ఇంటిపట్టున ఉండి పిల్లాడి ఆలనాపాలన చూడాలనేది ఆమె కల. అయితే ఆమెది రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. పొద్దున పని కోసం బయటికి వెళితే ఏ రాత్రో ఇంటికి వచ్చేది. సెలవంటూ లేని పని. పరీక్ష ఫీజు కట్టలేని సందర్భంలో పిల్లాడిని పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడి పిల్లాడిని చదివించింది.
పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఆ అబ్బాయి అయూష్ గోయల్ ఎకౌంటెంట్ అయ్యాడు. ఆ తరువాత ట్విట్టర్ కాపీరైటర్‌గా మంచి ఆదాయన్ని అర్జిస్తున్నాడు. అమ్మను పని మానిపించాడు. తాము ఉండే ఇరుకు గది నుంచి 2–బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌కు మారాడు. ‘ఇప్పుడు మా అమ్మ ఫుల్–టైమ్ మదర్’ అని తల్లి ఫొటోలను జత చేస్తూ ఆయూష్ గోయల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందిని కదిలించింది.
Comments
Please login to add a commentAdd a comment