ్చే గ్యాంగ్’ అని తెలినప్పటికీ సాధ్యమైన అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ దింకర్ గుప్తా తెలిపారు. (రైనాను సీఎస్కే వదులుకున్నట్లేనా..!) -
పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
చండీఘర్ : పంజాబ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుక్రవారం అధికారులతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి 14 రోజుల హోం క్వారంటైన్ అనే నిబంధనను అక్కడి ప్రభుత్వం మార్చి 29 నుంచి కొనసాగిస్తుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో 14 రోజుల హోం క్వారంటైన్‌ను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు రావాలనుకునే ఇతర రాష్ట్రాల వారు దీని కోసం ఏర్పాటు చేసిన కోవా యాప్‌లో స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని పూర్తి చేయాలని చెప్పారు. దీంతో ప్రయాణ అనుమతిలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మరోవైపు కరోనా సోకిన వారిని గుర్తించేందుకు వచ్చేవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా పంజాబ్‌లో ఇప్పటివరకు 5,784 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 152గా ఉంది. (‘మెడికల్ సీట్లలో ఓబీసీ రిజర్వేషన్ల వర్తింపు’) -
‘చిక్కుల్లో కర్తార్‌పూర్ కారిడార్’
సాక్షి, న్యూఢిల్లీ : కర్తార్‌పూర్ కారిడార్ పనులను పాకిస్తాన్ నిలిపివేసిందనే వార్తలపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసిన నేపథ్యంలో కర్తార్‌పూర్ కారిడార్ పనుల్లో పాకిస్తాన్ జాప్యం చేస్తుండటం పట్ల కెప్టెన్ సింగ్ స్పందించారు. మరో మూడు నెలల్లో గురునానక్ 550వ జయంతోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పనుల్లో జాప్యంతో ఈ చారిత్రక సందర్భానికి ప్రాజెక్టు పూర్తికాని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నిర్ణయాలు ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ప్రభావం చూపరాదని ఆయన పాక్‌కు హితవు పలికారు. ఈ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సమావేశాలు నిర్వహించేందుకు పాకిస్తాన్‌కు భారత అధికారులు సమాచారం పంపారన్న వార్తల నేపథ్యంలో కెప్టెన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్తార్‌పూర్ కారిడార్ పనులు పూర్తయితే పాక్‌లోని కర్తార్‌పూర్ దర్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని డేరాబాబా నానక్ ఆలయానికి సిక్కు యాత్రికులు వీసా రహిత ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు చేయడంతో భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య, దౌత్య సంబంధాలను పాకిస్తాన్ తెంచుకోవడంతో కర్తార్‌పూర్ కారిడార్ పనులు చిక్కుల్లో పడ్డాయి. -
సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..
సాక్షి, చండిఘడ్ : నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా లేఖ అందిందని, అయితే దాన్ని చదివాకే నిర్ణయం తీసుకుంటానని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో సఖ్యత కుదరక ప్రముఖ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ఆదివారం మంత్రి పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధూ జులై 10న రాజీనామా లేఖను రాహుల్‌గాంధీకి సమర్పించారు. ఆదివారం తన రాజీనామాపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. చివరిగా ముఖ్యమంత్రికి పంపారు. తన రాజీనామను చివరిగా ముఖ్యమంత్రికి పంపడంతోనే వీరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. సిద్ధూ రాజీనామాపై అమరీందర్‌సింగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని నేనే కాబట్టి తుది నిర్ణయం నాదేనని, ఆ లేఖను చదివాకే స్పందిస్తానన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌పార్టీ గెలిచినప్పటి నుంచి సిద్ధూ, అమరీందర్‌ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు వచ్చాయి. రాజకీయ నాయకుడిగా మారిన ఈ మాజీ క్రికెటర్ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నాడు. కానీ చివరికి ముఖ్యమంత్రి పదవి కెప్టెన్‌కు వరించడంతో వీరి మధ్య చీలికలు మొదలయ్యాయి. అప్పటినుంచే ఉప్పు నిప్పులా ఉన్న వీరికి భారత్ పాక్‌ల మధ్య సిద్ధు వివాదాల తర్వాత మరింత దూరం పెరిగింది. తనకు కెప్టెన్ రాహుల్ గాంధీయేనని, తన కెప్టెన్(సీఎం)కు కూడా ఆయనే కెప్టెన్ అంటూ గత ఏడాది సిద్ధూ వ్యాఖ్యానించడం తీవ్ర విభేదాలకు ఆజ్యం పోసింది. ఈ ఘటనల మధ్యనే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జూన్ 6వ తేదీన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, స్థానిక పాలన శాఖల బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించి ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలను కేటాయించారు. దీంతోపాటు పలు ప్రభుత్వ కమిటీల్లో సిద్దూకు స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్దూ గత నెల 9వ తేదీన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసి, పరిస్థితిని వివరించడంతోపాటు ఒక లేఖను కూడా అందజేసినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన తనకు కేటాయించిన కొత్త మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టలేదు. -
ట్రాక్టర్ నడిపిన రాహుల్ : పంజాబ్ సీఎం ఇంట్రెస్టింగ్ ట్వీట్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పంజాబ్‌లోని లూథియానాలో బుధవారం పర్యటించిన ఆయన శ్రేణులను ఆకట్టుకున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ట్రాక్టర్‌ను నడిపి కొద్దిసేపు హల్ చల్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జాతీయ కాంగ్రెస్ స్టీరింగ్ చేతబట్టిన రాహుల్ గాంధీకి నాయకుడిగా తిరుగేలేదని నిరూపించుకున్నారని కమెంట్ చేశారు. అంతేకాదు 2014లో నరేంద్రమోదీ తమనుంచి లాక్కున్న జాతి అధికార పగ్గాలను రాహుల్‌కు అందించే సమయమిది అని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రైతులకు భరోసాగా ఉంటాననే హామీ ఇచ్చేందుకే రాహుల్ ట్రాక్టర్ నడిపారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ట్రాక్టర్‌పై రాహుల్‌తోపాటు పంజాబ్ సీఎం లూథియానా ఎంపీ అభ్యర్థి రవ్నీత్ బిట్టు, కాంగ్రెస్ నేత ఆశా కుమార్ లూథియానా బహిరంగ సమావేశం అనంతరం వీధుల్లో ప్రచారం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల చివరి దశలో భాగంగా పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు మే 19 న పోలింగ్ జరగనుంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: పంజాబ్‌లో సరదాగా ట్రాక్టర్ నడిపిన రాహుల్ గాంధీ Found @RahulGandhi to be greater driver when he took @INCIndia steering wheel. But today’s enjoyable tractor ride with him showed he could drive anything, most of all our nation. Any day better than the ride @narendramodi took us on in 2014! Time to hand over the wheels to Rahul! pic.twitter.com/At99fWamzO — Capt.Amarinder Singh (@capt_amarinder) May 15, 2019