ఠాణాలో మేక బందీ! | Police Arrest Goat in Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

ఠాణాలో మేక బందీ!

Published Sat, Dec 7 2019 7:48 AM | Last Updated on Sat, Dec 7 2019 8:24 AM

Police Arrest Goat in Bhadradri Kothagudem - Sakshi

అశ్వారావుపేట రూరల్‌: ఈ ఫొటోలో కనిపిస్తున్న మేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడేనికి చెందిన ఓ రైతు చేనులో మేతకు వెళ్లింది. ఆ సమయంలో పంట దెబ్బతినడంతో బాధిత రైతు మేకను పట్టుకొని నేరుగా స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు మేకను స్టేషన్‌ ఆవరణలో ఉన్న ఓ చెట్టుకు కట్టేశారు. రెండు రోజులుగా ఈ మేక పోలీస్‌స్టేషన్‌లో బందీగా మారిపోయింది. ఈ దృశ్యాన్ని శుక్రవారం ‘సాక్షి’ కెమెరాలో క్లిక్‌మనిపించింది. దీనిపై ఏఎస్‌ఐ ఎంవీ.సత్యనారాయణను వివరణ కోరగా.. తాను విధుల్లో లేని సమయంలో ఓ రైతు స్టేషన్‌కు తీసుకొచ్చి, తన చేనును ధ్వంసం చేస్తోందని చెప్పి వెళ్లిపోయాడన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement