Rains Late
-
హైదరాబాద్‌లో మోస్తరు వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల వర్షంకురుస్తోంది. బాలానగర్, బల్కంపేట, పంజాగుట్ట, బేగంపేట్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, రాజ్‌భవన్, కూకట్పల్లి లాంటి పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11గంటల నుంచి వర్షం కురుస్తోంది. ఓ మోస్తరుగా కురుస్తున్న ఈ వర్షాలు అర్దరాత్రి దాటాక భారీ వర్షంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
కాటేసిన ఖరీఫ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్ సాగు చతికిలపడింది. సీజన్ మొదలై నెలన్నర కావొస్తున్నా ఇప్పటికీ పంటల సాగు విస్తీర్ణం పెరగలేదు. వర్షాల్లేక వేసిన విత్తనాలు వేసినట్లే భూమిలో మాడిపోతున్నాయి. ఖరీఫ్‌లో కీలక సమయంలో వేయాల్సిన వివిధ పంటల సీజన్ మారిపోయింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఖరీఫ్ విత్తనాలు వేసే సీజన్ ముగిసిపోతుండటంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాని వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక విడుదల చేసింది. ఈ నెల 15 నాటికి సాధారణ స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం పెరగకపోతే దీన్ని అమలు చేయాలని సూచించింది. ఆ ప్రణాళికలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పరిస్థితిని వివరిస్తూ, ప్రత్యామ్నాయ పంటల వివరాలను జిల్లాల వారీగా ప్రకటించింది. మరోవైపు కంటిజెన్సీ ప్రణాళిక ప్రకారం అవసరమైన విత్తనాలను సరఫరా చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను ఆదేశించింది. వర్షాభావ పరిస్థితులు.. రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని కంటిజెన్సీ ప్రణాళికలో వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ నెల 12 నాటికి రాష్ట్రంలో 31 శాతం లోటు వర్షపాతం నమోదైందని పేర్కొంది. సాధారణంగా జూన్ 1 నుంచి ఈ నెల 12 నాటికి కురవాల్సిన వర్షపాతం 213.1 మిల్లీమీటర్లు (మి.మీ.) కాగా 146 మి.మీ. మాత్రమే కురిసింది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన దుర్భిక్షం నెలకొందని తెలిపింది. ఖమ్మం జిల్లాలో 69 శాతం, సూర్యాపేట జిల్లాలో 67 శాతం, నల్లగొండ జిల్లాలో 66 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మరో 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 40 శాతానికే పరిమితమైంది. ఈ ఖరీఫ్ సీజన్లో సాధారణంగా 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 43.33 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయని తెలిపింది. రైతులు 9 శాతమే నారు వేశారు. పత్తి, సోయాబీన్ తదితర విత్తనాలు వేసినా అవి భూమిలోనే మాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు వెళ్లాల్సి వస్తుందని, ఆ మేరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. మూడు దశల కంటింజెన్సీ ప్రణాళిక.. కంటింజెన్సీ ప్రణాళికను మూడు దశల్లో అమలు చేస్తారు. ఈ నెల 15 వరకు సాధారణంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరగకపోతే మొదటి ప్రణాళిక, అలాగే ఈ నెల 31 నాటికి కూడా పరిస్థితి మెరుగుపడకపోతే రెండో దశ ప్రణాళిక, ఆ తర్వాత ఆగస్టు 15 నాటికి కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే మూడో దశ ప్రణాళిక అమలు చేస్తారు. ఆ ప్రకారం ఆయా సమయాల్లో ఏ జిల్లాల్లో ఎటువంటి పంటలను సాగు చేయాలనే దానిపై ఒక కేలండర్‌ను వ్యవసాయ శాఖ విడుదల చేసింది. జిల్లాల వారీగా వర్షపాతం, అక్కడి నేలల స్వభావం, వేయాల్సిన పంటలను అందులో వ్యవసాయ శాఖ వెల్లడించింది. ప్రధానంగా ఆయా పంటల్లో స్వల్పకాలిక, మధ్యకాలిక విత్తనాలను, అలాగే వివిధ రకాల వెరైటీలను వేయాలని సూచించింది. ఉదాహరణకు కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నేలల్లో (ఈ నెల 15 నాటికి వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే) మధ్యకాలిక కంది, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వేయాలని సూచించింది. ఈ నెల 31 నాటికి పరిస్థితి మెరుగుపడకపోతే ఆయా పంటల్లోని స్వల్పకాలిక రకాలను, అలాగే జొన్న, స్వల్పకాలిక కూరగాయల విత్తనాలను వేయాలని సూచించింది. ఆగస్టు 15 నాటికి మూడో దశలో కంది, పొద్దు తిరుగుడు, ఆముదం, కంది వంటి విత్తనాలను సాగు చేయాలని సూచించింది. ఇలా జిల్లాల వారీగా తయారు చేసిన కేలండర్‌ను జిల్లాలకు పంపింది. 6.02 లక్షల క్వింటాళ్ల విత్తనాలు.. కంటింజెన్సీ ప్రణాళిక అమలుకు ప్రత్యేకంగా 6.02 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా విత్తనాభివృద్ధి సంస్థకు లేఖ రాశారు. ఈ నెల 15 నాటి మొదటి దశ ప్రణాళిక అమలు కోసం 1.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, ఈ నెల 31 నాటి రెండో దశ ప్రణాళిక అమలుకు 1.94 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, వచ్చే నెల 15 నాటి మూడో దశ ప్రణాళిక అమలుకు 2.28 లక్షల కింటాళ్ల విత్తనాలు అందజేయాలని కోరింది. అందులో అత్యధికంగా వరి, వేరుశనగ, పెసర, కంది, మొక్కజొన్న విత్తనాలున్నాయి. వేరుశనగ విత్తనాలు మూడు దశల కంటింజెన్సీ అమలుకు 2.45 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ కోరింది. ఆ తర్వాత కంది విత్తనాలు 76 వేల క్వింటాళ్లు, వరి విత్తనాలు 57 వేల క్వింటాళ్లు, మొక్కజొన్న విత్తనాలు 59 వేల క్వింటాళ్లు, సోయాబీన్ 22 వేల క్వింటాళ్లు, జొన్న 13 వేల క్వింటాళ్లు సరఫరాకు విన్నవించింది. ఇవిగాక మినుములు, నువ్వులు, సజ్జలు, ఆముదం, కొర్రలు, పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా సరఫరా చేయాలని కోరింది. ఏ జిల్లాకు ఎంతెంత ఇండెంట్ కావాలో స్పష్టంగా పేర్కొంది. -
చినుకు జాడలేదు!
ఖరీప్ సీజన్ ప్రారంభమైంది. రోళ్లు పగిలే రోహిణి కార్తె వెళ్లిపోయింది. తొలకరి పలకరించే మృగశిర కార్తె ప్రవేశించి వారమైంది. కానీ చినుకు జాడలేదు. రుతుపవనాలు కేరళను తాకి వారం రోజులైంది. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు మాత్రం వెనుకాడుతున్నాయి. ఎటు చూసినా వరుణుడు ముఖం చాటేశాడు. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో రైతు కాడెత్తే పరిస్థితి కనిపించడంలేదు. జూన్ మొదటి వారంలోనే ప్రారంభం కావాల్సిన ఖరీఫ్ పనులు ఇప్పటికీ మొదలు కాకపోవడంతో రైతులు వరుణుడి కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. సాగు ఆలస్యమైతే దాని ప్రభావం దిగుబడిపై చూపుతుందని దిగాలు చెందుతున్నారు. రోజులు గడిచినా చినుకు జాడలేకపోవడం అన్నదాతను కలవర పెడుతోంది. సకాలంలో వర్షాలు కురుస్తాయని రైతులు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరణుడు మాత్రం కరుణించడంలేదు. వర్షం సకాలంలో పడకపోతే పంటలు ఆలస్యమై దిగుబడి కూడా తగుగ్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాధారణ వర్షపాతం 912.0 మి.మీ నమోదు కావాలి. ఈసంవత్సరం జూన్ 30 వరకు జిల్లా 124.5 మి.మీ వర్షపాతం నమోతు కావాలి. ఇప్పటి వరకు రామడుగు, చొప్పదండి, శంకరపట్నం మండలాల్లో మాత్రమే చిరు జల్లులు కురిశాయి. జిల్లాలోని మిగతా మండలాల్లో చుక్క చినుకు కూడా కురవలేదు. ఇల్లందకుంట(హుజూరాబాద్): ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 5.15 లక్షల హెక్టర్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా రైతులు వరి, పత్తి, మొక్కజొన్న సాగు పంటలు వేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ శాతం సాగుభూమి వర్షాధారమే. నాలుగైదేళ్లుగా వర్షపాతం తక్కువగా నమోదవుతుండడంతో జలశయాలు, చెరువుల్లో నిటీ నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. దీంతో సాగుపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈక్రమంలో ఈ ఏడాదైనా మంచి వర్షాలు కురుస్తాయని రైతులు భావించారు. కానీ జూన్ నెల సగం రోజులు గడిచినా చినుకు జాడలేకపోవడం అన్నదాతను కలవర పెడుతోంది. సకాలంలో వర్షాలు కురుస్తాయని రైతులు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరణుడు మాత్రం కరుణించడంలేదు. వర్షం సకాలంలో పడకపోతే పంటలు ఆలస్యమై దిగుబడి కూడా తగుగ్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాధారణ వర్షపాతం 912.0 మి.మీ నమోదు కావాలి. ఈసంవత్సరం జూన్ 30 వరకు జిల్లా 124.5 మి.మీ వర్షపాతం నమోతు కావాలి. ఇప్పటి వరకు రామడుగు, చొప్పదండి, శంకరపట్నం మండలాల్లో మాత్రమే చిరు జల్లులు కురిశాయి. జిల్లాలోని మిగతా మండలాల్లో చుక్క చినుకు కూడా కురవలేదు. దుక్కులు సిద్ధం ఈసారి బాగా పడుతాయని భావించి మే నెలలోనే దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసిన. విత్తనాలు కొని చినుకు పడగానే నాటేందుకు సిద్ధం ఉన్నాం. గతేడు ఇçప్పటికే విత్తనాలు పెట్టినం. ఈ ఏడాది ఇప్పటికీ చినుకు జాడలేదు. – దార సమ్మయ్య,ఇల్లందకుంట విత్తనం పెట్టాలంటే భయం.. గతేడాది జూన్‌లో వర్షాలు పడ్డాయి. ఖరీప్‌లో ఈసమయంలో వర్షాలు పడాలి. కానీ ఎండలు కొడుతున్నయ్. ఇప్పుడు విత్తనాలు పెడితే ఎండిపోయే పరిస్థితి. గత సంవత్సరం ఈపాటికి పత్తి మొలకలు వచ్చినయ్. ఇప్పుడు విత్తనం పెట్టాలంలే భయంగా ఉంది. – శ్రీనివాస్, శ్రీరాములపల్లి -
కరుణించవయ్యా..
అచ్చంపేట: మృగశిర కార్తె దాటి వారం గడిచినా వానల జాడలేదు. ఖరీఫ్ సీజన్ పనులకు సిద్ధమైన రైతులు ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. పుడమితల్లి పులకరించేలా వర్షం కురియక పోవడంతో విత్తనాలు వేసేందుకు చాలా మంది రైతులు వెనకాడుతున్నారు. నల్లమలలో తొలకరి ముందుగానే పలకరించి రైతుల్లో ఆశలు చిగురింప జేసింది. కానీ ముందుస్తు విత్తనాలు వేసిన రైతులను కష్టాల్లోకి నెట్టింది. మొఖంచాటేసిన రుతుపవనాలు.. ప్రతీఏడాది జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. ఈనెల7న కురిసిన వర్షానికి కొంత మంది రైతులు విత్తనాలు వేశారు. తిరిగి వరుణడు మళ్లీ కన్నెత్తి చూడకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక రూ.కోట్లలో నష్టం సవిచూడాల్సి వస్తోంది. 2.35లక్షల హెక్టార్లలో.. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 2.35లక్షల హెక్టార్లలో పంటల సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అక్కడక్కడ కురిసిన వర్షాలకు ఇప్పటివరకు 20శాతం మంది రైతులు పత్తి, మొక్కజొన్న, జొన్న విత్తనాలు విత్తారు. విత్తనం వేసింది మొదలు ఇప్పటి వరకు చినుకు రాలక పోవడంతో మొక్కలు మొలకదశలోనే ఎండిపోతున్నాయి. గతేడాది మృగశిర కార్తే నుంచే వర్షాలు కురవడంతో దాదాపుగా జూన్ మద్యమాసం వరకు ఆరుతడి పంటలను విత్తడం పూర్తయింది. ఈసారి జూన్ మద్య మాసం వచ్చినా పంటలు విత్తుట ప్రారంభం కాలేదు. అచ్చంపేట నియోజకవర్గంలో కొంత మంది రైతులు మందుస్తుగా రోహిణి కార్తే ప్రారంభం నుంచే పంటల విత్తడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు బారీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బోరుబావులు ఎండిపోతున్నాయి. ఉన్న నీటిని వర్షాలు తోడు అయితే పంటలు మొలకెత్తుతాయని రైతులు అశించారు. పరిస్థితులు ప్రతికూలంగా మారియి. భానుడి ప్రతాపం తగ్గకపోవడంతో నాటిన విత్తనాలు కూడా మొలకెత్తకుండా పోతున్నాయి. రైతులు ఆకాశంలో మేఘవంతం అవుతున్న మబ్బుల వైపు వర్షంకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నేలపై విత్తనాలు చల్లిన రైతన్నలు భూమిలోనే ఎండిపోయే పరిస్థితి దాపురించి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. నీటి వనరులు ఉన్నా రైతులు స్పింక్లర్ల సహాయంతో భూమిని తడిపి పంటను రక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్షంపై ఆధారపడిన మెట్టపొలాల రైతులు మాత్రం వర్షం కోసం చూస్తున్నారు. ఈ సారి గతేడాది మాదిరిగానే వర్షాలు వస్తాయని భావించిన రైతులు విత్తనాలు విత్తి పంటలసాగుపై దష్టికేంద్రికరించగా అందుకు బిన్నంగా ఉంది. ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు వేసుకోవాలని సూచించిన వర్షాన్ని నమ్ముకొన్ని రైతులు ముందుగానే విత్తనాలు వేశారు. చాలా మంది రైతులు విత్తనాలు భూమిలో పోసి వర్షం కోసం కళ్లు కాయలు కాయంగా ఎదురు చూస్తున్నారు. వర్షం రాకపోతే..? మండుతున్న ఎండలు, ఈదురు గాలులు తప్ప ఇంత వరకు చినుకు రాలకపోవడంతో రైతులు నిరాశ, నిస్పహతో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు రోజుల్లో వర్షాలు పడకపోతే రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. రైతులు సబ్సిడీ విత్తనాలతో పాటు ప్రైవేట్ వ్యాపారుల నుంచి అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. చాలా వరకు అవీ మొలకెత్తక పోవడంతో పెట్టినపెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని రైతన్న కలత చెందుతున్నారు. ఎకరా పత్తిసాగుకు రూ.15వేల పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు వర్షాలు కురియకపోతే మళ్లీ రైతులు దుక్కి దున్ని విత్తనాలు కొనుగోలు చేసి పంటల సాగు చేయాలంటే మళ్లీ అంత డబ్బు ఖర్చు అవుతుంది. ఒక ఖరీఫ్‌లోనే రెండు సార్లు పెట్టబడులు పెట్టాల్సిన పరిస్థితి రైతుకు ఏర్పడుతుంది. ఇదీ అంత చేసినా పంటలు చేతికి వచ్చే నాటికి పరిస్థితులు ఏలా ఉంటాయోనన్ని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడిన అప్పులు ఇచ్చేది ఎవరన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది చేసిన అప్పులే నేటికి తీరలేదని, ఇప్పుడు మళ్లీ అప్పులతో తాము ఏలా బతికేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వానమ్మ.. రావమ్మా
బాల్కొండ : మృగశిర కార్తె దాటి వారం గడిచినా వానల జాడలేదు. ఖరీఫ్ సీజన్ పనులకు సిద్ధమైన రైతులు ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. పుడమి తల్లి పులకరించేలా వర్షం కురియక పోవడంతో విత్తనాలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల 46 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు అందులో పాతిక శాతం కూడా పంట విత్తే పనులు ప్రారంభం కాలేదు. గతేడాది మృగశిర కార్తే నుంచే వర్షాలు కురువడంతో దాదాపుగా జూన్ మధ్య మాసం వరకు ఆరు తడి పంటలను విత్తడం పూర్తయింది. ఈసారి జూన్ మధ్య మాసం వచ్చినా పంటలు విత్తుట ప్రారంభం కాలేదు. ఆర్మూర్ విడిజన్‌లో బోరు బావుల ఆధారంగా కొంత మంది రైతులు ముందస్తుగా రోహిణి కార్తే ప్రారంభం నుంచే పంటలు విత్తడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు భారీ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బోరు బావులు ఎత్తిపోతున్నాయి. ఉన్న నీటికి వర్షాలు తోడు అయితే పంటలు మొలకెత్తుతాయని రైతులు ఆశించారు. పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. భానుడి ప్రతాపం తగ్గక పోవడంతో నాటిన విత్తనాలు కూడా మొలకెత్తకుండా పోతున్నాయి. కొందరు రైతులు పసుపు పంటను కూడా విత్తారు. ప్రస్తుతం వానలు లేక పోవడంతో పరేషాన్ అవుతున్నారు. పసుపు పంట విత్తనం మార్కెట్లో లభించే అవకాశం లేదు. ఒక్కసారి విత్తితే మళ్లీ పంట దిగుబడి వచ్చిన తరువాతనే విత్తనం లభిస్తుంది. వర్షాలు లేక పోవడంతో పూర్తి స్థాయిలో మొలకెత్తే అవకాశం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వాన పడుతుందని పంటను విత్తాను బోరుబావుల్లో నీరు ఉండటం, వానలు పడుతాయని ఆశతో పసుపు పంటను విత్తాను. ఇప్పుడు వర్షాలు లేక పోవడంతో నీరు సరిపోవడం లేదు. విత్తిన పంట పూర్తిగా మొలకెత్తుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. వానలు కురువాలని మొక్కుతున్నాం. – దేవేందర్, వన్నెల్(బి), రైతు ఏటా ఇదే దుస్థితి ఉంది వాన కాలం ప్రారంభమైనా వానలు కురవడం లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉండటంతో సకాలంలో విత్తనాలు విత్తలేక పోతున్నాం. ఇప్పటి వరకు పసుపు పంట విత్తడం పూర్తి కావాలి. కాని వానలు లేక మొగులుకు మొకం పెట్టి చూస్తున్నాం. – ఎల్లరెడ్డి, రైతు, నాగంపేట్ -
చినుకు లేక.. చింత..
* వర్షాలు ఆలస్యమవడంతో అన్నదాతల్లో ఆందోళన * ఖరీఫ్‌లో 40 లక్షల హెక్టార్లలో పంటలు వేయడానికి వీలుగా సోయాబీన్, వరి, పత్తి విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసిన అధికారులు * వర్షాలు లేక తగ్గిన కొనుగోళ్లు * జూలై 10లోగా ఆశించిన వర్షాలు రాకుంటే... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు * వర్షాధార పంటలో పత్తిదే అగ్రస్థానం సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆలస్యం కావడంతో.. రైతుల్లో ఆందోళన మొదలవుతోంది. జూన్ రెండో వారం గడిచినా.. వర్షాల సూచన లేకపోవడం, ఎండ, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండడం వారి ఆందోళనను తీవ్రం చేస్తోంది. దుక్కిదున్ని పంటకు సిద్ధం చేయూల్సిన సవుయుంలో చినుకు కోసం ఆకాశంవైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల హెక్టార్లలో పంటలు వేయడానికి వీలుగా అధికార యంత్రాంగం ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసింది. ప్రతిసారి రైతులు విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి అధికారులు వాటిని ముందస్తుగానే సిద్ధం చేశారు. అయితే వర్షాలు వచ్చే సూచనలు కన్పించకపోవడంతో రైతులు విత్తనాల కొనుగోలుకు పూర్తిస్థాయిలో ముందుకురావడం లేదు. తెలంగాణలో వర్షాధార పంటలో ఈసారి అత్యధికంగా పత్తి పంట విత్తనున్నారు. గత సంవత్సరం 74.97 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు రైతులు వినియోగించిన నేపథ్యంలో ఈసారి 85.62 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేశామని, అందులో ఇప్పటి వరకు 22.21 లక్షల ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ బి. జనార్దన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. పత్తిని 15.34 లక్షల హెక్టార్లలో సాగు చేయనున్నారని వివరించారు. సోయాబీన్ విత్తనాలకు గతంలో వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి రెండు లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించామని, అందులో ఇప్పటికే 1.77 లక్షల క్వింటాళ్ల విత్తనాలను జిల్లాల్లో అందుబాటులో ఉంచావుని, రైతులు ఇప్పటి వరకు 1.07 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేశారని చెప్పారు. ఈ పంట ఎక్కువగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సాగవుతోందని పేర్కొన్నారు. 70 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉంచితే.. ఇప్పటి వరకు 16 వేల మంది రైతులు విత్తనాలు కొనుగోలు చేశారని, వరిసాగుకు ఇంకా సమయం ఉందని అన్నారు. మొక్కజొన్న పంటకు సైతం ఉన్న డిమాండ్ మేరకు విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. రైతులు విత్తనాల కోసం ఎలాంటి ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గోడౌన్లలో ఇప్పటికి 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులున్నాయని, వర్షాలు పడితే.. ఈ ఎరువులను రైతులు తీసుకెళ్తే.. మరిన్ని ఎరువులను తీసుకుని రావడానికి తాము సిద్ధమేనని ఎరువుల కంపెనీలు హామీ ఇచ్చాయని తెలిపారు. ప్రతివారం ఎరువుల కంపెనీలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నావుని చెప్పారు. జూలై 10వ తేదీలోగా తగినంతగా వర్షాలు పడని పక్షంలో.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడతావుని ఆయన వివరించారు.