మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో ప్రదర్శించనున్నారట. నిర్మాత సుధీర్ చంద్ర పాదిరి తన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.
నగేశ్ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్, ఆది శెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో కీర్తి అభిమానుల నుంచి విడుదల విషయమై నిర్మాతకి ప్రశ్నలు ఎదురయ్యాయట. దీంతో నిర్మాత సుధీర్ చంద్ర 50 మంది అభిమానులను ఎంపిక చేసి ఈ సినిమాను చూపించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఈ క్రమంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ముందే ఎడిటింగ్ రూమ్‌లో స్పెషల్ షో ప్రదర్శించబోతున్నారు. ఈ వార్త విన్నప్పటి నుంచి కీర్తి అభిమానులు ఈ చిత్రం స్పెషల్ షో తేదీని ఎప్పుడు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఈ అమ్మడు నటించిన పెంగ్వి, మిస్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో విడుదల వరకు వేచి చూడాల్సిందే.
I will personally invite everyone whoever is asking me for a update to see the film in my edit room soon. Say who!
— Sudheer Chandra (@sudheerbza) June 25, 2021
చదవండి: స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో, ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా?
Comments
Please login to add a commentAdd a comment