special show
-
పదహారేళ్లలోపు పిల్లలను అనుమతించొద్దు
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్లలోపు పిల్లలను ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో సినిమాల ప్రత్యేక ప్రదర్శనకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేళాపాళా లేని రాత్రి ప్రదర్శనలు పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై అన్ని వర్గాలతో చర్చించి చట్ట ప్రకారం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు థియేటర్ల యజమానులు 16 ఏళ్లలోపు పిల్లలను ఆయా వేళల్లో సినిమా ప్రదర్శలనకు అనుమతించొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రత్యేక షోలకు వేకువజామున 4 గంటల నుంచి మొదలుకుని 6 షోలకు అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్ లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టి.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు వాయిదా వేశారు. -
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో తెలుగు వీణ సందడి
పరాంకుశం వీణాశ్రీవాణి... ఆమె పేరులోనే సరిగమల శ్రుతి వినిపిస్తోంది. అమలాపురంలో ఓ చిన్న అగ్రహారం అమ్మాయి శ్రుతి చేసిన వీణ ఇప్పుడు అంబానీ ఇంటి వేడుకలో సరిగమలతో అలరించింది. ఆ ఆనంద క్షణాలను ఆమె సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు. ‘‘మాది అమలాపురం జిల్లా ఇందుపల్లి అగ్రహారం. బండారులంకలోని పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చు కున్నాను. ఈ రోజు ఇన్ని ప్రశంస లందుకుంటున్నానంటే ఆమె నేర్పిన సంగీత జ్ఞానమే కారణం. అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకకు వీణావాదన చేయడానికి ఆహ్వానం రావడంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా పేరు వాళ్లకు తెలిసే అవకాశమే లేదు. నేను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం వల్లనే నా కళను వారు గుర్తించడానికి కారణం అనుకుంటున్నాను. నీతా అంబానీ గారు చె΄్పారు అంటూ వాళ్ల మేనేజరో ఎవరో కాంటాక్ట్ చేశారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం నుంచి వేడుకలో ఏ ΄ాటలు కావాలో కూడా ఆమే ఎంపిక చేశారు. నేనిచ్చిన జాబితా నుంచి ఆమె ఎంపిక చేసిన పది ΄ాటలను వీణ మీద వినిపించాను. నా చెలి రోజావే, ఉరికే చిలకా... వంటి పలు భాషల్లోకి అనువాదమై ఉన్న ΄ాటలనే ఎంచుకున్నాను. ఇదంతా పదిహేను రోజులపాటు నడిచింది. రెండు కళ్లు చాలవు!ఆడిటోరియానికి వెళ్లే దారిలో ఒక వరుస అత్తరులు, ఇత్తడి బిందెలతో గుజరాత్ సంప్రదాయ నమూనా అలంకరణ ఉంది. ఆ తర్వాత ధొలారి ధని థీమ్, ఫారెస్ట్ థీమ్, కలంకారీ థీమ్ ఓ వరుస ఉన్నాయి. శంకర్ మహదేవన్, శ్రేయాఘోషాల్, శివమణి వంటి సంగీతకారులు, గాయకుల ప్రోగ్రామ్‌లను టీవీ లైవ్ లో చూశాను. వందమంది రాజమౌళిలు, వంద మంది సంజయ్ లీలా భన్సాలీలు కలిసి సెట్టింగు వేయించారా అనిపించింది. చూడడానికి రెండు కళ్లు చాలవు. తలను 360 డిగ్రీల్లో తిప్పి చూడాల్సిందే. బారాత్ తర్వాత పెళ్లికి ముందు హై టీ టైమ్‌లో రాత్రి ఏడు నుంచి ఏడు ముప్పావు వరకు నా కచేరీ సాగింది. రాధిక మర్చంట్ కుటుంబం, అంబానీ కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి. వాళ్లు కదలకుండా కూర్చుని, ఓ పాటను మళ్లీ అడిగి మరీ చక్కగా ఆస్వాదించడం, కళల పట్ల వారికున్న గౌరవం నాకు సంతృప్తినిచ్చింది. నాలుగు వేల అడుగులు పన్నెండవ తేదీ ఉదయం ముంబయికి వెళ్లాం. హోటల్లో రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా జియో కన్వెన్షన్ సెంటర్‌కెళ్లాం. ఆ సెంటర్ ఎంట్రన్స్ నుంచి నా ప్రదర్శన ఉన్న ఆడిటోరియంలో వేదిక వద్దకు చేరడానికి నాలుగు వేల అడుగులు పడ్డాయి. ఫోన్లో చెక్ చేసుకున్నాను కూడా. నిర్వహకులు వెంట ఉండి తీసుకెళ్లకపోతే నా వేదిక ఏదో తెలుసుకోవడంతోనే రోజు పూర్తయ్యేదేమో. నీతా అంబానీ స్వయంగా కళాకారిణి కావడంతో ఈ వేడుకలో కళాప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారనుకున్నాను. భోజనాల దగ్గర కూడా ఆర్టిస్టుల కోసమే ఒక పెద్ద హాలును కేటాయించారు. వేల రకాల వంటలు వడ్డించారని విన్నాను. కానీ నేను సలాడ్లు, కాఫీ మాత్రమే తీసుకున్నాను. పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఎంత శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకున్నారంటే డెకరేషన్లో ఉన్న పూలను కూడా పరిశీలించి థీమ్‌కి అనుగుణంగా మార్పించారు. కొన్ని రోజులపాటు ఆమె మధ్యాహ్నం మూడు నుంచి తెల్లవారి ఆరుగంటల వరకు పని చేశారట. అయినా సరే ఆమె ముఖంలో అలసట కనిపించలేదు. గొప్ప ఆర్గనైజర్ ఆమె. వీణావాణి ఇచ్చిన వరం జనసందోహంలో నేను ఎక్కువ సేపు ఇమడలేను. నా కచేరీ పూర్తి కాగానే నన్ను బయటకు తీసుకెళ్లమని నిర్వహకులను అడిగాను. గేటు వరకు తీసుకొచ్చి వెహికల్ ఎక్కించేశారు. పదమూడవ తేదీ ఉదయం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌కి వచ్చేసి హమ్మయ్య అనుకున్నాను. నాకిప్పుడు తలుచుకున్నా సరే అంతా కలలా అనిపిస్తోంది. ఆంధ్రుల ఆడపడుచుని, తెలంగాణ కోడలిని. నాకు తెలిసినంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకలో కళను ప్రదర్శించిన ఏకైక వ్యక్తిని నేనే... అనుకున్నప్పుడు గర్వంగా అనిపిస్తోంది. సరస్వతీ మాత వీణతోపాటు నాకిచ్చిన వరం ఈ అవకాశం అనుకుంటున్నాను’’ అని రెండు చేతులూ జోడించారు వీణాశ్రీవాణి తన వీణను మురిపెంగా చూసుకుంటూ.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా నటించిన చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్ షోలకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేవలం ఉదయం 9 గంటల తర్వాతే షో వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై లియో మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: వివాదంలో ‘లియో’.. మద్దతుగా రజనీకాంత్!) దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల తర్వాతే స్క్రీనింగ్ మొదలయ్యేలా అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. రిలీజ్ మొదటి రోజు లియో స్క్రీనింగ్ తమిళం కంటే తెలుగులోనే ముందుగా మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉదయం ఐదు గంటలు, ఏడు గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు. కాగా.. లియో సినిమాలో సంజయ్‌దత్, అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: 'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!) -
నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సునీత ఆత్మ విశ్వాసంతో ముందకెళ్లారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సునీత మాట్లాడుతూ... 'ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూశా. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా. ఈ సినిమాలో పాత్రలను కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూశాక గుండె బరువెక్కిపోయింది. అంతే కాకుండా గుబులు మొదలైంది. కానీ ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉంటే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది. ఇలాంటివి డైరెక్టర్ కృష్ణవంశీకే సాధ్యం. రంగమార్తాండ మూవీ చాలా బాగుంది. మీరందరూ కూడా కచ్చితంగా ఈ సినిమా చూడండి. మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి'. అంటూ ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి:కేజీఎఫ్ హీరోయిన్ను వేధించిన యశ్?.. క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి) కాగా..సునీతకు తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఆయన తెరకెక్కించిన 'రంగ మార్తాండ' ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఆయన భార్య రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. సినీ ప్రముఖుల కోసం ఈ చిత్రం స్పెషల్ షోను ప్రదర్శించారు. ఈ సినిమా వీక్షించిన సింగర్ సునీత ఎమోషనలయ్యారు. ఇలాంటి సినిమా చూస్తుంటే తన గుండెలో గుబులు మొదలైందని అన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
సంధ్య థియేటర్లో మెగా హీరో రచ్చ.. వీడియో వైరల్
మెగా మేనల్లుడు, ‘సుప్రీమ్’ హీరో సాయి ధరమ్ తేజ్ థియేటర్లో రచ్చ రచ్చ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ రోజు(సెప్టెంబర్ 2న) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా పవన్ సూపర్ హిట్ చిత్రాలైన తమ్ముడు, జల్సా సినిమాలను పలు థియేటర్లో రీరిలీజ్ చేస్తూ స్పెషల్ షోలను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లోకి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ నేడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లో జల్సా స్పెషల్ షోను ప్రదర్శించారు. చదవండి: లైగర్ ఫ్లాప్.. ఆ వాటాతో సహా భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్ ఈ సందర్భంగా మేనమామ చిత్రాన్ని చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్లో రచ్చ చేశాడు. తెరపైకి కాగితాలు విసురుతూ సినిమాను సాధారణ అభిమానిగా తేజ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఆయన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా సాయి ధరమ్ తేజ్ ఎన్నో సందర్భాల్లో తాను పవన్ కల్యాణ్‌కి వీరాభిమానిని అని చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ట్రెడిషనల్ లుక్‌లో తారక్ భార్య, కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ప్రణతి Fan Boy @IamSaiDharamTej Anna❤️❤️❤️❤️#HBDJanasenani #HBDJanasenaniPawanKalyan#PSPK #Jalsa4KCelebrations #SaiDharamTej pic.twitter.com/be6WsgGm6c — Bhavani (@Bhavani00285593) September 2, 2022 -
'సర్కారు వారి పాట'కు 'సర్కారు' గుడ్ న్యూస్.. ఆరోజు 6 షోలు
Telangana Government Permission To Sarkaru Vaari Paata Special Show: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మూవీ స్పెషల్ షోకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూవీ విడుదల రోజు అంటే మే 12న ఉదయం 4 గంటలకే ఒక స్పెషల్ షో ప్రదర్శించుకేందుకు అనుమతినిచ్చింది. అయితే ఈ స్పెషల్ షోను కేవలం నాలుగు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లీ కార్జున, విశ్వనాథ్ థియేటర్లు, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించనున్నారు. ఇవి కాకుండా ఇతర థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. సర్కారు వారి పాట సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విజ్ఞప్తి మేరకు ఈ సినిమాను మే 12న ఒక స్పెషల్ షోను నిర్వహించుకునేందుకు అనిమతి ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా పేర్కొన్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పెంపు కూడా వారం రోజులు అంటే మే 12 నుంచి 18 వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అయితే గురువారం (మే 12) ఒక్క రోజు మాత్రం హైదరాబాద్‌లో ఆరు షోలు పడనున్నాయి. చదవండి: సర్కారు వారి పాట: మ.. మ.. మహేశా పూర్తి పాట చూశారా ! ‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కీర్తి సురేష్ సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్‌కు చూపిస్తారట!
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో ప్రదర్శించనున్నారట. నిర్మాత సుధీర్ చంద్ర పాదిరి తన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్, ఆది శెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో కీర్తి అభిమానుల నుంచి విడుదల విషయమై నిర్మాతకి ప్రశ్నలు ఎదురయ్యాయట. దీంతో నిర్మాత సుధీర్ చంద్ర 50 మంది అభిమానులను ఎంపిక చేసి ఈ సినిమాను చూపించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ క్రమంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ముందే ఎడిటింగ్ రూమ్‌లో స్పెషల్ షో ప్రదర్శించబోతున్నారు. ఈ వార్త విన్నప్పటి నుంచి కీర్తి అభిమానులు ఈ చిత్రం స్పెషల్ షో తేదీని ఎప్పుడు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఈ అమ్మడు నటించిన పెంగ్వి, మిస్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో విడుదల వరకు వేచి చూడాల్సిందే. I will personally invite everyone whoever is asking me for a update to see the film in my edit room soon. Say who! — Sudheer Chandra (@sudheerbza) June 25, 2021 చదవండి: స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో, ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా? -
ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది
‘‘పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ మనస్ఫుర్తిగా రాస్తే చాలా అద్భుతంగా సినిమా తీస్తాడు. ఆ విషయం ఇది వరకు చాలాసార్లు ప్రూవ్ అయింది. ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది. జెన్యూన్ లవ్‌స్టోరీ తీశాడు’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆకాశ్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెహబూబా’. శ్రీ వెంకటేశ్వర రిలీజ్ బ్యానర్‌పై వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రేపు విడుదల కానుంది. బుధవారం ‘మెహబూబా’ సినిమా స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నప్పుడు జనరల్ ఆడియన్స్‌కు చూపిస్తే జనరల్ టాక్ తెలుస్తుందని పబ్లిక్ షో ఏర్పాటు చేశాం. నేనూ, పూరి కలసి రెండు సినిమాలు చేశాం (ఇడియట్, పోకిరి) రెండూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. మామూలుగా పూరి సినిమాల్లో ఒక సెటైర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏమీ ఉండదు’’ అని అన్నారు. పూరి మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుగారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నిజంగానే చాలా సంవత్సరాల తర్వాత జెన్యూన్‌గా సినిమా తీశాను. పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మా కాంబినేషన్లో వచ్చిన ఇడియట్, పోకిరి పెద్ద హిట్లు. ఈ సినిమా కూడా అదే రేంజ్లో అవుతుందనుకుంటున్నాను. ఆడియన్స్ ఒక చోట నవ్వుతారు అనుకుంటే నాలుగు చోట్ల నవ్వుతున్నారు. స్పెషల్ థ్రిల్ కలిగింది. అమేజింగ్ రెస్పాన్స్’’ అన్నారు. చార్మి మాట్లాడుతూ – ‘‘ఈ షో తర్వాత ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు యూఎస్‌లో ఫస్ట్ ప్రీమియర్‌ను టీమ్ అంతా కలసి చూస్తాం. యూఎస్‌లో 2 వీక్స్ టూర్ చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పురోహితుల కోసం ‘జై సింహా’ స్పెషల్ షో
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో జై సింహా మంచి విజయం సాధించటంపై చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. వరుసగా సంక్రాంతి బరిలో సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ జై సింహాతో మరోసారి సంక్రాంతి స్టార్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమాలో బ్రాహ్మణులకు సంబంధించి బాలకృష్ణ చెప్పిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మాణులు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బాలయ్యతో సహా చిత్రయూనిట్ ను అభినందించారు. తాజాగా బాలకృష్ణ అభిమానులు అనంతపురంలోని గౌరీ థియేటర్లో పురోహితుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ షోకు అభిమాన సంఘం నాయకులతో పాటు చిత్ర హీరోయిన్ హరిప్రియ హజరయ్యారు. జనవరి 12 రిలీజ్ అయిన జై సింహా ఇప్పటి మంచి వసూళ్లును సాధిస్తోంది. -
వీరికి 'రాజా ది గ్రేట్' ఫ్రీ.. ప్రీమియర్ షో
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ శాఖ పరిధిలోని సదనాలు, వసతిగృహాల్లో ఉంటున్న దివ్యాంగులకు ఇటీవల విడుదలైన ‘రాజా ది గ్రేట్’ తెలుగు సినిమా ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35ఎంఎం సినిమాహాలులో ఆదివారం ఉదయం 11 గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు. దివ్యాంగుడి నేపథ్యంతో సాగే ఈ సినిమాలో హీరో విజయం సాధించిన తీరును వివరించేందుకు షోను ఏర్పాటు చేసినట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ బి.శైలజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీమియర్ షో అనంతరం హీరో రవితేజతో దివ్యాంగ పిల్లల ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
కోహ్లీని భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా..?
సాక్షి, న్యూఢిల్లీ: క్రీజులోకి దిగితే బౌలర్లకు చుక్కలు చూపించే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లు వేసిన బంతిని అంతే వేగంతో ఏమాత్రం కనికరం లేకుండా బంతులను బౌండరీలకు తరలిస్తాడు. అందుకే కోహ్లీకి పరుగుల యంత్రం అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. క్రీజులో కుదురుకుంటే చాలు సెంచరీలతో చెలరేగిపోతాడు. అటువంటి కోహ్లీని భయపెట్టిన బౌలర్ ఉన్నాడంటే నమ్ముతారా? కానీ అది నిజం. విరాట్ ఓ బౌలర్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడ్డాడంట. 2011లో శ్రీలంకతో జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్లో 31 పరుగులకే సచిన్, సెహ్వాగ్‌ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ గంభీర్ సాయంతో 83 పరుగులు జోడించి 35పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. అప్పుడు కోహ్లీ అందించిన ఆ భాగస్వామ్యం ప్రపంచకప్ గెలవడంలో కీలకమైంది. ఇటీవల అమీర్‌ఖాన్ వ్యాఖ్యాతగా త్వరలో ప్రసారం కానున్న టీవీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కోహ్లీ తనను భయపెట్టిన బౌలర్ గురించి తెలిపాడు. 2011ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో లసిత్ మలింగ యార్కర్లను ఎదుర్కోవడానికి భయపడ్డానని చెప్పాడు. రెండు మూడు బంతులు ఆడిన తర్వాతనే క్రీజులో కుదురకున్నానని చెప్పాడు. దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో పలు అంశాలను అమీర్‌తో కలిసి బుల్లితెరపై పంచుకున్నాడు. ఈసందర్భంగా తన ప్రేయసి అనుష్క శర్మ గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
బాహుబలి 2 స్పెషల్ షో రద్దు
ముంబయి: ముంబయిలో బాహుబలి-2 ప్రత్యేక ప్రదర్శనను రద్దు చేశారు. ఈ మేరకు బాహుబలి చిత్రం హిందీ హక్కులు తీసుకున్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ప్రకటించారు. బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతి నేపథ్యంలో ఆయనకు సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో బాలీవుడ్ సీని ప్రముఖులకు వేసే ప్రత్యేక ప్రదర్శన కూడా ఆగిపోయింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు 'వినోద్ ఖన్నా' గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బ్లాడర్ క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. 1968లో సినీ రంగ ప్రవేశం చేసిన వినోద్ ఖన్నా తనదైన నటన..డైలాగ్స్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత హీరోగా మారి 141 చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం 'దిల్ వాలే'. -
వారి కోసం 'బాహుబలి' స్పెషల్ షో
హైదరాబాద్ : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'బాహుబలి' చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు తిలకించారు. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ సినిమాను గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్‌తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. కాగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న బాహుబలి సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. -
ప్రభుదేవా కొత్త స్టెప్!
హిందీ సినీ రంగంలో దర్శకత్వంతో తెగ బిజీగా ఉన్న ప్రభుదేవా ఇప్పుడు తమిళంలో ఒక సినిమా నిర్మించనున్నారట! లక్ష్మణ్ దర్శకత్వంలో ‘జయం’ రవి నటించిన తాజా తమిళ హిట్ ‘రోమియో - జూలియట్’ చూసి, తెగ ఇంప్రెస్ అయిన ప్రభుదేవా అదే దర్శక - హీరోల కాంబినేషన్లో తమిళంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారట! ‘జయం’ రవి, విజయ్ సేతుపతి ఆ సినిమాలో నటించనున్నారు. ‘‘ప్రభుదేవా కోసం ‘రోమియో-జూలియట్’ స్పెషల్ షో వేశాం. ఆ సినిమా, అందులో దర్శకత్వ ప్రతిభ చూసి, దాన్ని వేరే భాషలో రీమేక్ చేయడానికి ప్రభుదేవా ముందుకొచ్చారు. ఇంతలో దర్శకుడు లక్ష్మణ్ కొత్త స్క్రిప్ట్ చెప్పారు. అది బాగా నచ్చి, వెంటనే ఆ స్క్రిప్ట్‌ను తానే వెండితెరపై నిర్మిస్తానని ప్రభుదేవా చెప్పారు’’అని కోడంబాకమ్ వర్గాల కథనం. మొత్తానికి, మంచి కథలు దర్శకుల్ని కూడా నిర్మాతలుగా మారుస్తాయి కదూ! -
'సాలార్ జంగ్'లో 14 నుంచి పత్యేక ప్రదర్శన
చార్మినార్ (హైదరాబాద్): మూడో సాలార్జంగ్ అయిన నవాబ్ మీర్ యూసఫ్ అలీఖాన్ బహద్దూర్ 126వ జయంతి ఉత్సవాలను ఈ నెల 14 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు సాలార్జంగ్ మ్యూజియం డెరైక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14 సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మీర్ తురబ్ అలీ ఖాన్, మీర్ లాయక్ అలీ ఖాన్, మీర్ యూసఫ్ అలీ ఖాన్ అనే వారు నిజాముల వద్ద ప్రధానమంత్రులుగా పనిచేశారు. సాలార్జంగ్ అనేది నిజాం ప్రభువులు వారికి ఇచ్చిన బిరుదు. ఐరోపా, మధ్య ఆసియాలోని 36 దేశాల నుంచి వారు సేకరించిన సుమారు 43 వేల వస్తువులను, 50 వేలకు పైగా పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను సాలార్జంగ్ మ్యూజియంలో పర్యాటకుల సందర్శనార్థం ఉంచారు. -
పాటే మంత్రం 2
-
పాటే మంత్రం 1