Special Shows
-
లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా నటించిన చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్ షోలకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేవలం ఉదయం 9 గంటల తర్వాతే షో వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై లియో మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: వివాదంలో ‘లియో’.. మద్దతుగా రజనీకాంత్!) దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల తర్వాతే స్క్రీనింగ్ మొదలయ్యేలా అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. రిలీజ్ మొదటి రోజు లియో స్క్రీనింగ్ తమిళం కంటే తెలుగులోనే ముందుగా మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉదయం ఐదు గంటలు, ఏడు గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు. కాగా.. లియో సినిమాలో సంజయ్‌దత్, అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: 'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!) -
Balagam Speical Screening Photos: పల్లెల్లో బలగం క్రేజ్.. స్పెషల్ షోలు (ఫొటోలు)
-
‘మహర్షి’పై తెలంగాణ ప్రభుత్వం ఔదార్యం
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం ఔదార్యం చూపింది. రెండు వారాల పాటు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది. ఈనెల 9 నుంచి 22 వరకు ఉదయం 8-11 గంటల మధ్యలో ఒక షో అదనంగా ప్రదర్శించేందుకు తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజీవ్ త్రివేది మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. నిర్మాత దిల్ రాజు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహర్షి సినిమా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుథ, మీనాక్షి దీక్షిత్, రాజేంద్రప్రసాద్, ముఖేష్ రుషి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. కాగా, స్పెషల్ షోలకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నిర్మాతలు కోరినప్పటికీ ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. టిక్కెట్ ధరల పెంపు మహర్షి సినిమా విడుదల నేపథ్యంలో నగరంలోని సాధారణ థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను పెంచాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 80 రూపాయలున్న టికెట్ ధరను110 రూపాయలకు పెంచగా, మల్టీఫ్లెక్స్ లో ఒక్కో టికెట్ పై 50 రూపాయలు పెంచారు. అయితే టికెట్ ధరలను ప్రభుత్వ ఉత్తర్వులతోనే పెంచినట్లు యాజమాన్యాలు తెలిపాయి. పెరిగిన ధరలను ఈ శుక్రవారం నుంచి రెండు వారాలపాటు అమలు చేయనున్నట్లు వెల్లడించాయి. జీఎస్టీ, థియేటర్ నిర్వహణ ఖర్చులు భారం కావడంతో కొత్త సినిమాల విడుదల సందర్భంగా రెండు వారాలపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా. ఈ మేరకు అనుమతించిందని తెలిపాయి. నిబంధనలకు లోబడి టికెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం సూచించినట్టు పేర్కొన్నాయి. మంత్రి తలసాని విస్మయం సినిమా టికెట్ల ధరల పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 80 నుండి 110 రూపాయలు, మల్టిఫ్లెక్స్ థియేటర్ లలో 138 నుండి 200 రూపాయల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు పలువురు థియేటర్ల యాజమాన్యాలు చెప్పినట్లుగా వివిధ ప్రసార మాధ్యమాలలో చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం కొనసాగించడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. -
‘సర్కార్’కు షాక్
విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సర్కార్ సినిమాకు మరో చిక్కొచ్చిపడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు తొలిరోజు భారీగా సంఖ్యలో షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెన్నైలోని పలు థియేరట్లలో 48 గంటల పాటు కంటిన్యూస్‌గా షోస్ వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కంటిన్యూస్ షోష్ కాదు.. కనీసం ఎర్లీ మార్నింగ్ షోస్‌కు కూడా అనుమతి ఇవ్వలేదట. దీపావళి పండుగ కావటంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని అదనపు షోలకు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. దీంతో రెగ్యులర్ షోలతోనే విజయ్ తన మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కేవలం తమిళ రైట్సే 80 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, రాధారవి, ప్రేమ్‌కుమార్, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
స్టార్ హీరోల బాటలో నయన్!
తమిళసినిమా: మొదట్లో అందాలారబోతకే పరిమితమైన నటి నయనతార. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ నటనలో పరిణతి పొందుతూ స్టార్ హీరోయిన్ అంతస్తును అందుకున్నారు. అంతే అలా అంచెలంచెలుగా నటిగా తన స్థాయిని పెంచుకుంటూ మాయ, అరమ్ వంటి త్రాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల కథానాయకి అంతస్తుకు చేరుకుంది. అలా అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నయనతార ప్రస్తుతం రూ.4 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్న ఏకైక దక్షిణాది కథానాయకిగా రికార్డుకెక్కింది. నయనతార నటించిన తాజా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం కొలమావు కోకిల (కోకో). అరమ్ వంటి సంచలన చిత్రం తరువాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కావడంతో కోలమావు కోకిల చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. సాధారణంగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్స్ చిత్రాల విడుదల కోసమే అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారు. వారిని దృష్టిలో పెట్టుకునే విడుదల సమయంలో వేకువజామునే చిత్రాలను విడుదల చేస్తుంటారు. ఆ పట్టికలో నటుడు శివకార్తికేయన్ కూడా చేరారు. అదే విధంగా ఇటీవల మిర్చి శివ నటించిన తమిళ్‌పడం–2 చిత్రాన్ని కూడా ఉదయం 6 గంటల ఆటలను ప్రదర్శించారు. నయనతార కూడా స్టార్స్ జతన చేరింది. ఆమె నటించిన కోలమావు కోకిల చిత్రాన్ని శుక్రవారం నగరంలో ఉదయం 6 గంటల ఆటలను ప్రదర్శించారు. విశేషం ఏమిటంటే ఇవి విద్యార్థులకు సెలవు రోజుల్లో పండగల సమయమో కాదు. అయినా కోకో చిత్రాన్ని ఉదయం ఆటలు ప్రదర్శించడం విశేషమే అవుతుంది. ఇలా హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలు ఉదయం ఆటలు పడడం ఇదే ప్రప్రథమం అని చెప్పవచ్చు. ఆ విధంగా నయనతార ఈ చిత్రంతో స్టార్ నటులకు దీటుగా నిలిచిందనే చెప్పాలి. -
సాక్ష్యం షోలు రద్దు!
సాక్షి, హైదరాబాద్: భారీ బడ్జెట్‌తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు(జూలై 27)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఎర్లి మార్నింగ్ షోతోపాటు మార్నింగ్ షోలు కూడా దాదాపు రద్దయ్యాయి. ఇందుకు టెక్నికల్ ఇష్య్సూ కారణమని చెబుతున్నప్పటికీ.. మరోవైపు న్యాయపరమైన సమస్యలనే టాక్ వినిపిస్తోంది. నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే షోలు ఆగినట్లు సమాచారం. చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉదయం షోలు రద్దయ్యాయంట. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పటి వరకు ఈ చిత్రం షోలు పడలేదు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పడాల్సిన 8.45 గంటల షో కూడా రద్దయింది. ఏపీ, తెలంగాణల్లో మార్నింగ్ షోలు కూడా ఉండవని పలువురు సినీ జర్నలిస్టులు ట్వీట్లు చేశారు. మధ్యాహ్నానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించకుని మ్యాట్నీ షో నుంచి చిత్ర ప్రదర్శనను ప్రారంభించాలని నిర్మాత యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్‌కు డిజిటల్ ప్రింట్ అందలేదు. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల సమయంలో చిక్కులు ఎదుర్కొవటం గమనార్హం. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు విలన్. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్‌గా సాక్ష్యం తెరకెక్కింది. -
వారికోసం ఉపాసన 'స్పెషల్ షో'లు
సాక్షి, హైదరాబాద్ : రామ్‌చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమాజ సేవకురాలిగా ఎంతో మంది చిన్నారులను ఆదరిస్తున్నారు. అంతేకాదు ఉపాసన జంతు ప్రేమికురాలు కూడా. ఇందులో భాగంగానే అక్కినేని అమల నిర్వహించే బ్లూక్రాస్ సంస్థ నుంచి జంతువులను దత్తత తీసుకొని వాటి సంక్షేమ బాధ్యతలును నిర్వర్తిస్తున్నారు. వీటితో పాటు పండుగలకు, ప్రత్యేకమైన రోజుల్లో భర్త రామ్‌చరణ్‌తో కలిసి స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పలు అనాథ శరణాలయాలను సందర్శిస్తుంటారు. వారితో పాటు కలిసి ఆడుతూ పాడుతుంటారు. వారికోసం పలుసార్లు చరణ్ నటించిన సినిమాలను ప్రత్యేకంగా ఉచిత షోలను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగానే ఉపాసన మరోసారి తన మంచితనం చాటుకున్నారు. హైదారాబాద్‌కు చెందిన ఆశ్రయ ఆకృతి అనే స్వచ్చంద సంస్థకు చెందిన వినికిడి లోపంతో బాధపడుతున్న దివ్యాంగ చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవలే విడుదైల బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతున్న రంగస్థలం సినిమాను ప్రత్యేక షోలను ఉపాసన ఏర్పాటుచేశారు. దగ్గరుండీ మరీ వారికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకున్నారు. వారితో పాటు సినిమా చూసి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఇక రంగస్థలం విషయానికి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్‌లో ఇప్పటికే 2.5 మిలియన్ల మార్క్‌ను సైతం దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం చిట్టిబాబు హవా కొనసాగుతోంది. మూడో రోజైన ఆదివారం కూడా సుమారు రూ.10 కోట్లపైనే వసూలు చేసిందని టాలీవుడ్ టాక్. -
వారం ముందే స్పైడర్?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాక, హిందీ సినిమా మాత్రమే పరిచయమున్న ప్రేక్షకుడికి కూడా తెలిసిన పేరు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘స్పైడర్’ దసరా సీజన్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మధ్యే ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేకుండా ‘ష్...’ అంటూ వచ్చిన ఈ చిత్రం టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ రాబడుతోంది. దీంతో ‘స్పైడర్’ పై బాలీవుడ్లో కూడా క్రేజ్ వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ హిందీలో అనువదించి, విడుదల చేయాలనుకుంటోందట. రిలీజ్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇంకో విషయం ఏంటంటే... బాలీవుడ్ ప్రముఖులకు, మీడియా వారికీ రిలీజ్‌కు ఓ వారం ముందే స్పెషల్ షోస్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో టీమ్ ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.