
Telangana Government Permission To Sarkaru Vaari Paata Special Show: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మూవీ స్పెషల్ షోకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూవీ విడుదల రోజు అంటే మే 12న ఉదయం 4 గంటలకే ఒక స్పెషల్ షో ప్రదర్శించుకేందుకు అనుమతినిచ్చింది. అయితే ఈ స్పెషల్ షోను కేవలం నాలుగు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లీ కార్జున, విశ్వనాథ్ థియేటర్లు, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించనున్నారు. ఇవి కాకుండా ఇతర థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.
సర్కారు వారి పాట సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విజ్ఞప్తి మేరకు ఈ సినిమాను మే 12న ఒక స్పెషల్ షోను నిర్వహించుకునేందుకు అనిమతి ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా పేర్కొన్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పెంపు కూడా వారం రోజులు అంటే మే 12 నుంచి 18 వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అయితే గురువారం (మే 12) ఒక్క రోజు మాత్రం హైదరాబాద్‌లో ఆరు షోలు పడనున్నాయి.
చదవండి: సర్కారు వారి పాట: మ.. మ.. మహేశా పూర్తి పాట చూశారా !
‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్