Branch manager
-
మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచి మేనేజర్ ఆత్మహత్య
ఖమ్మం : ఖమ్మం జిల్లా మణప్పురం గోల్డ్‌లోన్ మణుగూరు బ్రాంచి మేనేజర్ మేరిపురి రాజు(28) బుధవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం మెట్లపల్లి గ్రామానికి చెందిన రాజు మణుగూరులో మణప్పురం గోల్డ్‌లోన్ బ్రాంచి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అందులోని ఉద్యోగులంతా ఆఫీస్ పక్కనే ఉన్న ఒక గదిలో ఉంటున్నారు. ఉద్యోగులంతా ఆఫీస్ పనుల్లో నిమగ్నమై ఉండగా రాజు గదికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల బ్రాంచీలో రూ.1.20 లక్షలు లోటు రావడంతో ఉద్యోగులంతా కలిసి దాన్ని పూడ్చారు. కంపెనీలోని పై అధికారుల ఒత్తిడి, తన మూలంగా కిందిస్థాయి ఉద్యోగులు ఇబ్బంది పడ్డారనే ఆత్మన్యూనతాభావం రాజును వెంటాడింది. అదే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించిన సీఐ పెద్దన్నకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకు అధికారులు కిడ్నాప్... రూ. 20 లక్షలు డిమాండ్
పాట్నా: బీహర్‌లో కిడ్నాపర్లు మరోసారి రెచ్చిపోయారు. జుమాయి జిల్లాలోని ఇద్దరు బ్యాంకు అధికారులను సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేశారని పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. వారిని విడుదల చేయాలంటే రూ. 20 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఆ అధికారులు ఇద్దరు కిడ్నాప్ అయ్యారని చెప్పారు. అయితే సదరు అధికారుల కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆ ఇద్దరు అధికారులు రాజ్‌ల బ్రాంచ్ మేనేజర్ ఓమ్ ప్రకాశ్ పాశ్వాన్, రంజిత్ కుమార్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. కిడ్నాప్ చేసింది మావోయిస్టులా లేక నేరస్థులా అనే విషయంపై దర్యాప్తు సాగుతుందని తెలిపారు. బ్యాంకులో విధులు ముంగించుకుని... ఇంటికి వెళ్తుండగా మోటర్ సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు వీరిద్దరిని అపహరించుకునిపోయారని ఇంటిలిజెన్స్ అధికారులు వెల్లడించారని చెప్పారు. సదరు అధికారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిటన్లు ఎస్పీ ఉపేంద్ర ప్రసాద్ సింగ్ తెలిపారు.