విజయ్‌పై త్రిష ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ | Trisha Interesting Comments On Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌పై త్రిష ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published Wed, Mar 6 2024 11:00 AM | Last Updated on Wed, Mar 6 2024 12:30 PM

Trisha Interesting Comments On Vijay - Sakshi

తమిళసినిమా: నాలుగు పదుల వయసులోనూ ప్రేక్షకులను అలరిస్తుస్తూ కథానాయిక రాణిస్తున్నారు నటి త్రిష. అంతే కాకుండా ఇప్పుటికీ పలు భాషల్లో అగ్ర కథా నాయకుల సరసన నటిస్తూ బిజీగా ఉన్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఈమె. అన్నీ కుదిరితే 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో మునిగిపోయేవారు. ఇక నిర్మాత, వ్యాపారవేత్త అయిన అరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్థం, పెళ్లి పీటల వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరువాత పెళ్లి మాట ఎత్తని త్రిష నటనపైనే దృష్టి సారించారు. అలా మధ్యలో నటిగా వెనుకబడినా, చిన్న గ్యాప్‌ తరువాత గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుల్‌ఫామ్‌లోకి వచ్చారు. అందుకు కారణం దర్శకుడు మణిరత్నం అని చెప్పకతప్పదు.

పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో ఆయన ఓ అవకాశం ఇచ్చి నటిగా త్రిషకు పునర్జన్మనే ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఈ చైన్నె చిన్నది కూడా సద్వినియోగం చేసుకున్నారు. యువరాణి కుందవైగా రాజఠీవీని ప్రదర్శించి ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ఆ తరువాత విజయ్‌కు జంటగా లియో చిత్రంలో నటించి తన పూర్వ వైభవాన్ని చాటుకున్నారు. ఈమె ఇంతకు ముందు విజయ్‌ సరనన గిల్లీ, ఆదీ, తిరుపాచ్చి, కురువి చిత్రాల్లో నటించారు. మళ్లీ 14 ఏళ్ల తరువాత లియో చిత్రం ఈ జంట కలిసి నటించారు. దీంతో వీరిద్దరి గురించి వదంతులు దొర్లుతున్నాయి.

అయితే వాటిలో నిజమెంత అన్నది తెలియదు కానీ, ఇటీవల ఒక భేటీలో విజయ్‌ గురించి నటి త్రిష మాట్లాడుతూ విజయ్‌ తానూ పలు చిత్రాల్లో కలిసి నటించినట్లు చెప్పారు. అయితే గిల్లీ చిత్రానికి ముందు వరకూ అందరూ చెప్పుకుంటున్నట్లు కాదన్నారు. విజయ్‌ చాలా నెమ్మదస్తుడని పేర్కొన్నారు. గిల్లీ చిత్రం తరువాత తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అయ్యామని చెప్పారు. కాగా ఈ చైన్నె బ్యూటీ ప్రస్తుతం అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్‌ సరసన థగ్‌ లైఫ్‌ చిత్రాలతో 40 ఏళ్ల వయసులోనూ బిజీబీజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement