వారికోసం ఉపాసన 'స్పెషల్‌ షో'లు | Rangasthalam Special Shows Arranged By Upasana For Divyang Childrens | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల కోసం రంగస్థలం ప్రత్యేక షోలు

Published Mon, Apr 2 2018 6:28 PM | Last Updated on Mon, Apr 2 2018 6:29 PM

Rangasthalam Special Shows Arranged By Upasana For Divyang Childrens - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమాజ సేవకురాలిగా ఎంతో మంది చిన్నారులను ఆదరిస్తున్నారు. అంతేకాదు ఉపాసన జంతు ప్రేమికురాలు కూడా. ఇందులో భాగంగానే అక్కినేని అమల నిర్వహించే బ్లూక్రాస్‌ సంస్థ నుంచి జంతువులను దత్తత తీసుకొని వాటి సంక్షేమ బాధ్యతలును నిర్వర్తిస్తున్నారు. వీటితో పాటు పండుగలకు, ప్రత్యేకమైన రోజుల్లో భర్త రామ్‌చరణ్‌తో కలిసి స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పలు అనాథ శరణాలయాలను సందర్శిస్తుంటారు. వారితో పాటు కలిసి ఆడుతూ పాడుతుంటారు. వారికోసం పలుసార్లు చరణ్‌ నటించిన సినిమాలను ప్రత్యేకంగా ఉచిత షోలను ఏర్పాటు చేస్తారు.

ఇందులో భాగంగానే ఉపాసన మరోసారి తన మంచితనం చాటుకున్నారు. హైదారాబాద్‌కు చెందిన ఆశ్రయ ఆకృతి అనే స్వచ్చంద సంస్థకు చెందిన వినికిడి లోపంతో బాధపడుతున్న దివ్యాంగ చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవలే విడుదైల బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతున్న రంగస్థలం సినిమాను ప్రత్యేక షోలను ఉపాసన  ఏర్పాటుచేశారు. దగ్గరుండీ మరీ వారికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకున్నారు. వారితో పాటు సినిమా చూసి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు.

ఇక రంగస్థలం విషయానికి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్‌లో ఇప్పటికే 2.5 మిలియన్ల మార్క్‌ను సైతం దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం చిట్టిబాబు హవా కొనసాగుతోంది. మూడో రోజైన ఆదివారం కూడా సుమారు రూ.10 కోట్లపైనే వసూలు చేసిందని టాలీవుడ్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement