badradri kothagudem district
-
ఆడుకుంటూ కారులో ఎక్కి ఊపిరాడక.. మణుగూరులో విషాద ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: ముక్కుపచ్చలారని చిన్నారి జీవితం.. మూడేళ్లకే ముగిసింది. బుడి బుడి అడుగులేస్తూ ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిని మృత్యువు కారు రూపంలో కబళించింది. డోర్లు లాక్ కావడంతో అందులోనే ఊపిరాడక కన్నుమూసింది. మణుగూరు సాంబాయిగూడెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సాయి లిఖిత అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న కారు ఎక్కింది. డోర్లు లాక్ కావడంతో రాత్రంతా అందులోనే ఉండిపోయింది. ఉదయం నిద్ర లేచిన తల్లిదండ్రులు ఆందోళనతో బిడ్డ కోసం అంతా గాలించారు. చివరకు కారులో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. అప్పటికే సాయి లిఖిత ఊపిరాడక కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా.. స్థానికంగా విషాదం నెలకొంది. -
గన్ మిస్‌ఫైర్.. డీఎస్పీ మృతి
సాక్షి,భద్రాద్రికొత్తగూడెంజిల్లా: సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్‌ఫైర్ అయి డీఎస్పీస్థాయి అధికారి శేషగిరి మృతి చెందినట్లు తెలుస్తోంది. చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామంలోని క్యాంపులో బుధవారం(ఏప్రిల్24) ఈ ఘటన జరిగింది. పూసుగుప్ప సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ క్యాంపులో శేషగిరి విధులు నిర్వహిస్తున్నారు. ఛాతిలోకి బుల్లెట్ దూసుకెవెళ్లడంతో శేషగిరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇది మిస్‌ఫైరా లేక ఆత్మహత్యనా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
భద్రాద్రి కొత్తగూడెం: జూలూరుపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
మరింత ముదురుతున్న భద్రాద్రి లడ్డూ వివాదం
-
భక్తులకు ప్రసాదంగా బూజ్ పట్టిన లడ్డూలు
-
భద్రాద్రి: నా బిడ్డకు న్యాయమేది?.. అశోక్ భార్య కన్నీటి ఆక్రోశం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని టేకుపల్లి మండలంలో జరిగిన దారుణ ఘటన.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అశోక్(24) దారుణ హత్య కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడనే కారణంతో అతన్ని గొంతు కోసి, నరికి చంపారు దుండగులు. దీంతో ముత్యాలంపాడు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ముత్యాలంపాడు క్రాస్ రోడ్‌కు చెందిన ప్రేమ్ కుమార్‌కు రూ. 80 వేలు అప్పు ఇచ్చాడు ధారావత్ అశోక్. ఈ వ్యవహారంలో మరో మధ్వవర్తి కూడా ఉన్నాడు. అయితే తిరిగి ఆ డబ్బు ఇవ్వమని అడగడంతో.. కక్ష పెంచుకుని హత్యకు ప్లాన్ వేశారు. శనివారం రాత్రి అప్పు తీరుస్తాం రమ్మంటూ పిలిచి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అశోక్ తండ్రి బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ. అయితే తన కొడుకు హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అశోక్‌కు ఏడాది కిందటే వివాహం అయ్యింది. నెలల పాప ఉంది. దీంతో ఒళ్లో పసికందుతో అశోక్ భార్య కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. అశోక్‌ను చంపిన వాళ్లను శిక్షించి.. తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతోందామె. తన భర్తను దూరం చేసి.. చిన్న వయసులో తన జీవితాన్ని ఇలా మార్చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, పోలీసుల వల్ల కాకపోతే తమ ఎదుటకు తీసుకొస్తే తామే శిక్షిస్తామని ఆక్రోశంతో నిండిన ఆవేదనను వెల్లగక్కింది ఆమె. ఇదిలా ఉంటే.. హత్యపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని అంటోందామె. ఒక్కడి వల్లే ఈ హత్య సాధ్యం కాదని, ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది. గ్రామస్థులు కూడా అశోక్ శారీరకంగా ధృడమైన మనిషిని అని, ప్రతిఘటించే అవకాశం కావడంతో.. ఈ హత్యలో తమకూ అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఈ హత్యకు గ్రామంలో ఉండే గంజాయి బ్యాచ్‌కు సంబంధం ఉందన్న భావిస్తున్నారు వాళ్లు. మరోవైపు ఇది రూ. 80 వేల వ్యవహారమేనా? హత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు హత్యపై కుటుంబసభ్యుల అనుమానాలు
-
చిట్టీల పేరుతొ చీటింగ్...
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత
-
భద్రాద్రి జిల్లాలో మంకీపాక్స్ కలకలం!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మంకీ పాక్స్ హైరానా నెలకొంది. మణుగూరు మండలంలోని విజయనగరం గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి మంకీ పాక్స్ లక్షణాలు అగుపించాయి. దీంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. మధ్యప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థి.. రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతనిలో జ్వరం, ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో మణుగూరు ప్రభుత్వ వైద్యాధికారి సూచనల మేరకు కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటలో అతని రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ సిరం ఇనిస్టిట్యూట్‌కు పంపిస్తున్నారు వైద్యులు. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య ఇదే తరహాలో టెస్టులకు పంపించగా.. నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: మంకీపాక్స్‌ను తేలిగ్గా తీసుకోవద్దు.. అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ -
రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే!
సాక్షి, కొత్తగూడెం రూరల్: అదొక సాధారణ డాబా ఇల్లు. ఆ ఇంట్లో రెండు ఫ్యాన్లు, ఒక కూలర్, ఐదు బల్బులు మాత్ర మే ఉన్నాయి.. ఆ కుటుంబం నెల రోజులకు 117 యూనిట్ల విద్యుత్ వినియోగించింది. కానీ బిల్లు మాత్రం రూ.7,02,825 వచ్చింది. దీం తో ఆ ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ ఇంటికి ప్రతినెలా రూ.500 నుంచి రూ.700 విద్యుత్ బిల్లు వచ్చేది. కానీ బుధవారం తీసిన రీడింగ్‌లో మాత్రం రూ.7 లక్షలకు పైగా బిల్లు రావడంతో ఆయన బెంబేలెత్తిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యమో లేదా మెషీన్లో లోపం వల్లే బిల్లు వచ్చిందని, నెల రోజు లకు తాము వినియోగించింది 117 యూనిట్లేనని సంపత్ వాపోతున్నాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీనిపై విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్ మాట్లాడుతూ.. సంపత్ ఇంటికి వచ్చిన బిల్లు రూ.625 మాత్రమేనని, రీడింగ్ మిషన్‌లో లోపం వల్లే ఇలా జరిగిందన్నారు. చదవండి: పంజగుట్ట: మేనేజర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని.. -
భద్రాద్రి కొత్తగూడెం: అప్పు తీర్చలేదని మహిళపై..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆర్థిక లావాదేవీలతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో పరిధిలో ఈ దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీదేవి అనే మహిళ తన దగ్గర అప్పు తీసుకుందని, తిరిగి ఇవ్వమంటే జాప్యం చేస్తోందని నిందితుడు నవతన్ చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేశాడట. శ్రీదేవిపై కత్తి దాడి స్థానికంగా కలకలం సృష్టించగా.. ఘటనపై నవతన్‌పై కేసు నమోదు చేశారు చంచుపల్లి పోలీసులు. ఈలోపే నవతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
ఒక్క ఎకరాకైనా పట్టాలిచ్చారా?: షర్మిల
ములకలపల్లి: ఆదివాసీ, గిరిజనులు సాగు చేసుకుం టున్న పోడు భూములకు పట్టాలి స్తామని గద్దెనెక్కిన సీఎం కేసీఆర్, కనీసం ఒక్క ఎకరాకైనా హక్కు పత్రాలు ఇచ్చారా అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కొనసాగింది. మామిళ్ల గూడెంలో రైతుగోస దీక్షలో పాల్గొన్న షర్మిల మాట్లా డుతూ... ఏజెన్సీలో పోడు పట్టాలే ప్రధాన సమస్యగా ఉందని, దివంగత వైఎస్సార్ అప్పట్లోనే 3లక్షల ఎకరాలకు పైగా భూములకు హక్కుపత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత నేతలు, ప్రస్తు తం సీఎం కేసీఆర్.. ఒక్క ఎకరానికి కూడా పట్టాలివ్వకపోవడం దారుణమన్నారు. పైగా భూముల నుంచి సాగుదా రులను గెంటేస్తూ, మహిళలు, పిల్లలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు, తాలు కొర్రీలు లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల బాధ తీరాలన్నా, పోడు సాగుదారులకు పట్టాలు దక్కాలన్నా వైఎస్సార్ టీపీని ఆశీర్వదించాలని ఆమె కోరారు. యాత్రలో గిరిజనులు సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాల నడుమ షర్మిలకు స్వాగతం పలికారు. -
పంట నష్టపోతే పరిహారమేదీ?: షర్మిల
అశ్వాపురం: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి రైతులు అప్పుల పాలైతే వారికి కనీసం పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 65వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెంలో ఆదివారం రైతు గోస ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పంటలు నష్టపోయినప్పుడు పరిహారం ఇవ్వకుండా రైతుబంధు పథకంలో రూ.5 వేలు ఇస్తే ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటల బీమా పథకం ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు అని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఇలా సరఫరా చేస్తే పంట ఎండిపోతుందనే ఆందోళనతో సిద్దిపేట జిల్లాలో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణానికి సీఎం కేసీఆరే కారణమన్నారు. ధర్నాలో వైఎస్సార్టీపీ నాయకులు పిట్టా రాంరెడ్డి, గడిపల్లి కవిత, టీఆర్ఎస్కు చెందిన గొల్లగూడెం సర్పంచ్ తాటి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీ ఏరియా దేశంలో భాగం కాదా?
టేకులపల్లి: గిరిజన, ఆదివాసీలు నివసిస్తున్న ఏజెన్సీ ప్రాంతాలు దేశం, రాష్ట్రంలో భాగమా.. లేక పక్క దేశాల్లో భాగమా అని అర్థం కాని పరిస్థితి నెలకొందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంతో పాటు కాలనీతండా, దుబ్బతండా, ముత్యాలంపాడు, తెలుగూరు, తూర్పుగూడేల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె టేకులపల్లిలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి రైతుగోస ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా, పేదలు సాగు చేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో లాక్కుంటున్నారని ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకపోగా ఇప్పుడు దళితబంధు పేరుతో మరో మోసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. -
ఓట్ల కోసమే కేసీఆర్ పోడు పట్టాల హామీ
ఇల్లెందు: పోడు భూములకు పట్టాలు ఇస్తా మని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా ఓట్ల కోసమే తప్ప ఆచరణలో కనిపించడం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోకి గురువారం ప్రవేశించగా రొంపేడులో రైతుగోస మహా ధర్నా నిర్వహించారు. అనంతరం రాత్రి ఇల్లెందులో జరిగిన సభకు జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 3.3 లక్షల ఎకరాలకు అటవీ హక్కుల పట్టాలు ఇచ్చారని, ఆయన జీవించి ఉంటే 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చేవారని తెలి పారు. అయితే, ప్రతీ ఊరికి వచ్చి కుర్చీ వేసుకుని మరీ పట్టాలు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు.. కుర్చీలు దొరకడం లే దా అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తాననే మాట నిలబెట్టుకోలేని పక్షంలో పాలన నుంచి వైదొలగాలని సూచించారు. ప్రశ్నించే ప్రతిపక్షం లేక కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాటలా మారిందన్నారు. -
గిరిజనుల స్థితిగతులు ఆందోళనకరం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రాష్ట్రంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా 9.34% ఉంది. కానీ పలు ప్రాంతాల్లో వారి ఆరోగ్యం, జీవనస్థితిగతులపై నాకు ఆందోళన కలుగుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని గిరిజన గ్రామాలను దత్తత తీసుకొని ఆయా తెగల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక చర్య లు తీసుకుంటా’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. రెండు రోజుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం దమ్మపేట మండలం పూసుకుంట, అశ్వారావుపేట మండలం గోగులపూడి, రెడ్డిగూడెంలో గవర్నర్ పర్యటించారు. కొండరెడ్లతో ముఖా ముఖి నిర్వహించారు. అనంతరం అశ్వాపురం మండలంలోని మణుగూరు భారజల కర్మాగారాన్ని సందర్శించారు. తర్వాత కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి గవర్నర్ విలేకరులతో మాట్లాడారు. దమ్మపేట మండలం పూసుకుంటలో కొండరెడ్లను పలకరించానన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రి సౌజన్యంతో అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించగా ఒకరికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలిందన్నారు. ఆ వ్యక్తికి హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయిస్తామన్నారు. అలాగే 100 మంది గర్భిణులకు స్కానింగ్ నిర్వహిస్తే 48 మంది హైబీపీతో, 27 మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. బ్రెస్ట్ కేన్సర్‌తో ఒకరు, సర్వైకల్ కేన్సర్‌తో ఒకరు బాధపడుతున్నారని చెప్పారు. రూ. 44.32 లక్షలు మంజూరు... ‘గిరిజనులు పీచు పదార్థాలు తినకపోవడం వల్లే వారిలో ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. అందుకే ఇప్పపువ్వుతో చేసిన మహువా లడ్డూలు పెడుతున్నాం. తద్వారా చిన్నారుల్లో పోషకలోపాన్ని అధిగమించి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అలాగే ఆ ప్రాంత అభివృద్ధికి మేం రూ. 44.32 లక్షలు మంజూరు చేశాం. మహిళల కోసం హైజీనిక్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. గిరిజన మార్గాల్లో అత్యవసర పరిస్థితుల్లో సాధారణ అంబులెన్సులు, వాహనాలు ప్రయాణించలేనందున రెండు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశాం’అని గవర్నర్ తెలిపారు. మీరంటే ఎంతో ప్రేమ... ‘మీపై (ఆదివాసీలపై) ఎంతో ప్రేమ ఉంది. ఆ ఆసక్తి, అభిరుచితో మీ కోసం పోషకాహార లోప నివారణకు పైలట్ ప్రాజెక్టు చేపట్టా. మీరంతా సంపూర్ణ ఆరోగ్యంగా, మంచి చదువు, జీవనోపాధితో జీవించాలని కోరుకుంటున్నా’అని కొండరెడ్డి గిరిజనులతో భేటీలో గవర్నర్ తమిళిసై చెప్పారు. అంతకుముందు తమిళిసైకి గిరిజన మహిళలు రేల నృత్యాలు, చిల్ల కాయల సవ్వడులు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమిళిసై సరదాగా డప్పులు వాయిస్తూ వారితో కలసి నృత్యం చేశారు. ఆపై కొండరెడ్లతో కలసి సహపంక్తి భోజనం చేయడంతోపాటు వారికి స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ గౌరవ చైర్మన్ అజయ్ మిశ్రా, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆర్డీవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
రాములోరి కల్యాణానికి వేళాయె...
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసంత ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేక మహోత్సవం ఆలయం వద్ద ఉన్న మిథిలా స్టేడియంలో జరగనున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణాన్ని భారీ స్థాయి లో జరిపేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత ఆరు బయట కల్యాణోత్స వం జరగనుండటంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. కాగా, కల్యాణానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఒకవేళ సీఎం రాకపోతే ఆయన తరఫున కుటుంబసభ్యులు గానీ.. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని సమాచారం. అలాగే, జిల్లా ప్రజల తరఫున తాను స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పోచంపల్లి పట్టువస్త్రాలు ప్రత్యేకం రామయ్య కల్యాణానికి ఈ ఏడాది తొలిసారిగా పోచంపల్లి చేనేత కార్మికులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సికింద్రాబాద్‌లోని గణేశ్ టెంపుల్ చైర్మన్ జయరాజు ఆధ్వర్యం లో శనివారం ఈ పట్టు వస్త్రాలను రామాలయ ఈఓ శివాజీకి అందచేయనున్నారు. అలాగే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన భక్త బృందం గోటితో వొలిచిన 3 క్వింటాళ్ల తలంబ్రాలను సమర్పించారు. అంతేకాకుండా సీవీఆర్ వస్త్ర దుకాణం వారు స్వామి వారి ముత్యాల కొనుగోలుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. 11, 12 తేదీల్లో గవర్నర్ పర్యటన పాల్వంచ రూరల్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శ్రీరామనవమి మరుసటి రోజు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారికి నిర్వహించే మహా పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరవడం ఆనవాయితీ. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో గవర్నర్, 11న భద్రాచలం చేరుకుంటారు. సీతారామచంద్రస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, పట్టాభిషేకంలో పాల్గొంటారు. 12న దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో పర్యటిస్తారు. -
నాన్నే.. అమ్ముకున్నాడు..
డిచ్పల్లి/అశ్వారావుపేట రూరల్: కన్నతండ్రులే కాసులకు కక్కుర్తి పడి పేగుబంధాన్ని తెంచుకోజూశారు.. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువులను అమ్మకానికి పెట్టారు.. రెండు వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు పసికందులను విక్రయించిన తండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించి వారి ఆచూకీ తెలుసుకున్నారు. ఆ శిశువులను తీసుకొచ్చి తల్లుల ఒడికి చేర్చా రు. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన భీమవ్వ, కొమురయ్య దంపతులు సంచారజాతికి చెందినవారు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కుమారులు పఠాన్‌చెరులోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్నారు. పాపతో కలసి ఆ దంపతులు రెండు నెలల క్రితం డిచ్పల్లి మండలం ఘన్పూర్ మహాలక్ష్మీనగర్ కాలనీకి వలస వచ్చారు. గుడారంలో ఉంటూ రోడ్ల పక్కన చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తున్నారు. గర్భిణీ అయిన భీమవ్వ శనివారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. స్థానిక ఆశ వర్కర్ తల్లీబిడ్డలను డిచ్పల్లి క్లస్టర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిశీలించిన వైద్య సిబ్బంది శిశువు తక్కువ బరువుతో ఉన్నాడని, వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, వారు నిజామాబాద్‌కు కాకుండా తమ గుడారం వద్దకు చేరుకున్నారు. సమీపంలోని బట్టీలో ఆ ఇద్దరు దంపతులు కల్లు తాగుతుండగా ధర్మారం(బి) గ్రామానికి చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు. కొమురయ్యకు మాయమాటలు చెప్పి, రూ.2,500 ఇచ్చి బాలుడ్ని తీసుకెళ్లాడు. మత్తు దిగిన తర్వాత భీమవ్వ శిశువు గురించి భర్తను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేసింది. విచారణలో కొమురయ్య అసలు విషయం చెప్పడంతో ధర్మారం(బి)లోని లక్ష్మణ్ ఇంటికి పోలీసులు చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం భీమవ్వను, శిశువును జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించారు. అయితే, తాను శిశువును కొనుగోలు చేయలేదని, రాత్రి వారి గుడారం దగ్గర నుంచి వెళ్తుండగా తల్లిదండ్రులు కల్లు మత్తులో సోయి లేకుండా పడిపోయి ఉన్నారని, శిశువు ఏడుస్తుండటంతో ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే అనుమానంతో ఇంటికి తీసుకొచ్చినట్లు లక్ష్మణ్ పోలీసులకు తెలిపారు. రూ. 2 లక్షలకు విక్రయించిన తండ్రి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లికి చెందిన ఘంటా అరుణ్‌కుమార్ భార్య చిలకమ్మ ఈ నెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె మత్తులో ఉండగానే భర్త అరుణ్ కుమార్, అత్త ఘంటా మేరీ కలిసి శిశువును చింతలపూడి మండలానికి చెందిన ఆర్ఎంపీలు బుచ్చిబాబు, శ్రీనివాస్, అశ్వారావుపేటకు చెందిన ప్రశాంతి సహకారంతో విశాఖకు చెందిన ఓ వ్యక్తి కి రూ. 2 లక్షలకు అమ్మేశారు. శిశువు విషయమై అల్లిపల్లి అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆరా తీయగా విక్రయించినట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అరుణ్‌కుమార్, మేరితోపాటు బుచ్చిబాబు, శ్రీనివాస్, ప్రశాంతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్లా అరుణ తెలిపారు. -
విషాదం: పీఎస్‌లో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలోని ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. నైట్‌డ్యూటీలో ఉన్న సంతోష్ శనివారం తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సంతోష్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో సంతోష్ మృతదేహన్ని జిల్లా ఏఎస్పీ శ్రీనివాస్ సందర్శించారు. -
అదిగో భద్రాద్రి.. ఇదిగో యాదాద్రి
భద్రాచలం/యాదగిరిగుట్ట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో గురువారం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛరణలు, ధూపదీపాల నడుమ జే గంటలు మార్మోగుతుండగా జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. భద్రాద్రిలో ధూపదీపాల నడుమ ఉత్తర ద్వారం తెరుస్తున్న అర్చకులు, వేద పండితులు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ శివాజీ తదితరులు పాల్గొన్నారు. కాగా, కోవిడ్ నిబంధనల కారణంగా భక్తులకు ప్రవేశం కల్పించకపోవడంతో పలువురు బారికేడ్ల ఆవలి నుంచే రామచంద్రస్వామి ని దర్శించుకున్నారు. ఇటు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోనూ గురువారం ముక్కోటి ఏకాదశి వేడుకలుఘనంగా జరిగాయి. బాలాలయంలో ఆచార్యులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు ఏర్పాట్లు చేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు గరుడవాహనంపై బాలాలయంలోని తూర్పుద్వారం గుండా వైకుంఠ ద్వార దర్శనం ఇచ్చారు. పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సైతం శ్రీస్వామివారిని ఉత్తర ద్వారం గుండా భక్తులకు వైకుంఠదర్శనం కల్పించారు. సాయంత్రం శ్రీస్వామిని విష్ణుమూర్తిగా అలంకరించి మత్సా్యవతారంలో సేవను ఊరేగించారు. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అను వంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
ఇక్కడ గర్భిణులు ఆడుతారు, పాడుతారు, వ్యాయామం చేస్తారు...
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం / భద్రాచలం : ఇక్కడ గర్భిణులు ఆడుతారు.. పాడుతారు.. వ్యాయామం చేస్తారు. ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా భయపడరు. సాధారణ ప్రసవం అవుతామనే ధీమా అందరిలోనూ కనిపిస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు మించిన మిషనరీలు, వైద్య సిబ్బంది సేవలు ఈ ఆస్పత్రి సొంతం. ఇక్కడ గత రెండేళ్లుగా గర్భిణులు, శిశు మరణాల సంఖ్య ఒకటి, రెండుకు మించి లేకపోవడం విశేషం. అందుకే జిల్లా నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్.పురం, కుక్కునూరు, వేలేరుపాడు, యటపాక మండలాల వారు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సైతం గర్భిణులు సుఖ ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారు. సామాన్యులే కాదు.. వీఐపీలకూ ఈ ఆస్పత్రిపై అపార నమ్మకం. ప్రస్తుత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ల సతీమణులు కూడా ఈ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేయించుకోవడం గమనార్హం. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అందుతున్న సేవలపై అన్ని వర్గాల వారిలోనూ భరోసా రోజురోజుకూ పెరుగుతోంది. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే మార్పు తెచ్చిన ‘మిడ్వైఫ్ ప్రాక్టీషనర్ సిస్టం’ సరిగ్గా రెండేళ్ల క్రితం.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 80 శాతం ప్రసవాలు ఆపరేషన్లే జరిగేవి. ఈ ఆస్పత్రితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి, కాగజ్‌నగర్, ఏటూరునాగారం, పెద్దపల్లి, కోస్గి సీహెచ్‌సీలు, మంచిర్యాల, మహబూబాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, గజ్వేల్, భద్రాచలం ఏరియా ఆస్పత్రులు, ఎంసీహెచ్ కరీంనగర్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువని తేలింది. చదవండి: విద్యార్థినుల హాస్టల్.. నీడలాగ ఒక ముఖం.. వింత శబ్దాలు.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గర్భిణులతో వ్యాయామం చేయిస్తున్న మిడ్వైఫ్ ప్రాక్టీషనర్లు దీంతో ఆయా ఆస్పత్రుల్లో తల్లీ బిడ్డల మరణాల రేటు తగ్గించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో 2017లో ప్రభుత్వం ‘నర్స్ మిడ్వైఫ్ ఆఫ్ ప్రాక్టీషనర్’ సిస్టమ్‌కు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 దరఖాస్తులు రాగా 30 మందిని ఎంపిక చేసి, వారికి కరీంనగర్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 12 నెలలు, సంగారెడ్డి ఎంసీహెచ్‌లో ఆరు నెలలు, మరో చోట ఆరు నెలలు.. ఇలా మొత్తం రెండేళ్ల పాటు శిక్షణ ఇప్పించింది. అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్న 12 ఆస్పత్రులకు ఇద్దరు, ముగ్గురు చొప్పున నియమించింది. 1,250 సాధారణ ప్రసవాలు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు మొత్తం 1,984 ప్రసవాలు జరిగాయి. అందులో 1,250 సాధారణ ప్రసవాలే ఉండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల వారీగా చూస్తే.. సాధారణ కాన్పుల్లో ‘భద్రాచలం ఏరియా ఆస్పత్రి’ మొదటి స్థానంలో ఉండడం విశేషం. కాగా రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్య దేవరాజన్, సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్ గతంలో ఈ ఆస్పత్రిని సందర్శించారు. మిడ్వైఫ్ ప్రాక్టీషనర్ల పనితీరును స్వయంగా తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గర్భిణుల వివరాలు తెలుసుకుంటున్న వాకాటి కరుణ, ఐటీడీఏ పీఓ (ఫైల్) -
Evaru Meelo Koteeswarulu: రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!
Evaru Meelo Koteeswarudu 1 Crore Winner: కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బీ రాజారవీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్న సంగతి మనకు తేలిసిందే. ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్నారు. రాజారవీంద్ర ప్రైజ్ మనీ గెలిచిన ఎపిసోడ్ సోమ, మంగళ వారాల్లో రాత్రి 8.30 గంటలకు ప్రముఖ ఛానెల్లో ప్రసారం అవుతుంది. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు. 2000 - 2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఇదివరకు సాఫ్ట్వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు సాధించారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించారు. ఎవరు మీలో కోటీశ్వరులు పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్న సబ్ ఇన్స్పెక్టర్ బీ రాజారవీంద్రకు దక్కేది మాత్రం తక్కువ అని సోషల్ మీడియాలో ప్రజలు కామెంట్ చేస్తున్నారు. అయితే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి గనుక గెలిస్తే అతడు కచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిచాల్సి ఉంటుంది. గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూటర్ చెల్లింపు సమయంలో ఈ పన్ను మినహాయించి డబ్బు చెల్లిస్తారు. అంటే ఎవరు మీలో కోటీశ్వరులలో కోటి గెలిస్తే విజేతకు వచ్చేది రూ.68,80,000 మాత్రమే. మిగతా రూ.31,20,000 వేలు పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. (చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!) -
కొత్తగూడెం: మేనకోడళ్లపై మామ లైంగిక దాడి..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మేనకోడళ్లపై మామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తాజాగా జిల్లాలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళితే.. 12 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు కవల బాలికలకు అండగా ఉంటానని మేనమామ మల్రెడ్డి కృష్ణారెడ్డి చేరదీశాడు. అయితే చిన్నారులను చేరదీసిన మేనమామ కామాంధుడిగా మారి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చిన్నతనం నుంచి ఈ ఘోరం జరుగుతుండటంతో ఏం చేయాలో తోచక బాధను దిగమింగుకొని భరిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అక్కాచెల్లెలు.. కొత్తగూడెం పట్టణంలోని ఓ కళాశాలలో విద్యానభ్యసిస్తున్నారు. అయితే ఇటీవల మేనమామ వేధింపులు భరించలేక అక్కాచెల్లెళ్లిద్దరూ ఎదురు తిరిగారు. దీంతో తనపై ఎదురుతిరిగిన కవలలపై మేనమామ కృష్ణారెడ్డి చేయి చేసుకున్నాడు. విషయం బయటకు చెప్తే ఆస్తి మొత్తం తీసుకుని చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తమను కామాంధుడి చెర నుంచి రక్షించాలని అక్కాచెల్లెళ్లు కొత్తగూడెం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: జంట హత్యల కలకలం: చెల్లిని చంపిందని తల్లిని హత్య చేసిన కొడుకు.. -
కళ్ళముందే ఉంటున్న ఇల్లు కూలిపోతే?
-
బురదలో కూరుకుపోయిన మంత్రి అజయ్ కారు
సాక్షి, దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా దుమ్ముగూడెం మండలం నర్సాపురానికి వచ్చిన రాష్ట్ర మంతి పువ్వాడ అజయ్‌కుమార్ అక్కడి రోడ్లతో ప్రజలు పడే బాధలను స్వయంగా అనుభవించారు. శనివారం మంత్రి పర్యటనకు వచ్చే సమయానికే నర్సాపురంలో వర్షం కురుస్తోంది. వర్షంలోనే పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అజయ్‌కుమార్, రైతువేదిక సమావేశంలో మాట్లాడి తిరుగు పయనమయ్యారు. అయితే మంత్రి ఎక్కిన కారు చిన్న వర్షం కారణంగా ఏర్పడిన బురదలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు, సెక్యూరిటీ అధికారులు కారును తోసి బయటకు తీశారు. ఆ తర్వాత మంత్రి కొత్తగూడెం పర్యటనకు వెళ్లారు. చదవండి: RS Praveen kumar: సీఎంగా కేసీఆర్ ఏడేళ్లు ఏం చేశారు..? -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెం టౌన్: నిషేధిత మావోయిస్టు పార్టీ ఇద్దరు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెంలో ఎస్పీ సునీల్‌దత్ శనివారం వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దమిడిసెలేరుకు చెందిన గట్టుపల్లి సురేశ్, బొడిక భీమయ్య గతంలో మూడేళ్లు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని దళాల్లో పనిచేశారు. ఆ తర్వాత చర్ల ఎల్ఓసీ సభ్యులుగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. అయితే, మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీలోని కొందరు వేధిస్తుండటంతో భరించలేక పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా గిరిజన మహిళలు, చిన్నారులతో మావోయిస్టులు బలవంతంగా పని చేయించుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేశ్, భీమయ్య తెలిపారు. కాగా, మావోయిస్టులు లొంగిపోతే వారి భవిష్యత్‌కు అన్నివిధాల అండగా నిలుస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం వారిద్దరికీ రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ హరిఓం ఖారే, సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద్ పవార్, భద్రాచలం ఏఎస్పీ వినీత్, చర్ల సీఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టు అరెస్ట్ దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఓ మావోయిస్టును శనివారం అరెస్ట్ చేసినట్టు ఎస్పీ సునీల్‌శర్మ తెలిపారు. అరెస్టు చేసిన మావోయిస్టు శివయాదవ్‌పై రూ.లక్ష రివార్డు ఉందని వెల్లడించారు. 2012లో కలెక్టర్‌ను కిడ్నాప్ చేసిన కేసులో శివయాదవ్ నిందితుడని ఎస్పీ పేర్కొన్నారు. -
పోటాపోటీగా ‘పల్లె ప్రగతి’!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అభివృద్ధి అంశంలో పల్లెల మధ్య పోటీ నెలకొంది. కొత్తగా పనుల గుర్తింపు, అసంపూర్తిగా ఉన్న పనుల పూర్తి, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లతో తమ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేందుకు పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గాలే కాకుండా ప్రజలు పోటీ పడుతున్నారు. అధికారులు సైతం పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని సంబంధిత అధికారులు, ఉద్యోగులను హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు పల్లె ప్రగతిలో చేపడుతున్న పనుల పురోగతి, పారిశుద్ధ్యం, పంచాయతీ కార్యాలయాల తనిఖీలు, గ్రామసభల నిర్వహణ, విద్యుత్ బిల్లుల వసూళ్లపై క్షేత్రస్థాయి నుంచి ప్రగతి నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం ఉత్తమ, చెత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను గుర్తించి సంబంధిత అధికారులకు నివేదిస్తోంది. మూడో విడత పల్లె ప్రగతిలో పనుల పురోగతిని సమీక్షించిన ప్రభుత్వం పారిశుద్ధ్యం, పచ్చదనం–పల్లె ప్రకృతి వనాలు, పన్ను వసూళ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల అంశాలపై ఉత్తమ జిల్లాల జాబితాను గత నెలలో వెల్లడించింది. ఇదే సమయాన పెద్దగా పురోగతి లేని ఐదు జిల్లాల వివరాలను ప్రకటించారు. దీంతో నాలుగో విడతలోనూ ‘ఉత్తమ’ జాబితాలో స్థానం పొందేలా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారు. మరోవైపు చేపడుతున్న పనులతో పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నాలుగో విడత. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జూలై ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించిన అధికారులు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులను గుర్తించి వాటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని విడతల్లో కలిపి 51,076 గ్రామ సభలు జరిగాయి. కాగా, మూడో విడతలో జరిగిన పనులను ఆరు అంశాల్లో పరిశీలించిన ప్రభుత్వం... ఉత్తమమైన, పనుల్లో పురోగతిలో లేని ఐదేసి చొప్పున జిల్లాలను ఎంపిక చేసి వెల్లడించింది. పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఏళ్లుగా తీరని ప్రధాన సమస్యలు పల్లె ప్రగతితో పరిష్కారమవుతూ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పల్లె ప్రగతిలో భద్రాద్రి జిల్లా నాలుగు విభాగాల్లో రాష్ట్రంలోనే టాప్ ఐదు స్థానాల్లో నిలిచింది. – రమాకాంత్, డీపీఓ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
నిత్య పెళ్లికూతురు సుహాసినికి ఏకంగా దొంగల టీమే ఉంది!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అనాథనని చెబుతూ పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తున్న కిలాడి లేడి నిత్య పెళ్లికూతురు సుహాసిని మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక సంవత్సరంలో సుహాసిని ఇద్దరిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మోసం చేస్తూ ఉంటుందని ఆమె చేతిలో మోసపోయిన బాధితుడు ‘సాక్షి’కి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్లాన్ ప్రకారం సుహాసిని ట్రాప్ చేసి మోసాలు చేస్తూ ఉందని పేర్కొన్నారు. సుహాసినికి దొంగల టీం ఉందని, తన లాగా సుహాసిని చేతిలో మోసపోయిన బాధితులు చాలా మందే ఉన్నారని తెలిపారు. సుహాసిని మోసాలు తమకు తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోయిందని వెల్లడించారు. పారిపోయే ముందు ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం అంతా తీసుకెళ్లిందని తెలిపారు. తమ దగ్గర మొత్తం 16లక్షలు తీసుకొని వెళ్ళిందని, అదే సమయంలో మణుగూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేస్తే కంప్లెట్ తీసుకులేదని పేర్కొన్నారు. సుహాసిని ఎపిసోడ్లో తమ కుటుంబం పూర్తిగా ఇబ్బందుల్లో పడిందని, తన ఎపిసోడ్ తర్వాత తిరుపతిలో సునీల్ అనే వ్యక్తి మోసం చేసిందన్నారు. -
అనాథనని చెబుతూ మోసాలు.. నిత్య పెళ్లి కూతురు అరెస్ట్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అనాథనని చెబుతూ పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పలువురిని మోసం చేసినట్లు తెలుస్తుండగా, ఆ మహిళ వలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు యువకుడు చిక్కుకుని మోసపోయాడు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన సుహాసినిని పోలీసులు తిరుపతిలో అలిపిరి వద్ద అరెస్టు చేయగా, మణుగూరులో కూడా కేసు నమోదైనందున శుక్రవారం ఇక్కడకు తీసుకొచ్చా రు. వివరాలను మణుగూరు ఏఎస్పీ ఎం.శబ రీష్ వెల్లడించారు. తొలుత మేనమామతో వివాహం ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పాల సుహాసినికి తొలుత మేనమామతో వివాహం జరిగింది. ఆపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీకే – 1 సెంటర్లో నివాసం ఉంటున్న దేవరకొండ వినయ్‌కు తాను అనాథనంటూ పరిచయం చేసుకుంది. దీంతో ఆయన 2019 మే 23న స్థానిక కిన్నెర కళ్యాణ మండపంలో సుహాసినిని వివాహం చేసుకున్నాడు. కొంత కాలం మంచిగానే ఉన్న ఆమె రూ.1.5లక్షల నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్లిపోయింది. మోసపోయినట్లు గుర్తించిన వినయ్ గతనెల 16న మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా, తిరుపతిలో ప్రైవేట్ ఉద్యోగం చేసే సునీల్కుమార్తోనూ సుహాసిని ఇలాగే పరిచయం పెంచుకోగా, ఆయన సైతం తల్లిదండ్రుల్ని ఒప్పించి సుహాసినిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో అత్తమామలు ఆమెకు 10 తులాల బంగారం పెట్టారు. వివాహమైన కొద్దిరోజులకు తన చిన్నప్పటి నుంచి ఆదరించిన వారి ఆరోగ్య అవసరాలకు అవసరమని చెప్పి భర్త, అత్తమామల నుంచి రూ.6 లక్షలు తీసుకుంది. కొన్నాళ్లకు భర్త ఆమెను నిలదీయగా.. మరుసటి రోజే ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలా పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన సునీల్ ఫిర్యాదుతో అలిపిరిలో ఆమెను అరెస్టు చేయగా, మణుగూరులో కేసు ఉండడంతో ఇక్కడకు తీసుకొచ్చారు. -
ప్రియురాలు ఆగ్రహించింది..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం(కారేపల్లి): పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మాట తప్పి మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన తన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన మండల పరిధిలోని భాగ్యనగర్‌తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన కుంజా హేమలత ప్రస్తుతం పినపాక మండలం ఐలాపురం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తోంది. చదవండి: (స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై) ఇకారేపల్లి మండలం భాగ్యనగర్‌తండా గ్రామానికి చెందిన గుగులోతు అశోక్ గుండాల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వీరిద్దరూ భద్రాచలంలోని ఐటీడీఏ బీఈడీ కళాశాలలో చదువుకున్నారు. ఆ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను లొంగదీసుకున్న అశోక్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని, కుటుంబ సభ్యులతో హేమలత ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. చదవండి: (నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య) -
రైతుకు,బ్యాంక్ మేనేజర్‌కు మధ్య వాగ్వాదం
-
జిల్లాలో కరోనా కేసులు నిల్
సాక్షి, (కొత్తగూడెం): డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రజలకు ప్రభుత్వం సూచించిన మెడిసిన్ ఇవ్వకూడదని కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మెడికల్ షాపులపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దగ్గు, జ్వరం, జలుబుతో మెడికల్ షాప్‌నకు వచ్చే ప్రజలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించొద్దని తెలిపారు. వీటి వలన స్వల్పంగా ఉపశమనం ఉండడంతో కరోనా పరీక్షలకు కొందరు ముందుకు రావడం లేదని, అందుకే ప్రభుత్వం మెడికల్ షాపులపై ఆంక్షలు విధించినట్లు వివరించారు. దీంతో జలుబు, జ్వరం ఉన్నా వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన తుపాను సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని పేర్కొన్నారు. ధాన్యం, మొక్కజొన్న రాశులు తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధికారులు కూడా అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. -
ఠాణాలో మేక బందీ!
అశ్వారావుపేట రూరల్: ఈ ఫొటోలో కనిపిస్తున్న మేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడేనికి చెందిన ఓ రైతు చేనులో మేతకు వెళ్లింది. ఆ సమయంలో పంట దెబ్బతినడంతో బాధిత రైతు మేకను పట్టుకొని నేరుగా స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు మేకను స్టేషన్ ఆవరణలో ఉన్న ఓ చెట్టుకు కట్టేశారు. రెండు రోజులుగా ఈ మేక పోలీస్‌స్టేషన్‌లో బందీగా మారిపోయింది. ఈ దృశ్యాన్ని శుక్రవారం ‘సాక్షి’ కెమెరాలో క్లిక్‌మనిపించింది. దీనిపై ఏఎస్ఐ ఎంవీ.సత్యనారాయణను వివరణ కోరగా.. తాను విధుల్లో లేని సమయంలో ఓ రైతు స్టేషన్‌కు తీసుకొచ్చి, తన చేనును ధ్వంసం చేస్తోందని చెప్పి వెళ్లిపోయాడన్నారు. -
సరోగసీ.. అథోగతి.
సాక్షి, బూర్గంపాడు(ఖమ్మం): అద్దె గర్భాల కోసం అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో సరోగసి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొందరు దళారులు అమాయక పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక అమానవీయ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొందరు డబ్బు కోసం సరోగసికి ఒప్పుకుంటుంటే.. మరికొందరు భర్త, కుటుంబసభ్యుల ఒత్తిళ్లు, బెదిరింపులకు తలొగ్గుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలలో సరోగసీ వ్యవహారం అక్కడక్కడా వెలుగుచూస్తోంది. గత రెండేళ్లుగా చర్ల, పినపాక, కరకగూడెం, బూర్గంపాడు, టేకులపల్లి, దుమ్ముగూడెం మండలాల్లో ఇలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి. అమాయక గిరిజన మహిళలే లక్ష్యంగా ఈ వ్యవహారం నడుపుతున్నారు. పేదలకు లక్షల రూపాయలు ఆశ చూపి వారిని పావులుగా వాడుకుంటున్నారు. డబ్బు కోసం కుటుంబసభ్యుల ఒత్తిళ్లు కూడా మహిళలపై తీవ్రంగా ఉంటున్నాయి. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా కొనసాగిన ఈ దందా ఇప్పుడు సూర్యాపేట, భువనగిరి తదితర ప్రాంతాలకు కూడా విస్తరించింది. భువనగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సరోగసీ కోసం సుమారు 100 మంది మహిళలను గుట్టుగా ఉంచినట్లు అక్కడి నుంచి బయటకు వచ్చిన ఓ మహిళ తెలిపింది. చిన్న వయసులో వివాహాలు జరిగి పిల్లలు పుట్టిన మహిళలను సరోగసీకి ఎంపిక చేసుకుంటున్నారు. వారికి తొలుత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత సరోగసీకి బలవంతంగా ఒప్పిస్తున్నారు. అయితే ఇది వికటించి కొందరు మహిళలు అనారోగ్యానికి గురైన ఘటనలు కూడా ఉన్నాయి. అమాయక పేద గిరిజన మహిళలతో అయిష్టంగా జరిపిస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు. భర్త వేధింపులు తాళలేక.. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన రాణికి బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ భూక్యా రమేష్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, రెండుసార్లూ ఆపరేషన్ జరిగింది. కొద్ది రోజుల తర్వాత రమేష్ చెడు వ్యసనాలకు బానిసై డబ్బు కోసం రాణిని వేధించేవాడు. కొత్తగూడెంలో పరిచయమైన ఓ బ్రోకర్ సలహాతో భార్యతో సరోగíసీ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు అనుమానం రాకుండా హైదరాబాద్‌లోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేద్దామని నమ్మించి తీసుకెళ్లాడు. పిల్లలను తన తల్లి వద్ద ఉంచారు. నెల తర్వాత భువనగిరికి మకాం మార్చాడు. అక్కడ రాణిని సరోగíసీకి ఒప్పించేందుకు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె వినకపోవడంతో పిల్లలను చంపుతానని బెదిరించాడు. రాణి అత్త, ఆడపడుచు కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయినా ససేమిరా అనడంతో ఆమె తల్లిదండ్రులను కూడా చంపుతామని బెదిరించాడు. దీంతో తీవ్రంగా మానసిన వేదనకు గురైన రాణికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించి భువనగిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి సరోగసి చేశారు. కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం ఇంజెక్షన్లు, మందులు వేయడంతో రాణి ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో తాను గర్భం మోయలేనంటూ గత ఆదివారం ఆస్పత్రిలో గొడవ చేసింది. దీంతో మంగళవారం ఆమెకు అబార్షన్ చేయగా, పుట్టింటి వారి సహకారంతో గత బుధవారం కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌లో భర్త, అత్త, ఆడపడుచుపై ఫిర్యాదు చేసింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. సరోగసీపై కేసు నమోదు కొత్తగూడెం రూరల్: బలవంతంగా ఓ వివాహితకు అద్దె గర్భం చేయించిన ఘటనపై కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైనట్లు ఎస్సై నరేష్ తెలిపారు. బాధితురాలు రాణి ఫిర్యాదు మేరకు ఆమె భర్త రమేష్, అత్త భూళి, ఆడపడుచు రాధికపై కేసు నమోదు చేశామని చెప్పారు. రాణిని భువనగిరిలోని నవ్య నర్సింగ్ హోమ్‌కు తీసుకువెళ్లి, వివిధ పరీక్షలు నిర్వహించి ఆమెకు తెలియకుండానే గర్భం ఎక్కించారని, రాణి వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో ఇటీవల మరొకరి ఫోన్తొ ఆమె తల్లి, సోదరుడికి సమాచారం ఇచ్చిందని తెలిపారు. దీంతో తల్లి, సోదరుడు రాణి వద్దకు చేరుకుని అదే నర్సింగ్ హోమ్‌లో అబార్షన్ చేయించారని, వారి ఫిర్యాదు మేరకు పై ముగ్గురిపై కేసు నమోదు చేశామని వివరించారు. -
స్వస్థలానికి బాలకార్మికులు..
సాక్షి, ఖమ్మం: జీఆర్పీ, ఆర్పీఎఫ్, చైల్డ్‌లైన్ శాఖలు గుర్తించిన బాలకార్మికులు వారి స్వస్థలానికి బయలుదేరారు. చిన్నారులను తీసుకుని ఆదివారం అధికారులు అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి భోపాల్‌కు బయలుదేరారు. అక్కడి నుంచి వారి స్వస్థలం బాలాఘాట్‌కు తీసుకెళ్లనున్నారు. ఈ నెల 17న 29 మంది బాలకార్మికులను నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా జీఆర్పీ, ఆర్పీఎఫ్, చైల్డ్‌లైన్‌వారు గుర్తించి, బాలకార్మికులను చైల్డ్‌లైన్ సంరక్షణలో ఉంచిన విషయం విదితమే. ఈ సందర్భగా చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయమూర్తి వినోద్‌కుమార్, ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఆర్పీఎఫ్ సీఐ మధుసూదన్‌లు చొరవ తీసుకుని బాలలను సురక్షితంగా భోపాల్ పంపించేందుకు పలువురి సిబ్బందిని ఎస్కార్ట్‌గా ఏర్పాటు చేశారని వివరించారు. వీరిలో ఏఆర్ పోలీస్‌లు 13 మంది, ఆర్పీఎఫ్ నుంచి ఒకరు, జీఆర్పీ నుంచి ఇద్దరు, చైల్డ్‌లైన్ నుంచి ఒకరు, ఐసీడీఎస్ నుంచి ఒకరు ఎస్కార్ట్‌గా వెళ్లినట్లు పేర్కొన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వినోద్‌కుమార్ దగ్గరుండి రైలు ఎక్కించి పిల్లలకు వీడ్కోలు పలికారు. బాలల రక్షణ అధికారి విష్ణునందన, చైల్డ్‌లైన్ బాధ్యులు శ్రీనివాస్, కోర్టులైజన్ ఆఫీసర్ భాస్కర్‌రావు, సీడీపీఓ బాలత్రిపురసుందరి, భారతి, హరిప్రసాద్, సోని, జీఆర్పీ సిబ్బంది బాలబాలికలకు అన్ని సదుపాయాలు ఏర్పాటుచేసి భోపాల్ పంపించారు. -
ఇక టీడీపీకి రాజీ‘నామా’నే!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీని వీడేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్న మాజీ ఎంపీ, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు రాజకీయ గమ్యం ఎటువైపన్న అంశంపై మాత్రం ఇంకా అనిశ్చితే కొనసాగుతోంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున పోటీచేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఉభయ జిల్లాల్లో పోటీ చేసిన మూడు స్థానాల్లో రెండు గెలుపొందగా..నామా మాత్రమే ఆ ఎన్నికల్లో ఓడారు. ఇక కాంగ్రెస్ సైతం తాను పోటీచేసిన ఆరు స్థానాల్లో విజయం సాధించడంతో జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాకూటమి మెజారిటీ స్థానాలను గెలుపొందినట్లయింది. శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో సంభవిస్తున్నపెను మార్పులకు అనుగుణంగా తన రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశించుకోవాలని భావించిన నామా గత కొంతకాలంగా ప్రధాన రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తున్నారని, టీఆర్ఎస్లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు దృష్టి సారించారని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ఆయా పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే ఘడియ ముంచుకొస్తుండటంతో రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై నామా నాగేశ్వరరావు శుక్రవారం టీడీపీలోని ముఖ్య నేతలు, అనుచరులతో హైదరాబాద్‌లోని మధుకాన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి..సుదీర్ఘ సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ సమావేశానికి టీడీపీకి చెందిన ముఖ్యనేతలతోపాటు మరికొందరు నాయకులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే అశ్వారావుపేట టీడీపీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావును ఈ సమావేశానికి ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకునే ఉద్దేశం లేనప్పుడు పార్టీ మారే సమావేశాలకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్న భావనతో ఆయన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సమావేశంలో భిన్నాభిప్రాయాలు.. నామా కాంగ్రెస్‌లో చేరినా టీడీపీతో పొత్తు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా పార్టీ మారడం వల్ల ఉపయోగం ఏముంటుందన్న భావనతో మరికొందరు సీనియర్ నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) హాజరు కాలేదు. అలాగే మద్దినేని బేబి స్వర్ణకుమారి వంటి సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొనలేదు. హాజరైన వారి మధ్య మాత్రం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నామా ఏ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు.. ఇందులో పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరడానికి సానుకూల పరిస్థితులు లేవన్న అంశంపై సైతం సమావేశంలో చర్చ జరగ్గా.. అలాంటిదేమీ లేదని ఆ పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని, బయట జరుగుతున్న ప్రచారాలకు, అంతర్గత పరిస్థితికి అత్యంత వ్యత్యాసం ఉందని నామా సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ వైపు చూడటం వల్ల ప్రయోజనం ఏమిటని కొందరు నేతలు వాదించగా.. కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆదరించినా.. ఖమ్మం వంటి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గెలుపు సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరాలనుకున్న సమయంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీకి మూడు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉన్నారని, టీడీపీకి రెండు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉన్నారని, ఏడు నియోజకవర్గాల్లో.. ఐదు నియోజకవర్గాల్లో బలంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీచేయడం ఒక ఎత్తయితే.. రాష్ట్రంలో సంభవిస్తున్న రాజకీయ పరిణామాల దరిమిలా ఆ పార్టీ శాసనసభ్యులు ఇద్దరు, టీడీపీ శాసనసభ్యులు ఒకరు టీఆర్ఎస్లో చేరడానికి నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్సా..? కాంగ్రెస్సా..? టీఆర్ఎస్ టికెట్ ఖరారు చేసేలోపే రాజకీయంగా నిర్ణయం తీసుకోవడం మేలని, దీనిపై కార్యకర్తలకు, అనుచరులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి సమయం సైతం అవసరం ఉన్నందున త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం సముచితమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరే అంశంపై పలు కోణాల్లో చర్చ జరిగినా..ఒక కొలిక్కి రాలేదు. టీడీపీలో సీనియర్ నాయకులు పలువురు సమావేశానికి హాజరు కాలేకపోవడంతోపాటు మరికొంతమంది నేతలతో ఈ అంశంపై చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావించిన నామా శనివారం ఖమ్మం చేరుకుని మరికొందరు ముఖ్యనేతలతో తన రాజకీయ భవితవ్యంపై తీసుకోవాల్సిన నిర్ణయంపై చర్చించాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీలోని ముఖ్యనేతలకు నామా శనివారం ఖమ్మం వస్తున్నారన్న సమాచారాన్ని అందించారు. పార్టీ కార్యకర్తల నిర్ణయాన్ని అనుసరించి ఆయన రాజకీయ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
ఖమ్మంకు 25న సీఎం కేసీఆర్ రాక?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఈనెల 25, 26 తేదీల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పార్టీ నేతలు ప్రచార సభలకు ఏయే ప్రాంతాలను ఎంపిక చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. తొలుత క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించిన టీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈనెల 16వ తేదీన ఖమ్మంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో జరగాల్సిన ఎన్నికల సన్నాహక సమావేశాన్ని సైతం రద్దు చేసుకుంది. ఎన్నికలకు సమయం సమీపించడం.. ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడం.. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తించిన పార్టీ నేతలు 16న జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అదేరోజు ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం సైతం రద్దయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు కేటీఆర్ సభ ఉపయోగపడుతుందని నేతలు భావించారు. అయితే ఎన్నికల సమయం ముంచుకురావడంతో ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలపై టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 25, 26 తేదీల్లో సీఎం కేసీఆర్ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఉందని సమాచారం. జిల్లా కేంద్రమైన ఖమ్మంతోపాటు ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఉన్న కొత్తగూడెం లేదా అశ్వారావుపేటలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు గల అవకాశాలను పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వేడెక్కిన రాజకీయ వాతావరణం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయా రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల్లో తమ గెలుపు గుర్రాలను ఎంచుకునే పనిలో నిమగ్నం కాగా.. ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు ఎంపీగా ఖమ్మం లోక్‌సభ నుంచి బరిలోకి దిగేందుకు పార్టీల నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందేందుకు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈనెల 16న కేటీఆర్ ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించి.. పెవిలియన్ గ్రౌండ్లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తొలుత కార్యక్రమం ఖరారైంది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే బహిరంగ సభలు, సన్నాహక సభలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ప్రచారానికి కలిగే ఆటంకాలను పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతోపాటు అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే నామినేషన్లు స్వీకరించే తేదీ నాటికి ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉపసంహరణ తర్వాత ఎన్నికల ప్రచారానికి కేవలం 12 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ సమయాన్ని క్షేత్రస్థాయి ప్రచారం కోసం వెచ్చించాలని పార్టీ ముఖ్య నేతల నుంచి జిల్లా నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తన పర్యటనకు ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ పాల్గొనాల్సిన ఖమ్మం లోక్‌సభ ఎన్నికల సన్నాహక సభకు పార్టీ వర్గాలు ఇప్పటికే పలు ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒకరోజు ముందు వరకు సైతం కేటీఆర్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్య నేతలు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్ రావడం, ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడం వంటి కారణాలతో కేటీఆర్ ఎన్నికల సన్నాహక సభ మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాల్లో రద్దయినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
అందరికీ పాస్ పుస్తకాలు అందేలా కృషి
సాక్షి, దమ్మపేట: ఏళ్లతరబడి సాగులో ఉన్న భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ విషయంలో జరుగుతున్న జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అర్హులైన రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దమ్మపేటలోని టీడీపీ మండల కన్వీనర్ నాయుడు చెన్నారావు ఇంటికి గురువారం వచ్చిన ఎమ్మెల్యేను వచ్చారు. దమ్మపేట, మందలపల్లి రైతులు కొందరు రైతులు కలిశారు. రైతులు గడ్డిపాటి సత్యం, అడపా సుబ్బారావు, ఎంఏ కబీర్, గడ్డిపాటి బాబు తదితరులు మాట్లాడుతూ... భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని అన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ, ఏళ్లతరబడి పట్టాదార్ పాçస్ పుస్తకాలు పంపిణీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల కోసం ఇంట్లో అందరం తిరుగుతున్నామని అన్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగా రైతుబంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు అందడం లేదని, భూమి క్రయ–విక్రయాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూలో ఏమైనా పొరపాట్లుంటే సరిచేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో మండలంలో అన్ని సర్వే నంబర్లను అధికారులు ప్రక్షాళన చేయలేదని ఫిర్యాదు చేశారు దమ్మపేట శివారు నల్లకుంటలోని 273/1, జమేదార్ బంజర్‌లోని 884/1 సర్వే నంబర్లతోపాటు పట్వారీగూడెం, నాగుపల్లి రెవెన్యూ గ్రామాల్లోని కొన్ని సర్వే నంబర్లోని భూ రికార్డులను ప్రక్షాళన చేయలేదని వివరించారు. ఈ కారణంగా ఆయా నంబర్లలోని రైతులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు అందలేదని చెప్పారు.దీనికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించారు. ఈ సమస్యలు నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. వీటి పరిష్కారంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘రెవెన్యూ రికార్డుల్లో లోపాలు, అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్ పుసస్తకాలు, పోడుదారులకు పట్టాల పంపిణీపై ఆదివాసీ ఎమ్మెల్యేలం ఐదుగురం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఈ సమస్యను వివరించాం. సమగ్ర సర్వే చేసి, రైతులకు న్యాయం చేద్దామని అన్నారు. రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో రెండు నెలల్లో ఈ సమస్యలు పరిష్కారమవుతాయి’’ అని చెప్పారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ అత్తులూరి వెంకటరామారావు, రైతులు– నాయకులు ఎండీ వలీపాష, ఎండీ అబ్దుల్ జిన్నా, బొల్లిన రవికుమార్, గన్నమనేని విజయ్‌కుమార్, చెప్పుల జగదీష్, ఉయ్యాల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
ఐదడుగుల దూరంలో ఆగిన ముప్పు!
బూర్గంపాడు: ఐదు అడుగుల దూరంలోనే పెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి వాగు సమీపంలో 30 అడుగుల లోతుల్లోకి పడిపోయింది. బస్సు చెట్టుపైకి దూసుకుపోవడం.. కొంతమేర వేగం తగ్గడంతో పెను ప్రమా దం తప్పింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక–నాగినేనిప్రోలు గ్రామాల మధ్యన ఉన్న పెదవాగు వద్ద చోటుచేసుకుంది. కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు భద్రాచలం నుంచి విజయవాడకు 35 మంది ప్రయాణికులతో వెళ్తోంది. పెదవాగు బ్రిడ్జి వద్ద ఉన్న గోతిని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బోల్తా పడే సమయంలో అప్రోచ్ రోడ్డుకు దిగువన చెట్టుపైకి దూసుకుపోయింది. దీంతో కొంతమేర బస్సు వేగం తగ్గి పెదవాగు ఒడ్డున పడిపోయింది. ఐదు అడుగుల దూరంలోనే పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదంలో 15 మం దికి తీవ్రంగా గాయాలయ్యాయి. సత్తుపల్లికి చెందిన వృద్ధురాలు రాజేశ్వరి, భద్రాచలానికి చెందిన హనుమంతరావు, వీరునాయక్, ముప్పు ప్రసాద్, రాజమండ్రికి చెందిన నాగేంద్రబాబు, సావిత్రి, భూపాలపల్లికి చెందిన రాజమండ్రి వెంకటేశ్వర్లు, పినపాక పట్టీనగర్‌కు చెందిన కొట్టె లక్ష్మి, భిక్షం దంపతులు, సారపాకకు చెందిన పర్వీన్, కౌనిన్, రాజ్యలక్ష్మి, కండక్టర్ కె.వెంకటేశ్వర్లు, తమిళనాడుకు చెందిన చెన్నప్ప, కొత్తగూడేనికి చెందిన మల్లికార్జున్ తీవ్రం గా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో భద్రాచలం సివిల్ ఆస్పత్రికి తరలించారు. రెడ్డిపాలెం, సారపాక వాసులు ప్రయాణికులను రక్షించేం దుకు జోరువానలో కూడా శ్రమించారు. క్షతగాత్రులను మోసుకుంటూ రోడ్డుపైకి తీసుకొచ్చారు. అప్రోచ్ రోడ్డు దిగువన ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. పెదవాగు బ్రిడ్జిపై పడిన గొయ్యిని అధికారులు పూడ్పించకుండా నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. -
టీఆర్ఎస్లో వర్గ పోరాటం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరాటం భగ్గుమంది. గుండాల మండలం టీఆర్ఎస్లో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో గుండాల టీఆర్ఎస్ మండల కార్యదర్శి ఖదీర్‌పై మండల అధ్యక్షుడు భాస్కర్ శనివారం దాడిచేశాడు. ఖదీర్‌పై భాస్కర్ కర్రలతో దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఖదీర్ గుండాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వానరకం
దమ్మపేట : మండల కేంద్రమైన దమ్మపేటలో ప్రజలు కోతులతో వేగలేకపోతున్నారు. అవి ఎప్పడు ఎవరి మీద దాడి చేస్తాయో..ఏ ఇంట్లో దూరి సామగ్రి ఎత్తుకుపోతాయో తెలియక జనం భయపడుతున్నారు. దమ్మపేటలో కొంత కాలంగా కోతులు విచ్చిల విడిగా తిరుగుతున్నాయి. ఇళ్ల తలుపులు తెరచి ఉంటే చాలు ఇంట్లోకి జొరబడి సామగ్రిని చిందరవందర చేయడమే కాకుండా ఎత్తుకుపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్ల పక్కన కిరణా షాపులు, పండ్ల దుకాణాల్లో అయితే యజమానులున్నా లోనికి దూరిపోయి చేతికందిన వాటిని తీసుకుపోతున్నాయి. రోడ్లపై నడిచే వ్యక్తుల చేతుల్లో కవర్లు కనిపిస్తే వారి నుంచి కవర్లును లాక్కెళ్తున్నాయి. దీంతో కూరగాయలు, ఇతర సామగ్రిని చేతపట్టుకోవాలంటే జనం జంకిపోతున్నారు. ఉదయం, సాయంత్రం అని సమయం లేకుండా ఇళ్ల పైకప్పులపై చేరి పెంకులను తొలగిస్తూ నానా భీవత్సం సృష్టిస్తున్నాయి. వాటి బెడద నుంచి తట్టుకోలేక ప్రజలు ఇళ్ల వద్ద కర్రలతో కాపలా కాస్తున్నారు. ఇటీవల మల్కారం రోడ్డులో నివాసముంటున్న ఒక వ్యక్తిపై కోతులు పడి విపరీతంగా కరిశాయి. దమ్మపేటలో కోతుల సమస్య పరిష్కరించాలని పట్టణ ప్రజలు పంచాయతీ అధికారులను, పాలకవర్గాన్ని కోరుతున్నారు. దమ్మపేటలో కోతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇంటి ఆవరణలో కూరలు తయారు చేయడానికి సిద్ధం చేసిన కూరగాయలను ఎత్తుకెళ్తున్నాయని అంటున్నారు. వాటితో పాటు బయట ఆరవేసిన దుస్తులను ఎత్తుకెళుతు జనాలను భయబ్రాంతులను చేస్తున్నాయి. దమ్మపేటలో కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వాటి వల్ల ప్రజలు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులకు గురువుతున్నారు. గతంలో ఒకసారి దమ్మపేటలో కోతులను పట్టి దూరంగా వదిలారు. కొంతకాలం కోతుల సమస్యలేదు. కొద్దికాలంగా సమస్యల మళ్లీ పునరావృతం అయిందని, కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఏజెన్సీ భూముల్లో గిరిజనేతరుల పాగా
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షి, భద్రాద్రి : జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం మేలపల్లి అటవీప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. చంద్ర పుల్లారెడ్డి వర్గీయులు, పోలీసుల మధ్య ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మరోపక్క గ్రేహౌండ్స్ దళాల కాల్పుల్లో మరో మావోయిస్టు కూడా మృతి చెందాడు. చనిపోయిన వారిని ఈసం నరేష్, తిరుకులూరి మధు, భూక్య నర్సింహా, మేకల సమ్మయ్య, సుభాష్, బోయిని ఓంప్రకాశ్, రామస్వామి, రషీద్ గా గుర్తించారు. ఘటనలో 2 ఎస్ఎల్ఆర్, రెండు రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. #UPDATE: One more member of a Maoist group gunned down by GreyHounds in an encounter in Bhadradri Kothagudem, 7 members had earlier been killed by the Special Force in the encounter. — ANI (@ANI) December 14, 2017 -
అభివృద్ధి కోసమే కొత్త జిల్లాలు
⇒ ‘మన ప్రగతి యాత్ర’లో ఎమ్మెల్యే జలగం వెంకటరావు కొత్తగూడెం : సుపరిపాలన, అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేర్కొన్నారు. పాల్వంచలో ఏర్పాటు చేసిన సభలో మంగళవారం జలగం మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘మన ప్రగతి యాత్ర’ పేరుతో ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. తొలుత కొత్తగూడెం శ్రీవిజయ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తొలిరోజు యాత్ర 17 కిలోమీటర్లు కొనసాగింది. పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద బస చేశారు. కొత్తగూడెం జిల్లా ఏర్పాటు ద్వారా పారిశ్రామికంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.