ఇల్లెందులో గురువారం రాత్రి జరిగిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ షర్మిల
ఇల్లెందు: పోడు భూములకు పట్టాలు ఇస్తా మని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా ఓట్ల కోసమే తప్ప ఆచరణలో కనిపించడం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోకి గురువారం ప్రవేశించగా రొంపేడులో రైతుగోస మహా ధర్నా నిర్వహించారు. అనంతరం రాత్రి ఇల్లెందులో జరిగిన సభకు జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 3.3 లక్షల ఎకరాలకు అటవీ హక్కుల పట్టాలు ఇచ్చారని, ఆయన జీవించి ఉంటే 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చేవారని తెలి పారు. అయితే, ప్రతీ ఊరికి వచ్చి కుర్చీ వేసుకుని మరీ పట్టాలు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు.. కుర్చీలు దొరకడం లే దా అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తాననే మాట నిలబెట్టుకోలేని పక్షంలో పాలన నుంచి వైదొలగాలని సూచించారు. ప్రశ్నించే ప్రతిపక్షం లేక కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాటలా మారిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment