సూపర్ పవర్ ఉందంటూ..
సేలం: తనకు సూపర్ పవర్స్ ఉన్నాయంటూ ఓ కళాశాల విద్యార్థి నాలుగో అంతస్తుపై నుంచి అమాంతం కిందకు దూకి కాళ్లు, చేతులు విరగొట్టుకున్న ఘటన కోవైలో కలకలం రేపింది. కాగా, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కోవై జిల్లా మలుమిసంపట్టి సమీపంలో మైలేరిపాళయంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇందులో ఈరోడ్ జిల్లా పెరుందురై సమీపంలో ఉన్న మేక్కూర్ గ్రామానికి చెందిన యువకుడు ప్రభు (19) హాస్టల్లో బస చేసి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభు మంగళవారం సాయంత్రం అతను బస చేసి ఉన్న హాస్టల్లో నాలుగో అంతస్తుపై నుంచి అకస్మాత్తుగా కిందకు దూకాడు. దీంతో చేతులు, కాళ్లు విరిగి పోయి తీవ్రంగా గాయపడిన ప్రభును సహ విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెట్టిపాళయం పోలీసులు జరిపిన విచారణలో బాధితుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రభు అని తెలిసింది. తనకు సూపర్ పవర్ ఉందనే భ్రమలో ఉన్న ప్రభు తాను ఎంత ఎత్తయిన భవనం పై నుంచైనా దూకగలడని, తనకు ఏమీ కాదనే నమ్మకాన్ని పలు మార్లు స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఇదే విధంగా పక్క భవనం పైకి జంప్ చేసిన క్రమంలో కింద పడి గాయపడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి ప్రభు కిందకు దూకిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.Shocking, a 19-year-old #BTech #student, believed he had #superpowers and jumped off the fourth floor of the students' hostel building in #Coimbatore , #TamilNadu The student from Mekkur village near Perundurai in Erode district suffered injuries. 28/10/24 pic.twitter.com/sGXqeMyRWF— Dilip kumar @DBN (@Dilipkumar_PTI) October 30, 2024