విరాట్, అనుష్కల 'లవ్'పై అమీర్ తడబాటు!
విరాట్, అనుష్కల 'లవ్'పై అమీర్ తడబాటు!
Published Sun, Nov 9 2014 9:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ తార అనుష్క శర్మల ప్రేమ వ్యవహారం గురించి చాలానే విన్నాం..చదివాం. అయితే ప్రస్తుతం 'పీకే' చిత్రంలో మిస్టర్ ఫర్ పెక్ట్ సరసన అనుష్క నటిస్తోంది. 'పీకే' షూటింగ్ సెట్లో విరాట్ ఎక్కువ సార్లు కనిపించడంపై అమీర్ ఖాన్ ను రిపోర్టర్లు స్పందించమని కోరితే. మిస్టర్ ఫర్ ఫెక్ట్ తడబాటుకు గురవ్వక తప్పలేదు.
దాంతో ఏం చెప్పాలో తెలియక పీకే చిత్రంలోని 'థర్కీ చోక్రో' అనే పాటలోని ఓ లైన్ పదే పదే పాడి అమీర్ వినిపించారట. 'అలా చేయకు.. అలా చేయకు' అని అర్థం వచ్చేలా పాట పాడి అమీర్ స్పందించారు. అంతేకాకుండా.. అనుష్కతో పనిచేయడం చాలా నచ్చింది. ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది అని అమీర్ కితాబిచ్చారు.
Advertisement
Advertisement