సాక్షి,భద్రాద్రికొత్తగూడెంజిల్లా: సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్‌ఫైర్ అయి డీఎస్పీస్థాయి అధికారి శేషగిరి మృతి చెందినట్లు తెలుస్తోంది. చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామంలోని క్యాంపులో బుధవారం(ఏప్రిల్24) ఈ ఘటన జరిగింది. పూసుగుప్ప సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ క్యాంపులో శేషగిరి విధులు నిర్వహిస్తున్నారు.
ఛాతిలోకి బుల్లెట్ దూసుకెవెళ్లడంతో శేషగిరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇది మిస్‌ఫైరా లేక ఆత్మహత్యనా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment