ములకలపల్లి: ఆదివాసీ, గిరిజనులు సాగు చేసుకుం టున్న పోడు భూములకు పట్టాలి స్తామని గద్దెనెక్కిన సీఎం కేసీఆర్, కనీసం ఒక్క ఎకరాకైనా హక్కు పత్రాలు ఇచ్చారా అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కొనసాగింది. మామిళ్ల గూడెంలో రైతుగోస దీక్షలో పాల్గొన్న షర్మిల మాట్లా డుతూ... ఏజెన్సీలో పోడు పట్టాలే ప్రధాన సమస్యగా ఉందని, దివంగత వైఎస్సార్ అప్పట్లోనే 3లక్షల ఎకరాలకు పైగా భూములకు హక్కుపత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు.
ఆ తర్వాత నేతలు, ప్రస్తు తం సీఎం కేసీఆర్.. ఒక్క ఎకరానికి కూడా పట్టాలివ్వకపోవడం దారుణమన్నారు. పైగా భూముల నుంచి సాగుదా రులను గెంటేస్తూ, మహిళలు, పిల్లలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు, తాలు కొర్రీలు లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల బాధ తీరాలన్నా, పోడు సాగుదారులకు పట్టాలు దక్కాలన్నా వైఎస్సార్ టీపీని ఆశీర్వదించాలని ఆమె కోరారు. యాత్రలో గిరిజనులు సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాల నడుమ షర్మిలకు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment