accountant
-
ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీ బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభం ఈజీ
న్యూఢిల్లీ: గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ... ఇంటర్నేషన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీ) బ్యాంకులో ఎటువంటి పాన్ లేకుండా విదేశీ కంపెనీలు, ఎన్ఆర్ఐలు, నాన్–రెసిడెంట్లు అకౌంట్ ప్రారంభించే వెసులుబాటును ఆర్థికశాఖ కలి్పంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల మినహాయింపు కలి్పంచినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనిప్రకారం బ్యాంక్ ఖాతాను తెరిచే నాన్–రెసిడెంట్ లేదా విదేశీ కంపెనీ ఫారమ్ 60లో డిక్లరేషన్‌ను దాఖలు చేస్తే సరిపోతుంది. అలాగే భారతదేశంలో ఎలాంటి పన్ను బకాయిలను కలిగి ఉండకూడదు. జీఐఎఫ్‌టీ–ఐఎఫ్ఎస్సీ ఆర్థిక రంగానికి సంబంధించి పన్ను–తటస్థ ప్రాంతంగా ఉంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపు విదేశీ కంపెనీలు, ఎన్ఆర్ఐలు, ఇతర నాన్–రెసిడెంట్లు ఐఎఫ్ఎస్సీ బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతాను తెరవడాన్ని సులభతరం చేస్తుందని నంగియా అండర్సన్ ఎల్ఎల్పీ భాగస్వామి ( ఫైనాన్షియల్ సర్వీసెస్) సునీల్ గిద్వానీ అభిప్రాయపడ్డారు. రుణాలు, డిపాజిట్లుసహా ఐఎఫ్ఎస్సీలో రిటైల్ వ్యాపార విభాగం పురోగతికి తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని గిద్వానీ చెప్పారు. -
టెక్ ఉద్యోగులకే కాదు.. వీరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు!
ఆర్థిక వ్యవహారాల్లో ఆడిటర్లు, అకౌంటెంట్ల పాత్ర చాలా కీలకం. అయితే వీరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు పొంచి ఉంది. ఆడిటర్లు, అకౌంటెంట్లు చేస్తున్న పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ అన్నారు. సీఏ ఎస్. హరిహరన్ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సోమనాథన్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిర్దిష్ట ప్రభావాన్ని కలిగి ఉందన్నారు. వ్యాపార ప్రక్రియలో ఆటోమేషన్‌ను కృత్రిమ మేధస్సు మరింత శక్తివంతంగా చేస్తుందన్నారు. ఆడిటర్లు, అకౌంటెంట్లు చేస్తున్న పనిని కొంచెం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదని ఆయన అన్నారు. (ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..) ఇక భారత ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ లెండింగ్ విస్తరణను తాను ఊహించగలనని సోమనాథన్ పేర్కొన్నారు. ‘భారతదేశంలో ప్రైవేట్ రంగానికి జీడీపీలో సుమారు 55 శాతం క్రెడిట్ ఉండగా, చైనాలో ఇది 180 శాతానికి పైగా ఉంది. అయితే ఇది ఆరోగ్యకరమని లేదా వాంఛనీయమని చెప్పను. ఇది జీడీపీలో 100-120 శాతానికి పెరగాలి. ఇది పెట్టుబడి వృద్ధిని వేగవంతం చేస్తుంది’ అన్నారు. ఇప్పటి వరకూ ప్రారంభంకాని ప్రాజెక్ట్‌లు కూడా తగినంత క్రెడిట్ లభిస్తే ప్రారంభమవుతాయన్నారు. అయితే ఎన్పీఏలు లేకుండా క్రెడిట్ పరిమాణాన్ని విస్తరించడం సవాలు అన్నారు. ఈ క్రెడిట్ విస్తరణ అకౌంటెంట్లకు డిమాండ్ పెరగుతుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భారత్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య నిరంతరం పెరుగుతుందని, 6 నుంచి 7 శాతం వార్షిక విస్తరణను చూడగలమని సోమనాథన్ వివరించారు. ఫలితంగా నిపుణులైన అకౌంటెంట్లకు డిమాండ్ పెరుగుతుందన్నారు. -
హమ్మయ్యా.. అమ్మ కల నెరవేరింది
ఇంటిపట్టున ఉండి పిల్లాడి ఆలనాపాలన చూడాలనేది ఆమె కల. అయితే ఆమెది రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. పొద్దున పని కోసం బయటికి వెళితే ఏ రాత్రో ఇంటికి వచ్చేది. సెలవంటూ లేని పని. పరీక్ష ఫీజు కట్టలేని సందర్భంలో పిల్లాడిని పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడి పిల్లాడిని చదివించింది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఆ అబ్బాయి అయూష్ గోయల్ ఎకౌంటెంట్ అయ్యాడు. ఆ తరువాత ట్విట్టర్ కాపీరైటర్‌గా మంచి ఆదాయన్ని అర్జిస్తున్నాడు. అమ్మను పని మానిపించాడు. తాము ఉండే ఇరుకు గది నుంచి 2–బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌కు మారాడు. ‘ఇప్పుడు మా అమ్మ ఫుల్–టైమ్ మదర్’ అని తల్లి ఫొటోలను జత చేస్తూ ఆయూష్ గోయల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందిని కదిలించింది. -
టెక్నాలజీతో అకౌంటింగ్ వ్యవస్థల్లో పారదర్శకత
ముంబై: పారదర్శకమైన అకౌంటింగ్ వ్యవస్థల కోసం టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం అవసరమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శుక్రవారం మొదలైన 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ సదస్సును ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎఫ్‌సీఏ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆర్థిక సుస్థిరతకు, ప్రజలకు స్థిరమైన ఉపాధి, స్థిరమైన తయారీ, సేవలకు సైతం పారదర్శక అకౌంటింగ్ వ్యవస్థ అవసరాన్ని మంత్రి గుర్తు చేశారు. విశ్వాసం, నైతిక పరమైన అకౌంటింగ్ విధానాలు లేకుండా పారదర్శకత సాధ్యపడదన్నారు. వెబ్ 3.0 వంటి వినూన్న టెక్నాలజీలు ఇప్పటికే మన జీవితంలో భాగమయ్యాయంటూ, వ్యాపార నిర్వహణ విధానాన్ని సైతం ఎంతో మార్చేయగలవన్నారు. బ్లాక్‌చైన్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలైటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నవి అకౌంటింగ్ విధానాలను మెరుగుపరచడమే కాకుండా.. టెక్నాలజీ, మెషిన్ ఆధారిత వేగవంతమైన నిర్ణయాలకు వీలు కల్పిస్తాయని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో మరింత పారదర్శకత అవసరాన్ని ప్రస్తావించారు. దీనికి మూలస్తంభం పారదర్శకమైన అకౌంటింగ్ అని గుర్తు చేశారు. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దీన్ని నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారు. రెన్యువబుల్ ఎనర్జీపై పెట్టుబడులు పెంచాలి పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. భారత్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం ఏఐఐబీ ప్రెసిడెంట్ జిన్ లికున్ మంత్రి సీతారామన్‌ను ఢిల్లీలో కలుసుకున్నారు. బ్యాంకుకు సంబంధించి పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. భారత్‌లో ఏఐఐబీ పోర్ట్‌ఫోలియో విస్తరణ (మరిన్ని రుణాల మంజూరు)ను అభినందిస్తూ.. భారత్‌లో పెట్టుబడులు పెంచాలని ఆర్థిక మంత్రి సీతారామన్ కోరినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల సంప్రదింపులకు వీలుంటుందని మంత్రి సూచించినట్టు తెలిపింది. ఏఐఐబీలో భారత్ 7.74 శాతం వాటాతో రెండో అతిపెద్ద ఓటింగ్ హక్కుదారుగా ఉంది. చైనాకు 29.9 శాతం వాటా ఉంది. ఏఐఐబీ బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. -
చదివింది 12.. అకౌంటెంట్‌గా ఘరానా మోసం
వెయ్యి కోట్ల రూపాయలకు బోగస్ బిల్లులు జారీ చేయడంతో పాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద 181 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 27 ఏళ్ల వయసున్న ఆ నిందితుడి పేరు, ఇతర వివరాలను వెల్లడించని పోలీసులు.. సదరు వ్యక్తి 12వ తరగతి వరకు మాత్రమే చదివాడని మాత్రం చెప్పారు. అకౌంటెంట్‌గా, జీఎస్టీ కన్సల్టెంట్‌గా ఈ భారీ స్కామ్‌కు పాల్పడినట్లు ముంబై జోన్ పాల్ఘడ్ సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు వెల్లడించారు. డేటా మైనింగ్, డేటా విశ్లేషణ ఆధారంగా అందిన నిర్దిష్ట ఇన్‌పుట్‌లతో అధికారులు తీగను లాగారు. M/s నిథిలన్ ఎంటర్ప్రైజెస్ ‘గూడ్స్ లేదా సేవల’ రసీదు లేకుండా నకిలీ ఇన్వాయిస్లను జారీ చేయడంతో నకిలీ ITCని పొందడం లాంటి విషయాలు అధికారుల దృష్టికి రావడంతో ఈ డొంక అంతా కదిలింది. అంతేకాదు తన క్లయింట్లలోని ఓ వ్యక్తి ఐడెంటిటీ ద్వారా నిందితుడు జీఎస్టీ మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీనివెనుక పెద్ద ముఠా ఉందని అనుమానిస్తున్న పోలీసులు.. ముఠా నెట్‌వర్క్‌ను చేధించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
అడల్ట్ కంటెంట్ పిచ్చి.. ఆన్లైన్ ప్రియురాలి మోజు.. వ్యసనాల కోసం ఏకంగా..
అహ్మదాబాద్: చెడు అలవాట్లు వ్యసనంగా మారడంతో ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం అయ్యింది. ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ వ్యసనంతో పాటు ఆన్లైన్లో పరిచయమైన మహిళ కోరికలు తీర్చేందుకు ఓ వ్యక్తి తన యజమానిని మోసగించి కోటి వరకు స్వాహా చేశాడు. ఈ ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడితో పాటు మరో ఇద్దరిని రాజ్‌కోట్‌లో అరెస్ట్ చేశారు. (చదవండి: ప్రియురాలు పని చేసే చోట దొంగతనం.. పాపం పోవాలని పూజలు.. ) వివరాల ప్రకారం.. తుషార్ సెజ్పాల్ అనే వ్యక్తి, గ్రాఫిక్ డిజైనర్ అయిన ఇర్ఫాన్ షేక్ చెందిన సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. పోర్న్‌కు బానిసగా మారిన సెజ్పాల్, ఇంటర్నెట్లో అడల్ట్ మూవీస్ చూడటానికి సంస్థ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.16 లక్షలు వరకు వాడుకున్నాడు. అంతేగాక ఇటీవల ఆన్లైన్లో ఓ మహిళతో పరిచయం ఏర్పడడం అతని జీవితాన్నే మార్చేసింది. ఆమె పరిచయం అయిన కొన్ని రోజులకు ప్రియురాలుగా మారింది. సెజ్పాల్ బలహీనతను పసిగట్టిన ఆ మహిళ అతని నుంచి పలమార్లు డబ్బులు రాబట్టింది. అనేక సందర్భాల్లో ఆమె కోరిక మేరకు ఎంత డబ్బు అడిగితే అంత ట్రాన్స్ఫర్ చేసేవాడు సెజ్పాల్. అలా ఇప్పటి వరకు అతను ఇర్ఫాన్ సంస్థ బ్యాంక్ ఖాతా నుంచి రూ.85 లక్షల మొత్తాన్ని బదిలీ చేశాడు. చివరికి ఇర్ఫాన్ కొనుగోలు చేసిన ఇంటి ఈఎంఐలను కూడా చెల్లించకుండా ఆ మొత్తాన్ని కూడా సెజ్పాల్ తన ప్రియురాలు ఖాతాకు మళ్లించాడు. అలా సెజ్పాల్ రూ.కోటి దాకా సంస్థ డబ్బుని తన సొంతానికి ఉపయోగించాడు. చివరకు ఈ విషయం ఇర్ఫాన్‌కు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా సెజ్పాల్, తన ప్రియురాలు ఆమె తల్లి సహా ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు -
అకౌంటెంట్ పరీక్షలో అందరూ ఫెయిలే..
పణజి: ఏ పరీక్షలోనైన పాస్, ఫెయిల్ అనేవి సర్వ సాధారణం కానీ, ఈ పరీక్షలో మాత్రం అందరూ ఫెయిలే. ఈ ఘటన గోవాలో జరిగింది. బుధవారం అకౌంటెంట్ పరీక్ష ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 8 వేల మంది అభ్యర్థులూ ఫెయిలయ్యారని పేర్కొంది. గోవా ప్రభుత్వం 80 అకౌంటెంట్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ ఏడాది జనవరి 7న పరీక్ష నిర్వహి ంచింది. మొత్తం 100 మార్కుల పేపర్‌కు 5గంటల సమయం కేటాయించారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించా లంటే కనీసం 50 మార్కులు రావాలి. ఏ ఒక్క అభ్య ర్థికీ 50 మార్కులు రాకపోవడం, వీరంతా గ్రాడ్యు యేట్ విద్యార్థులే కావడం గమనార్హం. గోవా యూని వర్సిటీ, కామర్స్ కాలేజీలు విద్యార్థులను ఇలా చేయడం సిగ్గుచేటని శివసేన దుయ్యబట్టారు. -
వందకోట్ల ఆస్తిని వదులుకుని...
అహ్మదాబాద్ : వందల కోట్ల ఆస్తి, విలాసవంతమైన జీవితం, పెద్ద వ్యాపారం, ప్రాణంగా ప్రేమించే కుటుంబం...ఇవేవీ ఈ 24 ఏళ్ల యువకునికి సంతృప్తినివ్వలేదు. జీవితం అంటే ఇంతేనా అనిపించింది. తన జీవిత గమ్యం వ్యాపారం చూసుకోవడం కాదని తెలుసుకున్నాడు. ఈ భౌతిక సుఖాలను, వాంఛలను వదిలి దైవాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు సన్యాసమే సరైన మార్గంగా భావించాడు. పూర్తిగా దేవుని సేవకు అంకితం అవ్వడానికి తనకున్న వందకోట్ల ఆస్తిని, వ్యాపారాన్ని వదిలి సన్యాసం స్వీకరిస్తున్నాడు అహ్మదాబాద్‌కు చెందిన మోక్షేష్ షేత్. గుజరాత్‌లోని దీసా పట్టణానికి చెందిన సందీప్ షేత్ వ్యాపార నిమిత్తం ముంబైలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం సందీప్ ముంబైలో అల్యూమినియం వ్యాపారం చేస్తున్నాడు. ఇతని పెద్ద కుమారుడైన మోక్షేష్ సీఏ పూర్తి చేసిన అనంతరం కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో మోక్షేష్‌కు దైవాన్ని తెలుసుకోవాలనే కోరిక కల్గింది. అందుకు సన్యాసం స్వీకరించడమే సరైన మార్గంగా తోచడంతో ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసాడు. వారి అంగీకారంతో మోక్షేష్ ఈ రోజు గాంధీనగర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో సన్యాసం స్వీకరిస్తున్నాడు. సన్యాసం స్వీకరించిన అనంతరం మోక్షేష్ పేరు ‘కరుణప్రేమ్ విజయ్ జీ’ గా మారుతుందిన అతని మామయ్య తెలిపాడు. మోక్షేష్ జైన సాంప్రదాయాలు పాటించే కుటుంబానికి చెందినవాడు. గుజరాత్‌కు చెందిన కోటీశ్వరుడైన వజ్రాల వ్యాపారి కొడుకు పన్నేండేళ్ల ‘భవ్య సాహ్’ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అకౌంటెన్సీ వారి వారసత్వం...!
ఒకే కుటుంబం నుంచి (రక్తసంబంధీకులు) వరసగా అయిదు తరాల పాటు ఒకే వృత్తిని నిర్వహించిన ఘనత ప్రపంచంలోనే తమ పరివారానిదేనని చతుర్వేది అనే సీఏ ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. భారత వాణిజ్య రాజధాని ముంబయిలో బీఎం చతుర్వేది అండ్ కంపెనీ పేరు గల ఓ సీఏ సంస్థ అధిపతి ఈ మేరకు సవాల్ చేస్తున్నారు. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదుకు ఈ కుటుంబపెద్ద బ్రిజ్మోహన్ చతుర్వేది దరఖాస్తు చేశారు. మూడోతరానికి చెందిన బీఎం చతుర్వేది తన మనవరాలు మోహిని చతుర్వేది(అయిదోతరం) కఠినమైన సీఏ అర్హత పరీక్షలో నెగ్గి వారసత్వంగా వస్తున్న కుటుంబ వృత్తిలో అడుగుపెట్టింది. తొలి అడుగు 1925లో... ఉత్తరప్రదేశ్ మధురకు చెందిన బిషంబర్నాథ్ చతుర్వేది (బీఎం చతుర్వేది తాత) ఢిల్లీలోని ఓ సంస్థలో శిక్షణ పొందాక 1925లో సీఏ వృత్తి చేపట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మధురలోని దాదాపు 500 మంది ఛార్టెర్డ్ అకౌంటెన్సీ వృత్తిలోకే దిగారు. బిషంబర్ ఇద్దరు కొడుకులు అమర్నాథ్ (బీఎం చతుర్వేది తండ్రి), దీనానాథ్ సీఏ చేశారు. అమర్నాథ్ 1955లో ఈ వృత్తిలో చేరాక ఇరవై ఏళ్లకు బీఎం చతుర్వేది,ఇద్దరు సోదరులు కూడా అదేబాటలో పయనించారు. చతుర్వేది తోడబుట్టిన సోదరులు, సోదరీమణుల పిల్లలు, ఆయన మనవరాలు (చిన్నకుమార్తె బిడ్డ) ప్రత్యేక వారసత్వాన్ని కొనసాగించడంలో చేతులు కలిపారు. ప్రస్తుతం డేవిడ్ కుటుంబం పేరిట... ప్రస్తుతం నైజీరియాలోని డేవిడ్ ఒమ్యూయా డెఫినెన్ కుటుంబం పేరిట ఈ గిన్నెస్ రికార్డ్ నమోదై ఉంది. డేవిడ్ తర్వాతి తరంలో అయిదుమంది సీఏలు (ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు)న్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు సీఏ వృత్తిలో ఎక్కువ మంది (ఆరుగురు) కొనసాగుతున్నందున ఈ విధంగా వీరిని ప్రపంచంలోని తొలి కుటుంబంగా పరిగణిస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా 11 మంది తన రక్తసంబంధీకులు సీఏలుగా ఉన్నారని చతుర్వేది చెబుతున్నారు. వరసగా అయిదు తరాల పాటు ఒకే వృత్తిలో కొనసాగడంతోపాటు 11 మంది సీఏలు ఒకే కుటుంబం నుంచి ఉన్నందున గిన్నెస్రికార్డ్ తమకే చెందుతుందని అంటున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విదేశీ బ్యాంకు వంచన కేసులో ఇద్దరి అరెస్ట్
బనశంకరి : ఓ విదేశీ బ్యాంకులో అకౌంటెంట్లుగా చేరిన ఇద్దరు వ్యక్తులు పెద్ద మొత్తంలో నగదును వారి సొంత ఖాతాల్లోకి మళ్లించిన కేసులో సదరు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 8.14 కోట్ల నగదు, 470 గ్రాముల బంగారు నగలు, భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషర్ సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అమెరికాకు చెందిన జెపీ మోర్గాన్ బ్యాంకు ఇక్కడి మారతహళ్లిలో ఉంది. ఈ బ్యాంకులో 2013లో బెళ్లందూరుకు చెందిన సురేశ్‌బాబు, దొడ్డగుబ్బికి చెందిన మారుతి అలియాస్ రాము అకౌంటెంట్లుగా చేరారు. 2017 ఆగస్టు 24న బ్యాంక్‌కు చెందిన ఖాతాదారుడి నుంచి మరో ఖాతాదారుడి అకౌంట్‌కు రూ.12.15 కోట్ల నగదు బదిలీ కావాల్సి ఉంది. ఈ ఇద్దరు అకౌంటెంట్లు ఆ నగదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుని బంగారు ఆభరణాలు, స్థలాలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో ఇద్దరూ ఉద్యోగాలు వదిలివేశారు. ఈ నేపథ్యంలో ఓ ఖాతాదారుడు తనకు రావాల్సిన నగదు అకౌంట్లో జమ కాలేదని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. మారతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెన్నైలో తలదాచుకున్న మారుతిని సోమవారం అరెస్ట్ చేశారు. ఇతడిని విచారణ చేయగా అసలు గుట్టు విప్పాడు. అతడి సమాచారంతో సురేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన పోలీసులకు రూ. 50 వేల నగదు బహుమతిని కమిషనర్ సునీల్ కుమార్ ప్రకటించారు. -
గుంటూరులో హత్య.. కోటప్పకొండలో దహనం
సాక్షి, గుంటూరు: ఓ వ్యక్తిని హతమార్చి.. దాన్ని ఏమార్చాలని చూసి అడ్డంగా దొరికిపోయారు.. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. గుంటూరు నగరానికి చెందిన మినుముల వ్యాపారి కొప్పురావూరి శంకరరావుకు పొన్నూరుకు చెందిన శిఖాకొల్లి శ్రీనివాసరావుకు ఆర్థిక వివాదాలున్నాయి. గతంలో శంకరరావు వద్ద గుమస్తాగా పనిచేసిన శ్రీనివాసరావు అక్రమంగా రూ.2 కోట్ల వరకు డబ్బులు వాడుకున్నాడు. ఈ మేరకు శంకరరావు 2014లో అరండల్‌పేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించాలంటూ శంకరరావు కుమారుడు సందీప్ పలుమార్లు శ్రీనివాసరావుపై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోయింది. దీంతో గురువారం అర్ధరాత్రి శంకరరావు తనయుడు సందీప్‌తోపాటు మరికొందరు శ్రీనివాసరావును గుంటూరులో హతమార్చి గోనెసంచిలో మృతదేహాన్ని కారులో ఎక్కిస్తుండగా స్థానికులు కొందరు చూసి డయల్ 100కు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహాన్ని వారు నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలోని పెట్లూరివారిపాలెం వద్దకు తరలించి పెట్రోలు పోసి దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితులుగా అనుమానిస్తున్న శంకరరావు, సందీప్‌లతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా, శ్రీనివాసరావు గత 20 రోజులుగా కనిపించడం లేదని ఆయన సోదరుడు సుబ్బారావు పోలీసులకు తెలిపాడు. అయితే హత్యకు ఆర్థికపరమైన వ్యవహారమే కాకుండా బలమైన కారణం ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
బ్యాంకు అధికారులు కిడ్నాప్... రూ. 20 లక్షలు డిమాండ్
పాట్నా: బీహర్‌లో కిడ్నాపర్లు మరోసారి రెచ్చిపోయారు. జుమాయి జిల్లాలోని ఇద్దరు బ్యాంకు అధికారులను సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేశారని పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. వారిని విడుదల చేయాలంటే రూ. 20 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఆ అధికారులు ఇద్దరు కిడ్నాప్ అయ్యారని చెప్పారు. అయితే సదరు అధికారుల కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆ ఇద్దరు అధికారులు రాజ్‌ల బ్రాంచ్ మేనేజర్ ఓమ్ ప్రకాశ్ పాశ్వాన్, రంజిత్ కుమార్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. కిడ్నాప్ చేసింది మావోయిస్టులా లేక నేరస్థులా అనే విషయంపై దర్యాప్తు సాగుతుందని తెలిపారు. బ్యాంకులో విధులు ముంగించుకుని... ఇంటికి వెళ్తుండగా మోటర్ సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు వీరిద్దరిని అపహరించుకునిపోయారని ఇంటిలిజెన్స్ అధికారులు వెల్లడించారని చెప్పారు. సదరు అధికారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిటన్లు ఎస్పీ ఉపేంద్ర ప్రసాద్ సింగ్ తెలిపారు.