rains in telangana
-
తెలంగాణలో మరో రెండు రోజులు వానలే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, హన్మకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం వాతావరశాఖ తెలిపింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశాలున్నాయని.. 26 నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి తుఫాను చేరుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించాయి. -
3 రోజుల్లో శ్రీశైలం ఫుల్!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, దాని ఉప నదుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమ యానికి జలాశయంలో నీటి నిల్వ 134.95 టీఎంసీలకు చేరింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షా లు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో స్థిరంగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లతోపాటు తుంగభద్ర డ్యామ్ నుంచీ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి 1.75 లక్షల క్యూసెక్కులు, తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1.60 లక్షల క్యూసెక్కులు కలిపి.. మూడు లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో వేగంగా నిండుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండేందుకు ఇంకా 80 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి స్థిరంగా వరద వస్తుండటంతో మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండి, గేట్లెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 31వేలకు పైగా క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మరో 2,400 క్యూసెక్కులను మళ్లిస్తున్నారు. భద్రాచలం వద్ద తగ్గిన వరద ఎగువన వానలు నిలిచిపోయి, నీటి చేరిక తగ్గిపోవడంతో గోదావరి శాంతించింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి భద్రాచలం వద్ద ప్రవాహం 15,96,899 క్యూసెక్కులకు, నీటి మట్టం 56.1 అడుగులకు తగ్గింది. వరద 53 అడుగులకన్నా తగ్గే వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. ఎగువన వర్షాలు లేకపోతే మరో మూడు రోజుల్లో వరద ఉధృతి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గోదావరిలో ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 96 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎల్లంపల్లికి ప్రవాహం 69,487 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాణహిత, ఇంద్రావతి ఇతర నదుల్లో ఇంకా ప్రవాహం ఉండటంతో.. లక్ష్మి బ్యారేజీకి 6,06,240 క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీకి 11,06,400 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజీకి 15,48,608 క్యూసెక్కుల భారీ వరద కొనసాగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి వరద కాల్వ ద్వారా 15 వేల క్యూసెక్కులు, కాకతీయ కాల్వ ద్వారా 3,500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర అనటం ఈ శతాబ్దపు జోక్: బండి సంజయ్
ఢిల్లీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్ అంటూ దుయ్యబట్టారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. 10వేల ఇండ్లతో కాలనీ, గోదావరిపై కరకట్ట నిర్మాణం పేరుతో మళ్లీ ప్రజలను వంచించే హామీలు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ చేసిన తప్పిదాలవల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిందన్నారు. వరదలపై ప్రజలను దారి మళ్లించేందుకే విదేశీ కుట్ర అంటూ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వారం రోజులుగా వరదలతో జనం అల్లాడుతుంటే పట్టించుకోని సీఎం.. ప్రాంతీయ పార్టీల నేతలతో రివ్యూలు చేస్తూ కేంద్రాన్ని బదనాం చేయడానికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్ అని.. ఆయన మాటలను నమ్మేదెవరు? అని ప్రశ్నించారు. కాగా, ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదని.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతిలో వరదలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతంలో కశ్మీర్, లేహ్ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు వార్తలొచ్చాయన్నారు. ఇతర దేశాలు క్లౌడ్ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేస్తున్నాయనే చర్చ ఉందన్నారు. గోదావరి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని వరద ముంపు ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇదీ చూడండి: భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అనుమానాలు.. క్లౌడ్ బరస్ట్ కుట్ర కోణం దాగి ఉందా? -
500 కోట్లు వర్షార్పణం.. 10 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వారం రోజులకుపైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో భారీ స్థాయిలో సాగు దెబ్బతింది. వేసిన విత్తనాలు కుళ్లిపోవడం, మొలకెత్తినచోట మొక్కలు కొట్టుకుపోవడం, దెబ్బతినడంతో.. సుమారు 10 లక్షల ఎకరాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనితో రైతుల పెట్టుబడి కష్టం వర్షార్పణమైంది. అనధికార అంచనా ప్రకారం రైతులకు సుమారు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వానలు బాగా పడతాయని..: ఈ ఏడాది వర్షాలు బాగుంటాయన్న వాతావరణశాఖ అంచనాల మేరకు 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు కూడా జూన్ రెండో వారం నుంచే సాగు మొదలుపెట్టారు. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారమే.. ఇప్పటివరకు 53.79 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగయ్యాయి. పంటలన్నీ ప్రాథమిక దశలోనే ఉండటంతో భారీ వర్షాలకు, వరదలకు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పత్తి చేలలో నీరు నిలవడంతో విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. మొలకస్థాయిలో ఉన్న పత్తి మునిగి దెబ్బతింది. వరినారు కొట్టుకుపోయింది. వానలు తెరిపినిచ్చినా పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మళ్లీ పంట పెట్టుబడుల భారం మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వెంట భారీగా నష్టం: ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరికి భారీ వరద రావడంతో.. నదికి రెండు పక్కలా ఒకట్రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తడంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో పంటలపై ప్రభావం పడింది. ♦నిజామాబాద్ జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో సాగైన 1.89 వేల ఎకరాల్లో పావువంతు పంటలు మునిగిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో 65వేల ఎకరాల్లో పంటలు సాగుకాగా 60 శాతం నీట మునిగాయి. భూపాలపల్లి జిల్లాలో 1.14 లక్షల ఎకరాల్లో, ములుగు జిల్లాలో 10 వేల ఎకరాలు వరద పాలయ్యాయి. వరంగల్ జిల్లాలో సాగైన 1.31 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 1.38 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ చిత్రంలో చెరువులా కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కౌలు రైతు చౌదరి శంకరయ్య సాగు చేస్తున్న చేను. ఆయన 12 ఎకరాలు కౌలు తీసుకుని పత్తి వేయగా ప్రాణహిత వరదలు చేనును ముంచెత్తాయి. పదెకరాల మేర పూర్తిగా నీట మునిగింది. ఎకరానికి రూ.18 వేల వరకు పెట్టుబడి పెట్టానని.. అంతా వరద పాలైందని శంకరయ్య వాపోయారు. మళ్లీ విత్తనాలు వేద్దామంటే పెట్టుబడికి సొమ్ము ఎక్కడి నుంచి తేవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం -
తెలంగాణ: విద్యాసంస్థల సెలవులు పొడిగింపు
-
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, విద్యా సంస్థలు తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి. ఇక కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బుధవారం వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. కానీ, బుధవారం నుంచి కూడా మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, సెలవులను మరోసారి మూడు రోజుల వరకు పొడిగించారు. -
Telangana Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు..!
-
తెలంగాణలో భారీ వర్షాలు నీట మునిగిన కాలనీలు
-
హైదరాబాద్ లో భారీ వర్షం
-
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌లో పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని కూకట్పల్లి,బాచుపల్లి,నిజాంపేట, జీడిమెట్ల, షాపూర్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాహదారులు జలమయవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చదవండి: రాష్ట్రానికి నైరుతి.. -
బురదలో కూరుకుపోయిన మంత్రి అజయ్ కారు
సాక్షి, దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా దుమ్ముగూడెం మండలం నర్సాపురానికి వచ్చిన రాష్ట్ర మంతి పువ్వాడ అజయ్‌కుమార్ అక్కడి రోడ్లతో ప్రజలు పడే బాధలను స్వయంగా అనుభవించారు. శనివారం మంత్రి పర్యటనకు వచ్చే సమయానికే నర్సాపురంలో వర్షం కురుస్తోంది. వర్షంలోనే పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అజయ్‌కుమార్, రైతువేదిక సమావేశంలో మాట్లాడి తిరుగు పయనమయ్యారు. అయితే మంత్రి ఎక్కిన కారు చిన్న వర్షం కారణంగా ఏర్పడిన బురదలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు, సెక్యూరిటీ అధికారులు కారును తోసి బయటకు తీశారు. ఆ తర్వాత మంత్రి కొత్తగూడెం పర్యటనకు వెళ్లారు. చదవండి: RS Praveen kumar: సీఎంగా కేసీఆర్ ఏడేళ్లు ఏం చేశారు..? -
జలకళతో గోదావరి గలగల
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంతోపాటు ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వస్తున్నాయి. గోదావరి పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. బుధవారం ఎస్సారెస్పీలోకి 52 వేల క్యూసెక్కుల వరద రాగా.. గురువారం ఏకంగా 1.38 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుకాగా.. గురువారం సాయంత్రానికి 65 టీఎంసీలకు చేరింది. మరో 25 టీఎంసీలు చేరితే గేట్లు ఎత్తనున్నారు. వరద ఇదే స్థాయిలో కొనసాగితే రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నిండనుంది. ఇక గోదావరి బేసిన్‌లోని ఎల్లంపల్లి, లోయర్ మానేరు ప్రాజెక్టులకు కూడా భారీ వరద వస్తోంది. భారీ ప్రవాహాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి బ్యారేజీ (మేడిగడ్డ), సరస్వతి బ్యారేజీ (అన్నారం)లో గేట్లు ఎత్తి నీటిని వదిలిపెడుతున్నారు. సింగూరులోకి 2,245 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. నీటి నిల్వ 29.91 సామర్థ్యానికిగాను 18.43 టీఎంసీలకు చేరింది. కృష్ణా ప్రాజెక్టులకు ఇలా.. కృష్ణా బేసిన్లో స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. నారాయణపూర్ నుంచి జూరాలకు వరద వస్తోంది. ఇక్కడ ఎత్తిపోతల పథకాలు, ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో నాగార్జునసాగర్‌కు నీళ్లు వెళ్తున్నాయి. నాగార్జునసాగర్ నుంచి ఔట్‌ఫ్లో లేకున్నా.. పరీవాహకంలోని వర్షాలు, మూసీ వరద రావడంతో పులిచింతల నిండుతోంది. చిన్న ప్రాజెక్టుల్లో జలకళ ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోపాటు సరస్వతి బ్యారేజీ నుంచి వస్తున్న నీటితో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజీ నిండుగా కళకళలాడుతోంది. మొత్తం 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండిపోయింది. దాంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు నిండుకుండల్లా మారాయి. -
దంచికొడుతున్న వానలు.. పొంగుతున్న వాగులు, వంకలు
వాగులకు జలకళ కోస్గి: మండలంలో మూడు రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో పాటు ముశ్రీఫా, బిజ్జారం వాగుల్లో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంల్లో వర్షం నీరు నిలిచి వాగులకు జలకళ సంతరించుకుంది. ముశ్రీఫా వాగులో చెక్ డ్యాం నిండి పైనుంచి నీటి ప్రవాహం మొదలైంది. బిజ్జారం వాగులో సైతం చెక్ డ్యాం వరకు నీరు చేరింది. సోమవారం రాత్రి మండలంలో 4.1 సెం.మీ వర్షం నమోదు కాగా ముశ్రీఫా, బిజ్జారం చెక్ డ్యాంల నిర్మాణంతో ముంగిమళ్ల, కొత్తపల్లి వాగులు నీటి ప్రవాహంతో ఆకట్టుకున్నాయి. రెండు రోజుల ముందు నుంచే మండలంలోని ముంగిమళ్ల రామస్వామి కత్వ అలుగు పారడంతో పాటు ముశ్రీఫా చెక్ డ్యాం సైతం అలుగుపారడంతో ఈ దృశ్యాల్ని చూసేందుకు మండల ప్రజలు తరలివెళ్తున్నారు. సాక్షి, సిరికొండ(బోథ్):వాననీటిని ఒడిసి పట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. చినుకులా రాలిన నీటి బిందువులు ఏకమై వరదలా పారుతూ వాగుల ద్వారా చెక్‌డ్యామ్‌లలోకి చేరుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిరికొండ మండలంలో నిర్మించిన చెక్‌డ్యాం నిండి ఇలా మత్తడి పోస్తోంది. మత్తడి దుముకుతున్న ‘భద్రకాళి’ సాక్షి, వరంగల్: నగరంలోని చారిత్రక భద్రకాళి చెరువు పరవళ్లు తొక్కుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారింది. మంగళవారంనుంచి చెరువు మత్తడి పోస్తోంది. నగరవాసులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. కొంతమంది ఫొటోలు దిగారు. మరికొందరు ఈత కొట్టారు. మోగి తుమ్మెద వాగుకు జలకళ నంగునూరు(సిద్దిపేట): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంగునూరు మండలం గుండా పారే మోగి తుమ్మెద వాగు జలకళ సంతరించుకుంది. సోమవారం కురిసిన వర్షానికి వాగు పరివాహక ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం ఖాత గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం నిండి మత్తడి పారింది. ఘణపూర్ వద్ద నిండిన చెక్‌డ్యాం సింగూరుకు జలకళ సాక్షి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈసారి వర్షాలు బాగా కురిసి ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే యాసంగికి ఎలాంటి డోకా ఉండదని రైతులు మురిసిపోతున్నారు. కెనాల్ ద్వారా సాగుకు నీళ్లు అందుతాయనే ఆనందంలో ఉన్నారు. తుకం పోసి వరి నాట్లకు సిద్ధమయ్యారు. వర్షాలు సరిగా కురిసినా.. కురవకపోయినా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండితే చాలని పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.982 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 2,593 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, 386 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో అవుతోంది. సోమవారం కురిసిన వర్షానికి 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఏఈ మదర్ తెలిపారు. రెండు మూడు రోజులు ఇలాగే వర్షం కురిస్తే జలాశయం పూర్తి సామర్థ్యం చేరుకోవచ్చని ఇరిగేషన్ ఈఈ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. -
మరో రెండ్రోజులు వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు ఈ నెల 23న వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
ఉమ్మడి వరంగల్‌ను ముంచెత్తుతున్న వానలు
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏటూరునాగారం సబ్ డివిజన్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సమ్మక్కసారలమ్మ మండలం మేడారంలో జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. లోలేవల్ కాజేవే పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో వాహనాలు జలదిగ్భందంలో చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం పొంగి ప్రవహిస్తున్న కారణంగా ఈ రోజు కూడా పర్యాటకులను అనుమతించటం లేదని అటవీ శాఖ అధికారి డోలి. శంకర్ తెలిపారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. -
సాగు సాగేదెలా..?
మెదక్‌జోన్: కాలం కలిసిరాక సాధారణం కన్నా వర్షపాతం తక్కువ నమోదైతే ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వరుస కరువు కాటకాలతో అప్పుల పాలవుతున్న రైతులు వర్షాలకోసం ఎదురుచూస్తూ దీర్ఘకాలిక పంటలైన వరి పంటలకు బదులు తేలికపాటి పంటలైన ఆరుతడి పంటలను సాగుచేస్తే అడపాదడప వర్షాలు కురిసినా, పంటలు పండుతాయనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే అంచనాలను వేశారు. మరో వారం రోజులపాటు వర్షం కురవకుంటే అధికారులు తయారు చేసిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందేనని ఓ జిల్లాస్థాయి అధికారి తెలిపారు. గతేడాది ఇప్పటికే జూన్ 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. వర్షాకాల ప్రారంభంలోనే గత సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఈ యేడు నేటికి చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. దీంతో కనీసం దుక్కులు సైతం ఎక్కడ కూడా దున్నలేక పోయారు. ఇప్పటికే 20 రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగు అంచనా 80 వేలహెక్టార్లు.. ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురిస్తే జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లమేర సాధారణ పంటలు సాగవుతోందని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేసి అందుకు అనుగుణంగా ఎరువులు, సబ్సిడీ విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచారు. అందులో 36 వేల హెక్టార్లలో వరి పంటలు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటలు, 15 వేల హెక్టార్లలో పత్తితో పాటు 9 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంటలతో పాటు ఇతర పంటలు సాగు చేయటం జరుగుతుందని అంచనాలు వేశారు. నేటికి వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు.. జులై 31వ తేదీ వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే మొక్కజొన్న పంటకు బదులు 4200 హెక్టార్లలో కంది(పీఆర్జీ 176) తేలికపాటి రకం పంటను సాగేచేసే విధంగా అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి విత్తనాలు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. అలాగే వరిపంటకు బదులు 14,985 హెక్టార్లలో సోయాబీన్ పంటను సాగుచేసేందుకు అందుకు సంబంధించిన సోయాబిన్ విత్తనాలు సిద్ధంగా ఉంచారు. అలాగే పత్తి పంటకు బదులుగా 6085 హెక్టార్లలో నల్లరేగడి భూముల్లో వేసేందుకు కంది విత్తనాలు సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, సాములు, కొర్రలు, విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదయితే తేలికపాటి పంటలు 39000 హెక్టార్లలో పంటలును సాగుచేయాలని అందుకు సంబంధించిన విత్తనాలు సిద్ధంగా ఉంచారు. ప్రత్యామ్నాయానికి సిద్ధం.. మరో 20 రోజుల్లో సరిపడా వర్షాలు కురవకుంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు కోసం రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు ముందస్తుగానే కార్యచరణ పూర్తిచేశాం. ఇందుకు సంబంధించిన విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచాం. వర్షాలు పుష్కలంగా (సరిపడ) కురిస్తేనే ముందస్తు అంచనాల మేరకు జిల్లాలో 80 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. లేనిచో అడపాదడప వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటల మేరకు తేలికపాటి పంటలైన 39,000 వేల హెక్టార్లలోనే పంటలను సాగు చేయాల్సి వస్తోంది. ఈ విషయంపై రైతులు తొందర పాటుతనంతో విత్తనాలు వేయొద్దు – పరశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ప్రత్యామ్నాయం వైపు..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : వరుణుడు కరుణించడం లేదు. ఖరీఫ్ సీజను ప్రారంభమై పక్షం రోజులు గడిచినా వర్షం జాడ లేకుండా పోయింది. రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారు. కనీసం లోటు వర్షపాతం కాదు, ఏకంగా డ్రైస్పెల్ నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మోస్రా మండలంలో ఈ సీజనులో కనీసం జల్లులు కూడా పడలేదని వర్షపాతం రికార్డులు పేర్కొంటున్నాయి. అలాగే మిగిలిన 28 మండలాల్లోనూ డ్రైస్పెల్ కొనసాగుతోంది. కరువుకు సంకేతాలుగా చెప్పుకునే డ్రైస్పెల్ కొనసాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా సాధారణ సగటు వర్షపాతం 1,042 మిల్లీమీటర్లు. ఈనెల 19 వరకు సగటున 111 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉంది. కేవలం 10 మిల్లీ మీటర్లు మాత్రమే వర్షపాతం రికార్డు అయ్యింది. మోస్రా, కోటగిరిల్లో అసలు వర్షమే కురవలేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశం జిల్లాలో డ్రైస్పెల్ కొనసాగుతుండటంతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈనెలారులోగా వర్షాలు కురవకపోతే చేపట్టనున్న ప్రణాళికను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా ఏరువాక శాస్త్రవేత్తలను సంప్రదించారు. ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాని పక్షంలో రైతులకు ఆరుతడి పంటల విత్తనాల సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఆందోళనలో రైతన్నలు.. వరుణుడి జాడ లేకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్‌లోనూ ఆశించిన మేరకు వర్షం కురవలేదు. దీనికి తోడు ఎండల తీవ్రతకు భూగర్భజలాలు కూడా అడుగంటి పోయాయి. సీజను ప్రారంభమై మూడు వారాలు దగ్గరపడుతున్నప్పటికీ చుక్క వర్షం కురవకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముదురుతున్న నారు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ముందుగా నాట్లు వేసుకుంటారు. వర్ని, బోధన్, ఎడపల్లి, నవీపేట్, కోటగిరి వంటి మండలాల్లో ముందుగా వరి నాట్లు వేస్తారు. ఈసారి కూడా చాలా మంది రైతులు నారుమడులు వేసుకున్నారు. ఈనెల 25లోగా నాట్లు వేసుకుంటేనే నారు పనిచేస్తుంది. లేనిపక్షంలో నారు పనికిరాకుండా పోతుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో నారు పోసి 15 నుంచి 20 రోజులవుతోంది. మరో వారం, పది రోజుల్లో వర్షాలు కురవకపోతే ఈ నారు పనిచేయకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులు.. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బోర్ల కింద సాగు చేసుకునే రైతులు నీటి వాడకం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బోర్ల వద్ద వరి సాగు చేసే రైతులు స్వల్ప కాలిక, మధ్యకాలిక రకాలను వేసుకోవాలని డాట్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. -
కౌలు రైతులపై కరుణేదీ!
తాండూరు: ఏ ఆధారమూ లేని కౌలు రైతులపై ప్రభుత్వం కరుణ చూపడం లేదు. నేలతల్లిని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని పంటలు సాగు చేస్తూ ఏటా నష్ట పోతున్న తమను ఆదుకునేందుకు సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 501 రెవెన్యూ గ్రామాలున్నాయి. 80 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధార పడి జీవనం సాగిస్తారు. జిల్లాలో భూములున్న పట్టాదారులు వరుస నష్టాలను చవిచూసి, పొలం పనులు చేయలేక తమ భూమిని కౌలుకు ఇస్తున్నారు. ముందుగానే వచ్చిన కౌలు డబ్బులను తీసుకొని ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ప్రతీ మండలంలో ఈ విధానం కొనసాగుతోంది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో సుమారు పదుల సంఖ్యలో కౌలు రైతులు పొలాలను లీజుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. ఇలా సుమారు 20వేల మంది.. సుమారు లక్ష ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. వీరిని కౌలు రైతులుగా గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని తాండూరు, కొడంగల్, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లో కౌలుకు తీసుకున్న భూమిలో పత్తి, కంది, పెసర, మినుము పంటలను వేస్తున్నారు. ప్రకృతి సహకరిస్తే కౌలుకు తీసుకున్న రైతులు పెట్టిన పెట్టుబడికి కొంత వరకు లాభాలు వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే కష్టాల్లో కూరుకుపోతున్నారు. కౌలు రైతులకు వర్తించదు కౌలు రైతులకు రైతుబంధు పథకం వర్తించదు. వీరికి పథకాలు అందేలా ప్రభుత్వం నుంచి ఎలాంటి విధివిధానాలు అందలేదు. కౌలు రైతులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు అందించాలని ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. కౌలు రైతుల కోసం ప్రభుత్వం ఏవైనా కొత్త పథకాలు ప్రవేశపెడితే అమలు చేస్తాం. – గోపాల్, వ్యవసాయాధికారి -
చినుకు జాడలేదు!
ఖరీప్ సీజన్ ప్రారంభమైంది. రోళ్లు పగిలే రోహిణి కార్తె వెళ్లిపోయింది. తొలకరి పలకరించే మృగశిర కార్తె ప్రవేశించి వారమైంది. కానీ చినుకు జాడలేదు. రుతుపవనాలు కేరళను తాకి వారం రోజులైంది. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు మాత్రం వెనుకాడుతున్నాయి. ఎటు చూసినా వరుణుడు ముఖం చాటేశాడు. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో రైతు కాడెత్తే పరిస్థితి కనిపించడంలేదు. జూన్ మొదటి వారంలోనే ప్రారంభం కావాల్సిన ఖరీఫ్ పనులు ఇప్పటికీ మొదలు కాకపోవడంతో రైతులు వరుణుడి కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. సాగు ఆలస్యమైతే దాని ప్రభావం దిగుబడిపై చూపుతుందని దిగాలు చెందుతున్నారు. రోజులు గడిచినా చినుకు జాడలేకపోవడం అన్నదాతను కలవర పెడుతోంది. సకాలంలో వర్షాలు కురుస్తాయని రైతులు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరణుడు మాత్రం కరుణించడంలేదు. వర్షం సకాలంలో పడకపోతే పంటలు ఆలస్యమై దిగుబడి కూడా తగుగ్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాధారణ వర్షపాతం 912.0 మి.మీ నమోదు కావాలి. ఈసంవత్సరం జూన్ 30 వరకు జిల్లా 124.5 మి.మీ వర్షపాతం నమోతు కావాలి. ఇప్పటి వరకు రామడుగు, చొప్పదండి, శంకరపట్నం మండలాల్లో మాత్రమే చిరు జల్లులు కురిశాయి. జిల్లాలోని మిగతా మండలాల్లో చుక్క చినుకు కూడా కురవలేదు. ఇల్లందకుంట(హుజూరాబాద్): ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 5.15 లక్షల హెక్టర్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా రైతులు వరి, పత్తి, మొక్కజొన్న సాగు పంటలు వేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ శాతం సాగుభూమి వర్షాధారమే. నాలుగైదేళ్లుగా వర్షపాతం తక్కువగా నమోదవుతుండడంతో జలశయాలు, చెరువుల్లో నిటీ నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. దీంతో సాగుపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈక్రమంలో ఈ ఏడాదైనా మంచి వర్షాలు కురుస్తాయని రైతులు భావించారు. కానీ జూన్ నెల సగం రోజులు గడిచినా చినుకు జాడలేకపోవడం అన్నదాతను కలవర పెడుతోంది. సకాలంలో వర్షాలు కురుస్తాయని రైతులు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరణుడు మాత్రం కరుణించడంలేదు. వర్షం సకాలంలో పడకపోతే పంటలు ఆలస్యమై దిగుబడి కూడా తగుగ్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాధారణ వర్షపాతం 912.0 మి.మీ నమోదు కావాలి. ఈసంవత్సరం జూన్ 30 వరకు జిల్లా 124.5 మి.మీ వర్షపాతం నమోతు కావాలి. ఇప్పటి వరకు రామడుగు, చొప్పదండి, శంకరపట్నం మండలాల్లో మాత్రమే చిరు జల్లులు కురిశాయి. జిల్లాలోని మిగతా మండలాల్లో చుక్క చినుకు కూడా కురవలేదు. దుక్కులు సిద్ధం ఈసారి బాగా పడుతాయని భావించి మే నెలలోనే దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసిన. విత్తనాలు కొని చినుకు పడగానే నాటేందుకు సిద్ధం ఉన్నాం. గతేడు ఇçప్పటికే విత్తనాలు పెట్టినం. ఈ ఏడాది ఇప్పటికీ చినుకు జాడలేదు. – దార సమ్మయ్య,ఇల్లందకుంట విత్తనం పెట్టాలంటే భయం.. గతేడాది జూన్‌లో వర్షాలు పడ్డాయి. ఖరీప్‌లో ఈసమయంలో వర్షాలు పడాలి. కానీ ఎండలు కొడుతున్నయ్. ఇప్పుడు విత్తనాలు పెడితే ఎండిపోయే పరిస్థితి. గత సంవత్సరం ఈపాటికి పత్తి మొలకలు వచ్చినయ్. ఇప్పుడు విత్తనం పెట్టాలంలే భయంగా ఉంది. – శ్రీనివాస్, శ్రీరాములపల్లి -
కరుణించవయ్యా..
అచ్చంపేట: మృగశిర కార్తె దాటి వారం గడిచినా వానల జాడలేదు. ఖరీఫ్ సీజన్ పనులకు సిద్ధమైన రైతులు ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. పుడమితల్లి పులకరించేలా వర్షం కురియక పోవడంతో విత్తనాలు వేసేందుకు చాలా మంది రైతులు వెనకాడుతున్నారు. నల్లమలలో తొలకరి ముందుగానే పలకరించి రైతుల్లో ఆశలు చిగురింప జేసింది. కానీ ముందుస్తు విత్తనాలు వేసిన రైతులను కష్టాల్లోకి నెట్టింది. మొఖంచాటేసిన రుతుపవనాలు.. ప్రతీఏడాది జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. ఈనెల7న కురిసిన వర్షానికి కొంత మంది రైతులు విత్తనాలు వేశారు. తిరిగి వరుణడు మళ్లీ కన్నెత్తి చూడకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక రూ.కోట్లలో నష్టం సవిచూడాల్సి వస్తోంది. 2.35లక్షల హెక్టార్లలో.. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 2.35లక్షల హెక్టార్లలో పంటల సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అక్కడక్కడ కురిసిన వర్షాలకు ఇప్పటివరకు 20శాతం మంది రైతులు పత్తి, మొక్కజొన్న, జొన్న విత్తనాలు విత్తారు. విత్తనం వేసింది మొదలు ఇప్పటి వరకు చినుకు రాలక పోవడంతో మొక్కలు మొలకదశలోనే ఎండిపోతున్నాయి. గతేడాది మృగశిర కార్తే నుంచే వర్షాలు కురవడంతో దాదాపుగా జూన్ మద్యమాసం వరకు ఆరుతడి పంటలను విత్తడం పూర్తయింది. ఈసారి జూన్ మద్య మాసం వచ్చినా పంటలు విత్తుట ప్రారంభం కాలేదు. అచ్చంపేట నియోజకవర్గంలో కొంత మంది రైతులు మందుస్తుగా రోహిణి కార్తే ప్రారంభం నుంచే పంటల విత్తడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు బారీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బోరుబావులు ఎండిపోతున్నాయి. ఉన్న నీటిని వర్షాలు తోడు అయితే పంటలు మొలకెత్తుతాయని రైతులు అశించారు. పరిస్థితులు ప్రతికూలంగా మారియి. భానుడి ప్రతాపం తగ్గకపోవడంతో నాటిన విత్తనాలు కూడా మొలకెత్తకుండా పోతున్నాయి. రైతులు ఆకాశంలో మేఘవంతం అవుతున్న మబ్బుల వైపు వర్షంకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నేలపై విత్తనాలు చల్లిన రైతన్నలు భూమిలోనే ఎండిపోయే పరిస్థితి దాపురించి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. నీటి వనరులు ఉన్నా రైతులు స్పింక్లర్ల సహాయంతో భూమిని తడిపి పంటను రక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్షంపై ఆధారపడిన మెట్టపొలాల రైతులు మాత్రం వర్షం కోసం చూస్తున్నారు. ఈ సారి గతేడాది మాదిరిగానే వర్షాలు వస్తాయని భావించిన రైతులు విత్తనాలు విత్తి పంటలసాగుపై దష్టికేంద్రికరించగా అందుకు బిన్నంగా ఉంది. ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు వేసుకోవాలని సూచించిన వర్షాన్ని నమ్ముకొన్ని రైతులు ముందుగానే విత్తనాలు వేశారు. చాలా మంది రైతులు విత్తనాలు భూమిలో పోసి వర్షం కోసం కళ్లు కాయలు కాయంగా ఎదురు చూస్తున్నారు. వర్షం రాకపోతే..? మండుతున్న ఎండలు, ఈదురు గాలులు తప్ప ఇంత వరకు చినుకు రాలకపోవడంతో రైతులు నిరాశ, నిస్పహతో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు రోజుల్లో వర్షాలు పడకపోతే రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. రైతులు సబ్సిడీ విత్తనాలతో పాటు ప్రైవేట్ వ్యాపారుల నుంచి అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. చాలా వరకు అవీ మొలకెత్తక పోవడంతో పెట్టినపెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని రైతన్న కలత చెందుతున్నారు. ఎకరా పత్తిసాగుకు రూ.15వేల పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు వర్షాలు కురియకపోతే మళ్లీ రైతులు దుక్కి దున్ని విత్తనాలు కొనుగోలు చేసి పంటల సాగు చేయాలంటే మళ్లీ అంత డబ్బు ఖర్చు అవుతుంది. ఒక ఖరీఫ్‌లోనే రెండు సార్లు పెట్టబడులు పెట్టాల్సిన పరిస్థితి రైతుకు ఏర్పడుతుంది. ఇదీ అంత చేసినా పంటలు చేతికి వచ్చే నాటికి పరిస్థితులు ఏలా ఉంటాయోనన్ని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడిన అప్పులు ఇచ్చేది ఎవరన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది చేసిన అప్పులే నేటికి తీరలేదని, ఇప్పుడు మళ్లీ అప్పులతో తాము ఏలా బతికేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వానమ్మ.. రావమ్మా
బాల్కొండ : మృగశిర కార్తె దాటి వారం గడిచినా వానల జాడలేదు. ఖరీఫ్ సీజన్ పనులకు సిద్ధమైన రైతులు ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. పుడమి తల్లి పులకరించేలా వర్షం కురియక పోవడంతో విత్తనాలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల 46 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు అందులో పాతిక శాతం కూడా పంట విత్తే పనులు ప్రారంభం కాలేదు. గతేడాది మృగశిర కార్తే నుంచే వర్షాలు కురువడంతో దాదాపుగా జూన్ మధ్య మాసం వరకు ఆరు తడి పంటలను విత్తడం పూర్తయింది. ఈసారి జూన్ మధ్య మాసం వచ్చినా పంటలు విత్తుట ప్రారంభం కాలేదు. ఆర్మూర్ విడిజన్‌లో బోరు బావుల ఆధారంగా కొంత మంది రైతులు ముందస్తుగా రోహిణి కార్తే ప్రారంభం నుంచే పంటలు విత్తడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు భారీ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బోరు బావులు ఎత్తిపోతున్నాయి. ఉన్న నీటికి వర్షాలు తోడు అయితే పంటలు మొలకెత్తుతాయని రైతులు ఆశించారు. పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. భానుడి ప్రతాపం తగ్గక పోవడంతో నాటిన విత్తనాలు కూడా మొలకెత్తకుండా పోతున్నాయి. కొందరు రైతులు పసుపు పంటను కూడా విత్తారు. ప్రస్తుతం వానలు లేక పోవడంతో పరేషాన్ అవుతున్నారు. పసుపు పంట విత్తనం మార్కెట్లో లభించే అవకాశం లేదు. ఒక్కసారి విత్తితే మళ్లీ పంట దిగుబడి వచ్చిన తరువాతనే విత్తనం లభిస్తుంది. వర్షాలు లేక పోవడంతో పూర్తి స్థాయిలో మొలకెత్తే అవకాశం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వాన పడుతుందని పంటను విత్తాను బోరుబావుల్లో నీరు ఉండటం, వానలు పడుతాయని ఆశతో పసుపు పంటను విత్తాను. ఇప్పుడు వర్షాలు లేక పోవడంతో నీరు సరిపోవడం లేదు. విత్తిన పంట పూర్తిగా మొలకెత్తుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. వానలు కురువాలని మొక్కుతున్నాం. – దేవేందర్, వన్నెల్(బి), రైతు ఏటా ఇదే దుస్థితి ఉంది వాన కాలం ప్రారంభమైనా వానలు కురవడం లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉండటంతో సకాలంలో విత్తనాలు విత్తలేక పోతున్నాం. ఇప్పటి వరకు పసుపు పంట విత్తడం పూర్తి కావాలి. కాని వానలు లేక మొగులుకు మొకం పెట్టి చూస్తున్నాం. – ఎల్లరెడ్డి, రైతు, నాగంపేట్ -
వానమ్మ.. రావమ్మా
సాక్షి, ఆదిలాబాద్: వానమ్మ.. రావమ్మా.. అంటూ తొలకరి వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో మృగశిర కార్తె ప్రవేశంతోనే రైతులు పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ చిన్నపా టి చినుకులు పడడమే తప్పా పెద్ద వర్షాల జాడలేదు. అయినా నీటివసతి ఉన్న రైతులు వితనాలు వేసేశారు. దీం తో మిగతా రైతులు ఆగమాగం అవుతున్నారు. ఒకరిని చూసి మరొకరు భూమిలో విత్తనం వేస్తున్నారు. ఇప్పటికే 20 నుంచి 30 శాతం మంది పత్తి విత్తనాలు పెట్టారు. ఇక వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండుమూడు రోజుల్లో వర్షాలు కురువని పక్షంలో పెట్టుబడిలోనే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అప్పటికి.. ఇప్పటికీ గతేడాది తొలకరి వర్షాలు రైతులను మురిపించాయి. పోయినేడు ఇదే సమయానికి 70 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. సాధారణంగా జిల్లాలో రైతులు పత్తి పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2 లక్షల హెక్టార్ల వరకు సాగయ్యే పరిస్థితి ఉండగా, అందులో పత్తి పంటనే 1.47 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఏడాది వర్షా ల రాక ఆలస్యం కావడంతో రైతులు పత్తి విత్తనా లు నాటడంలో డోలయాన పరిస్థితి కనిపిస్తోంది. నీటి సౌకర్యం ఉన్న కొంత మంది బడా రైతులు పత్తి విత్తనాలు నాటడంతో వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వారిని చూసి పలు వురు చిన్న, సన్నకారు రైతులు కూడా విత్తనాలు వేశారు. ఈ రెండుమూడు రోజులు వర్షాలు పడితే నే ఆ విత్తనం మొలకెత్తే అవకాశం ఉంది. లేదంటే భూమిలోనే విత్తు నాశనమయ్యే పరిస్థితి ఉంది. అంతా రెడీ.. వర్షాకాలం పంటలకు ముందు రైతులు సర్వం సిద్ధం చేసుకున్నారు. దుక్కులు దున్ని చదును చేశారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇం ట్లో పెట్టుకుంటున్నారు. వర్షాలు మంచిగ పడిన పక్షంలో పత్తి విత్తనాలు జోరుగా నాటే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తొలకరి ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ధైర్యం చేసి తెచ్చిన విత్తనాలను నాటితే వర్షాలు రాక చెయ్యికి అందదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విత్తనాలు నాటాల్సి వస్తోంది. అప్పటికీ వర్షాలు సహకరిస్తేనే రైతుకు మేలు జరుగుతుంది. ఏటా ప్రకృ తి వైపరిత్యాలతో కర్షకుడు ఏదో రీతిన నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది తొలకరి జోరుగా మురిపించగా, ఆ తర్వాత వర్షాలు ము ఖం చాటేయడంతో పెట్టుబడి గణనీయంగా పెరిగి రైతు ఆర్థిక పరిస్థితి కుదేలైంది. పంట చేతికొచ్చే సమయంలో అతివృష్టి కారణంగా పం టలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇసుక మేటలతో చేల్లు ధ్వంసమయ్యాయి. రైతులు నష్టపోయా రు. ఇలా రైతన్నను భారీ వర్షాలు అప్పట్లో దెబ్బతీ శాయి. సాహసం చేయడం పత్తి రైతుకు అలవా టైంది. ప్రధానంగా ఇప్పుడు విత్తనాలు నాటి వ ర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశంతో పత్తి విత్తనం నాటిన పక్షంలో సరైన స మయంలో పత్తికి పూత, కాత వస్తుందనే నమ్మకంతో రైతులు ఈ సమయంలో విత్తు నాటేందుకు సాహసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వరుణ దేవు డు కరుణిస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి ఉంది. తీవ్ర వర్షాభావం గతేడాదితో పోల్చితే ఈసారి తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్ మండలాల్లో తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. సాధారణ వర్షం కంటే –60 శాతం నుంచి –99 శాతం వరకు తక్కువ వర్షపాతం ఉంటే దానిని తీవ్ర వర్షాభావంగా పరిగణిస్తారు. ప్రస్తుతం పై మూడు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. –20 శాతం నుంచి –59 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని వర్షాభావ పరిస్థితిగా పరిగణిస్తారు. జిల్లాలోని బేల, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్‌లలో ఈ పరిస్థితి ఉంది. సాధారణ వర్షపాతం కంటే –19 శాతం నుంచి +19 శాతం వరకు వర్షం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇక సాధారణ వర్షపాతం కంటే +20 శాతం, అంతకంటే ఎక్కువ కురిస్తే దానిని అతివర్షపాతంగా పరిగణిస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఒక తాంసి, భీంపూర్ మండలాల్లోనే అధిక వర్షపాతం కురిసింది. స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి రుతుపవనాలు కేరళను తాకాయి. మనదగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండుమూడు మంచి వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు వేయాలి. తక్కువ వర్షపాతంలో విత్తనాలు వేయొద్దు. తేమ లేకపోవడంతో మొలక సరిగ్గా రాదు. సోయాబీన్‌ను జూలై 15 వరకు వేసుకోవచ్చు. వర్షాలు ఆలస్యంగా కురుస్తున్న దృష్ట్యా పత్తి, సోయా, తొగర్లు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. సోయాబీన్‌కు అంతరపంటగా తొగర్లను నాటడం ద్వారా ఒకవేళ సోయాలో నష్టపోయినా తొగర్ల ద్వారా రైతులకు కొంత లాభం జరుగుతుంది. పత్తి రైతులు వర్షాలు పడకముందే తొందర పడొద్దు. – సుధాన్షు, శాస్త్రవేత్త -
ప్రమాద ఘంటికలు
హన్మకొండ / భీమదేవరపల్లి : వర్షాభావ పరిస్థితులు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంట ల్లోకి నీరు చేరక భూగర్భజలాలు వృద్ధి కాలే దు. దీనికి తోడు మానవ అవసరాలకు ఉన్న నీరంతా తోడేస్తున్న ఫలితంగా నెలనెలా భూగర్భజలాలు పడిపోతూ వచ్చాయి. రుతుపవనాలు ముందు మాసం మే నాటికి భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా తాగునీటి అవసరాలు తీర్చుకునే గ్రామాల్లో ప్రజలకు నీరు దొరకక సమస్యలు ఎదుర్కొంటున్నా రు. మిషన్ భగీరథ పథకం కొన్ని గ్రామాల్లో ఆదుకుంటుండంగా మరి కొన్ని గ్రామాల ప్రజలు నీటి అవసరాలకు నానా పాట్లు పడుతున్నారు. సగటున 12.46 మీటర్లు వరంగల్ అర్బన్ జిల్లాలో సగటున 12.46 మీటర్ల లోతుకు వెళ్తే తప్ప నీటి జాడలు కానరావ డం లేదు. 2018 మే మాసం నాటికి 10.11 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది మే మాసాంతం వరకు 12.46 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే మరో 2.84 మీటర్ల లోతుకు పడిపోయాయన్న మాట. జిల్లాలో అత్యధికంగా బీమదేవరపల్లి, ఐనవోలు మండలంలో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ఈ రెండు మండలాల్లో 16 మీటర్ల లోతుకు జలాలు వెళ్లాయి. బీమదేవరపల్లి మండలం వంగరలో 16.15 మీటర్ల లోతులో, గట్లనర్సింగపూర్‌లో 15.22 మీటర్ల లోతులో నీరు ఉంది. వంగరలో గతేడాది మే నాటికి 3.75 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 12.79 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయ న్న మాట. ఇక ఐనవోలు మండలం పంథినిలో 16.46 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. గతేడాది మాసాంతం వర కు అక్కడ 13.66 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. జిల్లా కేంద్రమైన హన్మకొండకు వచ్చే సరికి 13.53 మీటర్ల లోతుకు భూగ ర్భ జలాలు పడిపోయాయి. దీంతో నగరంలో ఇంటి అవసరాలకు వేసిన బోర్లు ఎండిపోయాయి. ఫలితంగా ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో ప్రమాదఘంటికలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో వర్షాలు కురవకపోతే పరి స్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సగం బాయిలు ఎండిపోయినయి... భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. గ్రామంలో కరువు కరాళనృత్యం చేస్తుంది. బోరుబావుల్లో నీళ్లు పాతాళలోకంలోకి పోగా ఇక వ్యవసాయ బావుల్లో సైతం నీళ్లు అడుగంటాయి. ఫలితంగా పశువులు తాగేందుకు సైతం సరిపోవడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. వంగరలో గ్రామంలో మొత్తం 6,024 ఎకరాల భౌగోళిక విస్తీర్ణం కాగా అందులో 4,418 ఎకరాల్లో సాగు భూమి ఉంది. సాగు నీటిని అందించేందుకు 380 వ్యవసాయ బావులు, 295 బోరు బావులు ఉన్నాయి. కాగా ఈ ఏడాదిలో సాగు నీరు ఇబ్బందిదిని దృష్టిలో పెట్టుకుని రైతులు ముందు జాగ్రత్తగా తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగు చేశారు. 149 ఎకరాల్లో వరి, 242 ఎకరాల్లో మొక్కజొన్న, 24 ఎకరాల్లో వేరుశనగతో పాటుగా 75 ఎకరాల్లో కూరగాయలు తదితర పంటలను సాగు చేశారు. పంటచేతికొచ్చే సమయంలో ఎండల తీవ్రత పెరగడంతోకావడం, బావులు, బోరుబావుల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. దీంతో సాగు నీరు అందక సగం మేర వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయాయి. ఇక మే మాసంలో గ్రామంలోని 295 బోరుబావులకు గాను సుమారుగా 200పై చిలుకు బోర్లలో నీటి జాడే లేకుండా పోయింది. అలాగే, 380 వ్యవసాయ బావుల్లో 150 వ్యవసాయ బావులు పూర్తిగా ఎండిపోగా, 90కి పైగా బావుల్లో అరగంట పాటు మాత్రమే నీళ్లు అందిస్తున్నాయి. అంతేకాకుండా ఇక 140 బావులు కేవలం 10 నుంచి 20 నిమిషాల మేర మాత్రమే మోటరు ద్వారా నీళ్లు అందిస్తున్నాయి. అయితే, ఈ నీరు పశువులకు తాగు నీటికి మాత్రమే సరిపోతున్నాయి. ఒకప్పుడు యాసంగిలో రైతులు పంటల సాగుతో పాటుగా కూరగాయల సాగు చేసేవారు. కానీ ప్రస్తుతం వ్యవసాయ బావుల్లోని నీరు కేవలం పశువులకు మాత్రమే అందుతుండడం గమనార్హం. -
భయపెడుతున్న.. భూగర్భ జలమట్టం !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూగర్భ జలాలు లోలోతుకు పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాలు మరీ లోతుకుపోయాయి. ఖరీఫ్ గట్టెక్కినా రబీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారు కానుంది. దాంతో పాటు తాగునీటికీ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. జిల్లాలో గత సంవత్సరం జనవరిలో భూగర్భజలాలు 10.20 మీటర్ల వద్దనే లభ్యం కాగా.. ఈ ఏడాది జనవరిలో 13.83 మీటర్లకు పడిపోయాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే నీటి లభ్యత 3.63 మీటర్లకు పడిపోయింది. 2018 జూన్ 1 నుంచి ఇప్పటి వరకూ 660.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 412.0 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదయ్యింది. అంటే 38 మిల్లీమీటర్ల వర్షపాతం లోటులోనే ఉంది. ఈ ప్రభావం భూగర్భ జలమట్టంపై పడిందని అధికారులు పేర్కొంటున్నారు. ఖుదాపక్షపల్లిలో 63 మీటర్లకు పడిపోయిన నీటిమట్టం.. మర్రిగూడ మండలంలోని ఖుదాపక్షపల్లి గ్రామంలో భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయాయి. జిల్లాలో ఏ గ్రామంలో లేనివిధంగా ఇక్క డ 63 మీటర్ల నుంచి 64 మీటర్ల వరకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇప్పటికే ఆ గ్రామం తీవ్ర ఫ్లోరైడ్ సమస్యతో సతమతమవుతోంది. ఉపరితల నీటిని సరఫరా చేయడం మినహా మరో మార్గం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు అత్యంత లోతుకు పడిపోవడంతో, ఆ నీ టిని వినియోగించడం కూడా సరికాదని పేర్కొం టున్నారు. కాగా, జిల్లాలో అత్యధికంగా మర్రిగూ డ మండలంలో 26.42 మీటర్లకు భూగర్భ జలం చేరింది. ఇదే మండలంలో గత ఏడాది జనవరిలో 13.77 మీటర్ల వద్దనే భూగర్భ జలాలు లభ్యమవ్వగా, అదే ఏడాది మేలో 17.51 మీ టర్లకు చేరా యి. గతేడాది డిసెంబర్ నాటికి 24.57 మీరట్లకు పడిపోగా ప్రస్తుతం అది 26.42 మీట ర్లకు చేరిం ది.గత సంవత్సరం జనవరి నుంచి ఈ సంవత్స రం జనవరి వరకు ప్రతినెలా భూగర్భ జలాలు పడిపోవడమే తప్ప పెరగలేదు. జిల్లాలోని 10 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. వర్షాభావ పరిస్థితులు ఈ విధంగానే ఉంటే భూగర్భ జలమట్టం మరింతగా పడిపోయి నీటి ఎద్దడి తప్పదని ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. -
రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: మాల్దీవుల నుంచి తెలంగాణ వరకు ఇంటీరియర్ తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉండటంతో ఉదయం పూట పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.