Singer Sunitha Review On Rangamarthanda Movie Premier Show - Sakshi

Sunitha: ఆ సినిమా చూసి నా గుండె బరువెక్కింది.. సింగర్ సునీత ఎమోషనల్

Mar 17 2023 4:10 PM | Updated on Mar 17 2023 4:54 PM

Singer Sunitha Review On Rangamarthanda Movie - Sakshi

సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్‌లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సునీత ఆత్మ విశ్వాసంతో ముందకెళ్లారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

ఆ వీడియోలో సునీత మాట్లాడుతూ... 'ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూశా. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా. ఈ సినిమాలో పాత్రలను కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూశాక గుండె బరువెక్కిపోయింది. అంతే కాకుండా గుబులు మొదలైంది. కానీ ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉంటే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది. ఇలాంటివి  డైరెక్టర్ కృష్ణవంశీకే సాధ్యం. రంగమార్తాండ మూవీ చాలా బాగుంది. మీరందరూ కూడా కచ్చితంగా ఈ సినిమా చూడండి. మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి'. అంటూ ఎమోషనల్ అయ్యారు.

(ఇది చదవండి:కేజీఎఫ్‌ హీరోయిన్‌ను వేధించిన యశ్‌?.. క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి)

కాగా..సునీతకు తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఆయన తెరకెక్కించిన 'రంగ మార్తాండ' ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఆయన భార్య రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. సినీ ప్రముఖుల కోసం ఈ చిత్రం స్పెషల్ షోను ప్రదర్శించారు. ఈ సినిమా వీక్షించిన సింగర్ సునీత ఎమోషనలయ్యారు. ఇలాంటి సినిమా చూస్తుంటే తన గుండెలో గుబులు మొదలైందని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement