టీవీ సిరీస్‌లో నటించింది కోహ్లీనా! | Brother is it you Mohammad Amir tags Virat Kohli | Sakshi
Sakshi News home page

టీవీ సిరీస్‌లో నటించింది కోహ్లీనా!

Published Sat, May 16 2020 10:55 AM | Last Updated on Sat, May 16 2020 11:22 AM

Brother is it you Mohammad Amir tags Virat Kohli - Sakshi

కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలతోపాటూ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఇంట్లోని చిన్నా చితకా పనులు చేస్తూ, మిగిలిన సమయంలో ఎక్కువ శాతం టీవీలకే అతుక్కు పోతున్నారు. ఇక పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ అమీర్‌ తాను చూసే టీవీ సీరీస్‌లోని నటులను కూడా క్రికెటర్లతోనే పోల్చుకుంటున్నాడు. ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ అంటూ ఇంతకు ముందు భారత కెప్టెన్‌ని ఆకాశానికెత్తిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌ మరోమారు కోహ్లీని తలుచుకున్నాడు. ఇంట్లో ఓ టీవీ సిరీస్‌ చూస్తున్న సమయంలో కొద్దిగా కోహ్లీ పోలికలున్న నటుడు కనిపించడంతో వెంటనే ఓ ఫోటో తీసి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. అన్నా నువ్వేనా ఇందులో ఉంది, కాస్త అయోమయంలో ఉన్నా అంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు.
 


ఇక కోహ్లీలా కనిపించిన నటుడిపేరు కావిట్ సెటిన్ గోనర్. టర్కీష్‌కి చెందిన ‘దిరిలిస్ ఎర్టుగ్రుల్ ఘజ్’ సిరీస్‌లోనిది ఈ ఫోటో. మరోవైపు ఇస్లామిక్‌ చరిత్ర, అందులోని విలువలను చూపించే ‘దిరిలిస్ ఎర్టుగ్రుల్ ఘజ్’ సిరీస్‌ని చూడాలంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ యువతకు ఇంతకు ముందే పిలుపునిచ్చారు.


సరదాగా మహ్మద్‌ అమీర్‌ చేసిన కామెంట్‌కు నెటిజన్లు పెద్దఎత్తున  తమ క్రియేటివిటీ జోడిస్తున్నారు. విరాట్‌ కోహ్లీలా కనిపించే మిగతావారిని పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు సరదాగా పోస్ట్‌ చేసిన ఫోటోలు, వారి కామెంట్లు మీకోసం.


లోవర్‌, మిడిల్‌, అప్పర్‌, ఎన్‌ఆర్‌ఐ, బీపీఎల్‌ విరాట్‌ కోహ్లీ 

నన్ను కోహ్లీతో పోల్చడం మిస్సయ్యారా?

స్పెయిన్‌ కోహ్లీ(ఎడమ), విరాట్‌ కోహ్లీని కలవండి... పోల్చినందకు తిట్టొద్దు (కుడి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement