దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో బురదలో కూరుకుపోయిన మంత్రి అజయ్‌కుమార్ కారును తోస్తున్న ప్రజలు, సెక్యూరిటీ సిబ్బంది
సాక్షి, దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా దుమ్ముగూడెం మండలం నర్సాపురానికి వచ్చిన రాష్ట్ర మంతి పువ్వాడ అజయ్‌కుమార్ అక్కడి రోడ్లతో ప్రజలు పడే బాధలను స్వయంగా అనుభవించారు. శనివారం మంత్రి పర్యటనకు వచ్చే సమయానికే నర్సాపురంలో వర్షం కురుస్తోంది. వర్షంలోనే పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అజయ్‌కుమార్, రైతువేదిక సమావేశంలో మాట్లాడి తిరుగు పయనమయ్యారు. అయితే మంత్రి ఎక్కిన కారు చిన్న వర్షం కారణంగా ఏర్పడిన బురదలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు, సెక్యూరిటీ అధికారులు కారును తోసి బయటకు తీశారు. ఆ తర్వాత మంత్రి కొత్తగూడెం పర్యటనకు వెళ్లారు.
చదవండి: RS Praveen kumar: సీఎంగా కేసీఆర్ ఏడేళ్లు ఏం చేశారు..?
Comments
Please login to add a commentAdd a comment