ఓర్నీ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబూ | Amarinder Singh Name Confusion Football Goal Keeper Funny Tweet Viral | Sakshi
Sakshi News home page

పేర్ల కన్‌ఫ్యూజన్‌: ‘మీకు దండం ఆపండహే’ అంటూ గోల్‌కీపర్‌ రిక్వెస్ట్‌

Published Thu, Sep 30 2021 1:52 PM | Last Updated on Thu, Sep 30 2021 4:43 PM

Amarinder Singh Name Confusion Football Goal Keeper Funny Tweet Viral - Sakshi

టెక్నాలజీ వల్ల ఎంత మంచి జరుగుతుందో.. ఒక్కోసారి అంతే ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో నడిచే కమ్యూనికేషన్‌..  చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిస్‌ కమ్యూనికేషన్‌ మారుతుంది కూడా. కేవలం టెక్నికల్‌ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని.. వ్యవహారంతో సంబంధం లేనివాళ్లను ఇబ్బంది పెడుతుండటం తరచూ చూస్తుంటాం. అలాంటిదే ఈ ఘటన.


ప్రస్తుతం పంజాబ్‌ రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా అనంతర పరిణామాలు ఆసక్తిగా మారాయి. అయితే ఈ వ్యవహారంలోకి సంబంధం లేని వ్యక్తి పేరు తెర మీదకు రాగా.. అది సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అమరీందర్‌ సింగ్‌..  ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీం గోల్‌ కీపర్‌. అయితే ఈ అమరీందర్‌ సింగ్‌ను.. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌గా పొరపడి మీడియా ఛానెల్స్‌, వెబ్‌సైట్లు, నెటిజన్స్‌ ఎగబడి ట్విటర్‌లో ట్యాగ్‌ చేస్తున్నారట.

దీంతో ఈ ట్యాగుల గోల భరించలేక ట్విటర్‌లో రియాక్ట్ అయ్యాడు గోల్‌ కీపర్‌ అమరీందర్‌ సింగ్‌.  దయచేసి ట్యాగ్‌ చేయడం ఆపండంటూ మీడియా హౌజ్‌లకు రిక్వెస్ట్‌లు చేశాడాయన. మనోడి రిక్వెస్ట్‌కి మీడియా పేజీల సంగతేమోగానీ.. నెటిజన్స్‌ మాత్రం భలేగా రియాక్ట్‌ అవుతున్నారు. గోల్‌కీపర్‌ అమరీందర్‌.. జట్టుకు కెప్టెన్‌ అయ్యి ఉంటే సరిగ్గా సరిపోయి ఉండేదని ఒకరు, సీఎం అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టమని మరొకరు.. ఇలా ఒక్కోక్కరు సరదా సంభాషణలతో గోల్‌కీపర్‌ అమరీందర్‌ టైం లైన్‌ను నింపేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement