విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో లియో సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్‌లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కోలీవుడ్‌లో మాత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. విజయ్ కెరియర్‌లో మరో హిట్ సినిమాగా నిలిచింది. విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలిచింది. అలాగే కోలీవుడ్‌లో తొలిరోజు తెల్లవారుజామున ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతులివ్వలేదు. వీటన్నింటి మధ్య కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించడంతో లియో మేకర్స్ గ్రాండ్‌గా అభిమానుల మధ్య విజయోత్సవ వేడుకను కూడా జరుపుకున్నారు.
తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో లియో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లియో చిత్రాన్ని చూడని ప్రేక్షకులు ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
కథేంటి?
పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్‌కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ పార్తిబన్ ఎవరు? లియో ఎవరు? అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది సినిమా కథ
Comments
Please login to add a commentAdd a comment