
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా నటించిన చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్ షోలకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేవలం ఉదయం 9 గంటల తర్వాతే షో వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై లియో మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
(ఇది చదవండి: వివాదంలో ‘లియో’.. మద్దతుగా రజనీకాంత్!)
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల తర్వాతే స్క్రీనింగ్ మొదలయ్యేలా అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. రిలీజ్ మొదటి రోజు లియో స్క్రీనింగ్ తమిళం కంటే తెలుగులోనే ముందుగా మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉదయం ఐదు గంటలు, ఏడు గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు.
కాగా.. లియో సినిమాలో సంజయ్‌దత్, అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.
(ఇది చదవండి: 'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!)
Comments
Please login to add a commentAdd a comment