‘సర్కార్‌’కు షాక్‌ | Huge Disappointment For Vijay Sarkar Fans | Sakshi
Sakshi News home page

Nov 3 2018 4:16 PM | Updated on Nov 3 2018 4:16 PM

Huge Disappointment For Vijay Sarkar Fans - Sakshi

విజయ్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సర్కార్‌ సినిమాకు మరో చిక్కొచ్చిపడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు తొలిరోజు భారీగా సంఖ్యలో షోస్‌ వేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. చెన్నైలోని పలు థియేరట్లలో 48 గంటల పాటు కంటిన్యూస్‌గా షోస్‌ వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ప్రభుత్వం విజయ్ అభిమానులకు షాక్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కంటిన్యూస్‌ షోష్ కాదు.. కనీసం ఎర్లీ మార్నింగ్‌ షోస్‌కు కూడా అనుమతి ఇవ్వలేదట. దీపావళి పండుగ కావటంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని అదనపు షోలకు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. దీంతో రెగ్యులర్‌ షోలతోనే విజయ్‌ తన మార్కెట్‌ స్టామినా ప్రూవ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కేవలం తమిళ రైట్సే 80 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. విజయ్‌ సరసన కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాధారవి, ప్రేమ్‌కుమార్‌, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement