
సాక్షి, న్యూఢిల్లీ: క్రీజులోకి దిగితే బౌలర్లకు చుక్కలు చూపించే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లు వేసిన బంతిని అంతే వేగంతో ఏమాత్రం కనికరం లేకుండా బంతులను బౌండరీలకు తరలిస్తాడు. అందుకే కోహ్లీకి పరుగుల యంత్రం అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. క్రీజులో కుదురుకుంటే చాలు సెంచరీలతో చెలరేగిపోతాడు. అటువంటి కోహ్లీని భయపెట్టిన బౌలర్ ఉన్నాడంటే నమ్ముతారా? కానీ అది నిజం. విరాట్ ఓ బౌలర్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడ్డాడంట.
2011లో శ్రీలంకతో జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్‌లో 31 పరుగులకే సచిన్, సెహ్వాగ్‌ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ గంభీర్ సాయంతో 83 పరుగులు జోడించి 35పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. అప్పుడు కోహ్లీ అందించిన ఆ భాగస్వామ్యం ప్రపంచకప్ గెలవడంలో కీలకమైంది.
ఇటీవల అమీర్‌ఖాన్ వ్యాఖ్యాతగా త్వరలో ప్రసారం కానున్న టీవీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కోహ్లీ తనను భయపెట్టిన బౌలర్ గురించి తెలిపాడు. 2011ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో లసిత్ మలింగ యార్కర్లను ఎదుర్కోవడానికి భయపడ్డానని చెప్పాడు. రెండు మూడు బంతులు ఆడిన తర్వాతనే క్రీజులో కుదురకున్నానని చెప్పాడు. దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో పలు అంశాలను అమీర్‌తో కలిసి బుల్లితెరపై పంచుకున్నాడు. ఈసందర్భంగా తన ప్రేయసి అనుష్క శర్మ గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment