
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: ముక్కుపచ్చలారని చిన్నారి జీవితం.. మూడేళ్లకే ముగిసింది. బుడి బుడి అడుగులేస్తూ ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిని మృత్యువు కారు రూపంలో కబళించింది. డోర్లు లాక్ కావడంతో అందులోనే ఊపిరాడక కన్నుమూసింది. మణుగూరు సాంబాయిగూడెంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
సాయి లిఖిత అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న కారు ఎక్కింది. డోర్లు లాక్ కావడంతో రాత్రంతా అందులోనే ఉండిపోయింది. ఉదయం నిద్ర లేచిన తల్లిదండ్రులు ఆందోళనతో బిడ్డ కోసం అంతా గాలించారు. చివరకు కారులో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారిని గుర్తించారు.
ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. అప్పటికే సాయి లిఖిత ఊపిరాడక కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా.. స్థానికంగా విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment