మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచి మేనేజర్ ఆత్మహత్య | manappuram gold branch manager suicide in manuguru | Sakshi
Sakshi News home page

మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచి మేనేజర్ ఆత్మహత్య

Published Thu, Apr 23 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

manappuram gold branch manager suicide in manuguru

ఖమ్మం : ఖమ్మం జిల్లా మణప్పురం గోల్డ్‌లోన్ మణుగూరు బ్రాంచి మేనేజర్ మేరిపురి రాజు(28) బుధవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం మెట్లపల్లి గ్రామానికి చెందిన రాజు మణుగూరులో మణప్పురం గోల్డ్‌లోన్ బ్రాంచి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అందులోని ఉద్యోగులంతా ఆఫీస్ పక్కనే ఉన్న ఒక గదిలో ఉంటున్నారు. ఉద్యోగులంతా ఆఫీస్ పనుల్లో నిమగ్నమై ఉండగా రాజు గదికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.

ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల బ్రాంచీలో రూ.1.20 లక్షలు లోటు రావడంతో ఉద్యోగులంతా కలిసి దాన్ని పూడ్చారు. కంపెనీలోని పై అధికారుల ఒత్తిడి, తన మూలంగా కిందిస్థాయి ఉద్యోగులు ఇబ్బంది పడ్డారనే ఆత్మన్యూనతాభావం రాజును వెంటాడింది. అదే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించిన సీఐ పెద్దన్నకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement