హైదరాబాద్, సాక్షి: అల్లు అర్జున్-సుకుమార్ ‘పుష్ప-2’ చిత్ర విడుదలకు తెలంగాణ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది. అదే టైంలో బెనిఫిట్ ద్వారా వచ్చే వసూళ్ల వివరాలను తమకు తదుపరి విచారణలో అందజేయాలని ప్రొడక్షన్ హౌజ్‌ను ఆదేశించింది.
పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై హైకోర్టు విచారణ జరిగింది. బెనిఫిట్ షోపేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని, బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మల్లిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సతీష్ కోరారు. అయితే..
చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమని చెబుతూ విడుదలకు హైకోర్టు క్లియరెన్స్‌చ్చింది. పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. అలాగే.. టికెట్ ధరల పెంపు ప్రభుత్వ జీవోలను సైతం పరిశీలిస్తామన్న హైకోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరఫు న్యాయవాది సమయం కోరగా, తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నిర్దేశించిన విధంగానే టికెట్ల ధరలు కొనసాగనున్నాయి. అలాగే.. బెనిఫిట్ షో వసూళ్ల పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు హైకోర్టు స్పష్టం చేసింది.
ఇక.. రాత్రి 10గం. షోవేస్తే.. అది అయిపోయే సరికి 1గం. అవుతుందని, తద్వారా పిల్లలకు నిద్ర లేకుండా పోతుందని, వాళ్లకు నిద్ర ఎంతో అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.
వాదనలు ఇలా..
మొదటి 15రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు: పిటిషనర్ తరఫు లాయర్
భారీ బడ్జెట్‌తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చింది: మైత్రీమూవీ మేకర్స్ తరఫు లాయర్
‘ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచడానికి అనుమతించి కదా’: హైకోర్టు
టికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోంది. అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున నాలుగు గంటలకు షోలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు: పిటిషనర్ తరపు న్యాయవాది
పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఛారిటీ, సీఎం, పీఎం సహాయ నిధి ఖాతాలో వెళ్లడం లేదు. కేవలం నిర్మాత మాత్రమే లబ్ది పొందుతున్నాడు: పిటిషనర్ తరపు న్యాయవాది
టికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్‌కార్న్, మంచి నీళ్ల బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు కదా. బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే రూ.8వేలు అవుతుంది కదా: హైకోర్టు న్యాయమూర్తి
బెనిఫిట్ షో కేవలం హీరో అభిమానుల సంఘాలకు మాత్రమే. అందుకే రేట్లు పెంచారు: నిర్మాత తరపు న్యాయవాది
పుష్ప ది రూల్ స్క్రీనింగ్‌కు తెలంగాణ సర్కార్ ఇచ్చిన అనుమతులు
- డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షో
- రాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 వర్తింపు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే.
- అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి
- డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపు.
- డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపు.
- డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి
అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 2021 డిసెంబర్‌లో రిలీజ్ అయిన పుష్ప మొదటి భాగం సంచలనాలు సృష్టించగా.. ఇప్పుడు రెండో భాగం మీద భారీ అంచనాలే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment