బ్యాంకు అధికారులు కిడ్నాప్... రూ. 20 లక్షలు డిమాండ్ | Branch manager of bank, accountant kidnapped in Bihar | Sakshi
Sakshi News home page

బ్యాంకు అధికారులు కిడ్నాప్... రూ. 20 లక్షలు డిమాండ్

Published Tue, Feb 3 2015 1:24 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

బ్యాంకు అధికారులు కిడ్నాప్... రూ. 20 లక్షలు డిమాండ్

బ్యాంకు అధికారులు కిడ్నాప్... రూ. 20 లక్షలు డిమాండ్

పాట్నా: బీహర్లో కిడ్నాపర్లు మరోసారి రెచ్చిపోయారు. జుమాయి జిల్లాలోని ఇద్దరు బ్యాంకు అధికారులను సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేశారని పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. వారిని విడుదల చేయాలంటే రూ. 20 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఆ అధికారులు ఇద్దరు కిడ్నాప్ అయ్యారని చెప్పారు. అయితే సదరు అధికారుల కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.

కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆ ఇద్దరు అధికారులు రాజ్ల బ్రాంచ్ మేనేజర్ ఓమ్ ప్రకాశ్ పాశ్వాన్, రంజిత్ కుమార్లుగా గుర్తించినట్లు చెప్పారు. కిడ్నాప్ చేసింది మావోయిస్టులా లేక నేరస్థులా అనే విషయంపై దర్యాప్తు సాగుతుందని తెలిపారు. బ్యాంకులో విధులు ముంగించుకుని... ఇంటికి వెళ్తుండగా మోటర్ సైకిల్పై వచ్చిన వ్యక్తులు వీరిద్దరిని అపహరించుకునిపోయారని ఇంటిలిజెన్స్ అధికారులు వెల్లడించారని చెప్పారు. సదరు అధికారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిటన్లు ఎస్పీ ఉపేంద్ర ప్రసాద్ సింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement