
మెగా మేనల్లుడు, ‘సుప్రీమ్’ హీరో సాయి ధరమ్ తేజ్ థియేటర్లో రచ్చ రచ్చ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ రోజు(సెప్టెంబర్ 2న) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా పవన్ సూపర్ హిట్ చిత్రాలైన తమ్ముడు, జల్సా సినిమాలను పలు థియేటర్లో రీరిలీజ్ చేస్తూ స్పెషల్ షోలను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లోకి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ నేడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లో జల్సా స్పెషల్ షోను ప్రదర్శించారు.
చదవండి: లైగర్ ఫ్లాప్.. ఆ వాటాతో సహా భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్
ఈ సందర్భంగా మేనమామ చిత్రాన్ని చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్లో రచ్చ చేశాడు. తెరపైకి కాగితాలు విసురుతూ సినిమాను సాధారణ అభిమానిగా తేజ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఆయన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా సాయి ధరమ్ తేజ్ ఎన్నో సందర్భాల్లో తాను పవన్ కల్యాణ్‌కి వీరాభిమానిని అని చెప్పిన సంగతి తెలిసిందే.
చదవండి: ట్రెడిషనల్ లుక్‌లో తారక్ భార్య, కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ప్రణతి
Fan Boy @IamSaiDharamTej Anna❤️❤️❤️❤️#HBDJanasenani #HBDJanasenaniPawanKalyan#PSPK #Jalsa4KCelebrations #SaiDharamTej pic.twitter.com/be6WsgGm6c
— Bhavani (@Bhavani00285593) September 2, 2022