చినుకు జాడలేదు! | Karimnagar Farmers Waiting For Rains | Sakshi
Sakshi News home page

చినుకు జాడలేదు!

Published Mon, Jun 17 2019 9:17 AM | Last Updated on Mon, Jun 17 2019 9:17 AM

Karimnagar Farmers Waiting For Rains - Sakshi

ఖరీప్‌ సీజన్‌ ప్రారంభమైంది. రోళ్లు పగిలే రోహిణి కార్తె వెళ్లిపోయింది. తొలకరి పలకరించే మృగశిర కార్తె ప్రవేశించి వారమైంది. కానీ చినుకు జాడలేదు.     రుతుపవనాలు కేరళను తాకి వారం రోజులైంది. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు మాత్రం వెనుకాడుతున్నాయి. ఎటు చూసినా వరుణుడు ముఖం చాటేశాడు. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో రైతు కాడెత్తే పరిస్థితి కనిపించడంలేదు. జూన్‌ మొదటి వారంలోనే ప్రారంభం కావాల్సిన ఖరీఫ్‌ పనులు ఇప్పటికీ మొదలు కాకపోవడంతో రైతులు వరుణుడి కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. సాగు ఆలస్యమైతే దాని ప్రభావం దిగుబడిపై చూపుతుందని దిగాలు చెందుతున్నారు.

 రోజులు గడిచినా చినుకు జాడలేకపోవడం అన్నదాతను కలవర పెడుతోంది. సకాలంలో వర్షాలు కురుస్తాయని రైతులు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరణుడు మాత్రం కరుణించడంలేదు. వర్షం సకాలంలో పడకపోతే పంటలు ఆలస్యమై దిగుబడి కూడా తగుగ్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సాధారణ వర్షపాతం 912.0 మి.మీ నమోదు కావాలి. ఈసంవత్సరం జూన్‌ 30 వరకు జిల్లా 124.5 మి.మీ వర్షపాతం నమోతు కావాలి. ఇప్పటి వరకు రామడుగు, చొప్పదండి, శంకరపట్నం మండలాల్లో మాత్రమే చిరు జల్లులు కురిశాయి. జిల్లాలోని మిగతా మండలాల్లో చుక్క చినుకు కూడా కురవలేదు.  

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 5.15 లక్షల హెక్టర్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా రైతులు వరి, పత్తి, మొక్కజొన్న సాగు పంటలు వేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ శాతం సాగుభూమి వర్షాధారమే. నాలుగైదేళ్లుగా వర్షపాతం తక్కువగా నమోదవుతుండడంతో జలశయాలు, చెరువుల్లో నిటీ నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. దీంతో సాగుపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈక్రమంలో ఈ ఏడాదైనా మంచి వర్షాలు కురుస్తాయని రైతులు భావించారు. కానీ జూన్‌ నెల సగం రోజులు గడిచినా చినుకు జాడలేకపోవడం అన్నదాతను కలవర పెడుతోంది.

సకాలంలో వర్షాలు కురుస్తాయని రైతులు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరణుడు మాత్రం కరుణించడంలేదు. వర్షం సకాలంలో పడకపోతే పంటలు ఆలస్యమై దిగుబడి కూడా తగుగ్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సాధారణ వర్షపాతం 912.0 మి.మీ నమోదు కావాలి. ఈసంవత్సరం జూన్‌ 30 వరకు జిల్లా 124.5 మి.మీ వర్షపాతం నమోతు కావాలి. ఇప్పటి వరకు రామడుగు, చొప్పదండి, శంకరపట్నం మండలాల్లో మాత్రమే చిరు జల్లులు కురిశాయి. జిల్లాలోని మిగతా మండలాల్లో చుక్క చినుకు కూడా కురవలేదు

దుక్కులు సిద్ధం 
ఈసారి బాగా పడుతాయని భావించి మే నెలలోనే దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసిన. విత్తనాలు కొని చినుకు పడగానే నాటేందుకు సిద్ధం ఉన్నాం. గతేడు ఇçప్పటికే విత్తనాలు పెట్టినం. ఈ ఏడాది ఇప్పటికీ చినుకు జాడలేదు.  – దార సమ్మయ్య,ఇల్లందకుంట

విత్తనం పెట్టాలంటే భయం..
గతేడాది జూన్‌లో వర్షాలు పడ్డాయి. ఖరీప్‌లో ఈసమయంలో వర్షాలు పడాలి. కానీ ఎండలు కొడుతున్నయ్‌. ఇప్పుడు విత్తనాలు పెడితే ఎండిపోయే పరిస్థితి. గత సంవత్సరం ఈపాటికి పత్తి మొలకలు వచ్చినయ్‌. ఇప్పుడు విత్తనం పెట్టాలంలే భయంగా ఉంది. – శ్రీనివాస్, శ్రీరాములపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement