ఆమిర్‌ ఖాన్‌తో కోహ్లి మాటామంతి.. | Aamir gives specail gift to virat | Sakshi
Sakshi News home page

ఆమిర్‌ ఖాన్‌తో కోహ్లి మాటామంతి..

Published Wed, Oct 4 2017 4:59 PM | Last Updated on Wed, Oct 4 2017 7:01 PM

Aamir gives specail gift to virat

విభిన్న రంగాలకు చెందిన ఇద్దరూ సూపర్‌స్టార్లు ఒకే వేదికపైకి వస్తే.. ఆ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీపావళి పండుగ సందర్భంగా భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ఖాన్‌తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. అంతేకాదు.. ఈ చాట్‌షోలో తన మనస్సు విప్పి పలు పంచుకున్నాడు. ప్రియురాలు అనుష్క శర్మ గురించి మాట్లాడుతూ.. 'తను నిజాయితీగా ఉంటుంది. ప్రేమగా చూసుకుంటుంది. తనను ద్వేషించడానికి ఏమీ లేదు. కానీ తను ఎప్పుడూ ఐదారు నిమిషాలు లేటుగా వస్తుంది. అది నాకు నచ్చదు. తను నా వెంట అన్ని వేళల ఉంటుంది. మా మధ్య గొప్ప అవగాహన ఉంది. మేం కలిసి ఉన్న గత మూడు-నాలుగేళ్లలో ఒక వ్యక్తిగా తను నన్ను తను మెరుగుపరిచింది' అని విరాట్‌ చెప్పాడు. ఈ చాట్‌ షోలో మీ ఫెవరేట్‌ సినిమాలు ఏమిటని ప్రశ్నించగా.. అన్నీ ఆమిర్‌ఖాన్‌ సినిమాలనే కోహ్లి చెప్పాడు. అంతేకాదు ఆమిర్‌-అనుష్క జంటగా నటించిన 'పీకే' సినిమా కూడా తనకు ఇష్టమని చెప్పాడు. 'ఔను ఆ సినిమా నీకు నచ్చితీరాలి' అంటూ ఆమిర్‌ చమత్కరించాడు.


ఈ ప్రత్యేక చాట్‌షో దీపావళి సందర్భంగా 'జీ టీవీ' ప్రసారం కానుందని తెలుస్తోంది. ఈ షో సందర్భంగా ఆమీర్‌ తన 'దంగల్‌' క్లాప్‌బోర్దు విరాట్‌కు కానుకగా ఇవ్వగా.. బదులుగా తన క్రికెట్‌ జెర్సీని ఆమిర్‌కు కోహ్లి కానుకగా ఇచ్చాడు. అంతేకాకుండా తన వీరాభిమాని అయిన ఆమిర్‌ కొడుకు ఆజాద్‌కు తన సంతకం చేసిన బ్యాట్‌ను కానుకగా అందించాడు. ఈ చాట్‌షో ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ తాజా పోస్టు

Much needed break with my ❤

A post shared by Virat Kohli (@virat.kohli) on

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement