ధర్నాలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
టేకులపల్లి: గిరిజన, ఆదివాసీలు నివసిస్తున్న ఏజెన్సీ ప్రాంతాలు దేశం, రాష్ట్రంలో భాగమా.. లేక పక్క దేశాల్లో భాగమా అని అర్థం కాని పరిస్థితి నెలకొందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంతో పాటు కాలనీతండా, దుబ్బతండా, ముత్యాలంపాడు, తెలుగూరు, తూర్పుగూడేల్లో కొనసాగింది.
ఈ సందర్భంగా ఆమె టేకులపల్లిలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి రైతుగోస ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా, పేదలు సాగు చేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో లాక్కుంటున్నారని ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకపోగా ఇప్పుడు దళితబంధు పేరుతో మరో మోసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment