'సర్కారు వారి పాట' విజయంపై మహేశ్ బాబు స్పందన.. | Mahesh Babu Reaction On Sarkaru Vaari Paata Movie Success | Sakshi
Sakshi News home page

Mahesh Babu: 'సర్కారు వారి పాట' విజయంపై మహేశ్ బాబు స్పందన..

Published Wed, May 18 2022 3:15 PM | Last Updated on Wed, May 18 2022 3:20 PM

Mahesh Babu Reaction On Sarkaru Vaari Paata Movie Success - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది.

Mahesh Babu Reaction On Sarkaru Vaari Paata Movie Success: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్‌, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్‌ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. 

'సర్కారు వారి పాట' ఘన విజయంపై మహేశ్‌ బాబు స్పందించారు. చిత్రాన్ని సూపర్‌ హిట్‌ చేసినందుకు ఫ్యాన్స్‌కు, తనకు అద్భుతమైన మూవీని అందించిన తన టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్‌ పరశురామ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. 'సర్కారు వారి పాట చిత్రానికి వెల్లువెత్తుతున్న ప్రేమతో పొంగిపోయాను. మూవీని బ్లాక్‌ బ్లస్టర్‌ సక్సెస్‌ చేసినందుకు నా సూపర్‌ అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.' అని ట్వీట్‌ చేశారు మహేశ్‌ బాబు. 
 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement