సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూగర్భ జలాలు లోలోతుకు పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాలు మరీ లోతుకుపోయాయి. ఖరీఫ్ గట్టెక్కినా రబీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారు కానుంది. దాంతో పాటు తాగునీటికీ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. జిల్లాలో గత సంవత్సరం జనవరిలో భూగర్భజలాలు 10.20 మీటర్ల వద్దనే లభ్యం కాగా.. ఈ ఏడాది జనవరిలో 13.83 మీటర్లకు పడిపోయాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే నీటి లభ్యత 3.63 మీటర్లకు పడిపోయింది. 2018 జూన్ 1 నుంచి ఇప్పటి వరకూ 660.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 412.0 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదయ్యింది. అంటే 38 మిల్లీమీటర్ల వర్షపాతం లోటులోనే ఉంది. ఈ ప్రభావం భూగర్భ జలమట్టంపై పడిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఖుదాపక్షపల్లిలో 63 మీటర్లకు పడిపోయిన నీటిమట్టం..
మర్రిగూడ మండలంలోని ఖుదాపక్షపల్లి గ్రామంలో భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయాయి. జిల్లాలో ఏ గ్రామంలో లేనివిధంగా ఇక్క డ 63 మీటర్ల నుంచి 64 మీటర్ల వరకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇప్పటికే ఆ గ్రామం తీవ్ర ఫ్లోరైడ్ సమస్యతో సతమతమవుతోంది. ఉపరితల నీటిని సరఫరా చేయడం మినహా మరో మార్గం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు అత్యంత లోతుకు పడిపోవడంతో, ఆ నీ టిని వినియోగించడం కూడా సరికాదని పేర్కొం టున్నారు.
కాగా, జిల్లాలో అత్యధికంగా మర్రిగూ డ మండలంలో 26.42 మీటర్లకు భూగర్భ జలం చేరింది. ఇదే మండలంలో గత ఏడాది జనవరిలో 13.77 మీటర్ల వద్దనే భూగర్భ జలాలు లభ్యమవ్వగా, అదే ఏడాది మేలో 17.51 మీ టర్లకు చేరా యి. గతేడాది డిసెంబర్ నాటికి 24.57 మీరట్లకు పడిపోగా ప్రస్తుతం అది 26.42 మీట ర్లకు చేరిం ది.గత సంవత్సరం జనవరి నుంచి ఈ సంవత్స రం జనవరి వరకు ప్రతినెలా భూగర్భ జలాలు పడిపోవడమే తప్ప పెరగలేదు. జిల్లాలోని 10 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. వర్షాభావ పరిస్థితులు ఈ విధంగానే ఉంటే భూగర్భ జలమట్టం మరింతగా పడిపోయి నీటి ఎద్దడి తప్పదని ప్రజలు ఆందోళన చెం దుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment