‘అతని బౌలింగ్‌ అత్యంత కఠినం’ | Mohammad Amir is the toughest bowlers I have faced, reveals Virat Kohli | Sakshi
Sakshi News home page

‘అతని బౌలింగ్‌ అత్యంత కఠినం’

Published Mon, Oct 16 2017 12:24 PM | Last Updated on Mon, Oct 16 2017 12:24 PM

Mohammad Amir is the toughest bowlers I have faced, reveals Virat Kohli

సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటి వరుకు ఎదుర్కొన్న బౌలర్లలో పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ అమీర్‌ బౌలింగ్‌ అత్యంత కఠినమైనదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లి అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తూ..దీపావళి సందర్భంగా జీటీవీ రూపోందించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆదివారం ప్రసారమైన ఈ ప్రోగ్రామ్‌లో అమీర్‌.. కోహ్లీని మీరు ఎదుర్కొన్న అత్యంత బెస్ట్‌ బౌలర్‌ ఎవరని ప్రశ్నించగా.. బెస్ట్‌ బౌలర్లు ఇద్దరు ముగ్గురున్నారని, కానీ నాకెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలింగ్‌ మాత్రం మహ్మద్‌ అమీర్‌దేనని చెప్పుకొచ్చాడు. అతనో గొప్ప బౌలర్‌ అని కొనియాడారు.

ఇక ఆసియాకప్‌ సందర్భంగా విరాట్‌ అమీర్‌ను కొనియాడుతూ.. తన బ్యాట్‌ను బహుమతిగా అందజేసిన విషయం తెలిసిందే. అమీర్‌ కూడా నాబెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ కోహ్లినేని పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇక అమీర్‌ చాంపియన్స్‌ ట్రోఫి ఫైనల్లో భారత టాప్‌ ఆర్డర్‌ కుప్పకూల్చిన విషయం విదితమే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement