సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్‌లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. సునీత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఏమోషనల్ పోస్ట్ చేశారు.
(ఇది చదవండి: నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్)
ఇవాళ లెజెండరీ సింగర్, దర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయనను తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఆయనతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
సునీత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం ఆంటే ఎలా.. పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుడ్ని ఈరోజుమాత్రం ఎప్పటికి నిందిస్తూనే ఉంటా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం సెప్టెంబర్ 25, 2020లో మరణించారు.
(ఇది చదవండి: అంగరంగ వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment